Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గీనడ్మ సెల్ఫీ మానియా మస్తు పెరిగింది. దీనికి మన ప్రధాని మోడీ బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఎవడు ఏ పని చేసినా సెల్ఫీ తీసుడు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టుడు. ఆఖర్కి చెంబట్కబోయోటోడు గీన సెల్ఫీదీసి పోస్టింగ్‌లు పెడుతుండు. ఆ ఫొటో జూసి వీడికి వస్తుందో రావట్లేదో అనే అర్ధం కాని ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న మొఖాన్ని చూసి ఫ్రండ్స్ లైక్‌లు, కామెంట్లు... అంటే సెల్ఫీ మోజు ఎంతపెరిగిందో తెలిసిందిగా. దీని మోజులో డాబా చివరి వరకూ వెళ్లి కిందపడి ప్రాణం పోయినోళ్లు.. రైలింజను ఎక్కి షాక్ కొట్టి చచ్చినోళ్లు.. చెరువొడ్డుకెళ్లి నీళ్లలో పడి మునిగినోళ్లను చూశాం. కానీ హైదరాబాద్ బాలాపూర్‌లోని మినార్ కాలనీలో అంజుమ్ తను చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని భర్త, అత్త, ఆడపడుచు వేధింపులే తన చావుకు కారణమని తన వాంగ్మూలాన్ని రికార్డు చేసి వాళ్ల దిమ్మదిరిగేలా చేసింది. ఇక దీన్ని ప్రచారానికి సోషల్ మీడియా ఉండనే ఉందిగా.
- పుప్పాల