Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామాయణంలో ఎంతో ఆత్మాభిమానం కలిగిన పాత్ర సీత. భారతీయ సాహిత్యంలో సీతని ప్రధాన పాత్రగా చేసుకొని, ఆమె కోణంలో వచ్చిన ఏకైక నవల 'సీత'. కన్నడంలో హెచ్.జి. రాధాదేవి రాసిన ఈ నవలని వేలూరి కృష్ణమూర్తిగా అందంగా తెలుగులోకి అనువాదం చేశారు. స్త్రీ కోణంలోంచి సీత మూర్తిమత్వాన్ని, సౌందర్యాన్ని, ఆత్మగౌరవాన్ని అత్యున్నతస్థాయిలో చిత్రించిన చక్కటి నవల ఇది. సీత విద్వత్తును, తార్కిక ప్రజ్ఞను, ప్రతిభాసంపత్తులను రాధాదేవి చక్కగా చిత్రించారు. కన్నడనాట ఎంతగానో ఆదరణ పొందిన ఈ నవల ఇప్పుడు తెలుగులో వచ్చింది. సీత బలీయమైన వ్యక్తిత్వాన్ని రూపు గట్టించిన ఈ నవల మొదలుపెడితే ఆసాంతం చదివిస్తుంది. అంతటి సృజనాత్మకమైన అనువాదమిది. సీతని కళాత్మకంగా ఆవిష్కరించిన భాస్కర్ బొమ్మ బాగుంది.
సీత- కన్నడమూలం: హెచ్.జి.రాధాదేవి, అనువాదం: వేలూరి కృష్ణమూర్తి, పేజీలు: 192, వెల: రూ. 120, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు