Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టీమిండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ లంక ప్రిమియర్ లీగ్(ఎల్‌పిఎల్)లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాండీ టస్కర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మునాఫ్ మంగళవారం ట్వీట్ చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారతజట్టులో మునాఫ్ కీలక ఆటగాడు. కాండీ ఫ్రాంచైజీకి బాలీవుడ్ స్టార్ సాల్మన్ ఖాన్ తమ్ముడు సొహైల్‌ఖాన్ యజమాని. కాండీ తరఫున ఆడేందుకు ఇర్ఫాన్ పఠాన్, వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్, కుశాల్ పెరీరా ఒప్పందం కుదుర్చుకోగా.. కోచ్‌గా హసన్ తిలక్‌రత్నే ఎంపికయ్యాడు. భారత్‌కే చెందిన యువ ఆటగాళ్లు మన్విందర్ బిస్లా, మన్‌ప్రీత్ గోనీ కూడా కాండీ తరఫున ఆడనున్నారు. కాండీ టస్కర్స్ నవంబర్ 26న కొలంబో కింగ్స్‌తో తొలిమ్యాచ్ ఆడనుంది.