Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యతో సాధికారత
చదువుకోడం ద్వారా మహిళలు సాధికారతను సాధించుకునే సంవిధానాన్ని 'సాధికారతకు ప్రతీక' కవర్‌స్టోరీ వివరించింది. నిజామాబాద్ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ వృత్తి నిబద్ధతను అభినందించాలి. ఐటిఐలు నిర్వహించగల విశిష్టపాత్రని తెలియజెప్పిన తీరు నచ్చింది.
- ఎం.సుజాత, మిర్యాలగూడ
వారి నిజాయితీ ఆదర్శప్రాయం
తమ వృత్తి జీవితాన్ని నిజాయితీతో నిర్వహించేవారు సమాజంలో మేలిమి మార్పులకు దోహదం చేయగలరని ఈవారం కవర్‌స్టోరీ తెలియజేస్తుంది. నిజామాబాద్‌లోని ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ కె.రామ్మోహన్‌రావు గారి తమ వృత్తిని నిజాయితీ, నిబద్ధతలతో నిర్వహించారు కనుకనే అక్కడ ఐటిఐ జాతీయస్థాయిలో పేరొందింది. వీరి నిబద్ధత విద్యారంగంలో పనిచేస్తున్నవారికి ఆదర్శప్రాయం కావాలి.
- ఎస్.శ్రీనివాస్, హైదరాబాద్
శ్రమదోపిడీని చిత్రించిన కథ
తమ కష్టార్జితాన్ని కూడా తాము అనుభవించలేని శ్రమ జీవుల బతుకు వెతల్ని ఎ.డి.ప్రభాకరరావు కథ 'రెజాలు' వివరించింది. పోలీసుల దాష్టీకం ఏ తీరుగా ఉంటుందో చెప్పిన తీరు ఆకట్టుకుంది. శ్రమదోపిడి తీరుతెన్నుల్ని సరిగ్గా చిత్రించారు.
- డి. మల్లికార్జున్, వరంగల్
లఘుచిత్రాల పరిచయం ఆసక్తికరం
వారం వారం అఖిల పరిచయం చేస్తున్న లఘుచిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈవారం ఇచ్చిన రెండు చిత్రాల వివరాలు చదువుతుంటే వాటిని చూడాలనిపించింది. కొత్తదనం వున్న చిత్రాల గురించి చెబుతున్న తీరు బావుంది.
- కిరణ్‌కుమార్, సూర్యాపేట
చదవాలనిపించే నవల
తొలి మలయాళ నవల 'ఇందులేఖ' పరిచయం బాగుంది. దీనిని చదువుతుంటే నవల చదవాలనిపించింది. నవలని పరిచయం చేసిన తీరు నచ్చింది. అలాగే మడిపల్లి హరిహరనాథ్ కవిత 'పొద్దు తిరుగుడు పువ్వు' చదివా. బాగుంది.
- పి. సోమయ్య, నిజామాబాద్