Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చెయ్యకపోతే మూడు అప్పులు, చేస్తే ఆరు అప్పులు' అన్న చందంగా తయారైంది చేనేత సహకార సంఘాలు, నేతన్నల పరిస్థితి. ప్రజలకు బట్ట కట్టనేర్పి సమాజాన్ని ఓ అడుగు ముందుకు తీసుకెళ్లిన నేత వృత్తివారికి కట్టుకునే బట్ట కూడా కరువైంది. వృత్తి మీదనే ఆధారపడిన వారి ఇళ్లకు వెళితే వారి దైన్యం కళ్లకు కడుతుంది. ఈ నేపథ్యంలో వచ్చిపడిన కరోనాతో మరింత కుదేలయ్యారు. చేనేతను ఆదుకోవడానికి ఎంతో చేస్తున్నామని సమంత లాంటి సినిమా హీరోయిన్ చేనేత బ్రాండ్ అరబాసిడర్‌గా నియమిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆమె కూడా పలు చేనేత సహకార సంఘాలను సందర్శించారు. ఇలా ప్రచారానికి ఖర్చు చేస్తున్నంత కూడా నేత కార్మికుల మేలుకు ఖర్చు చేయడంలేదు
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రం ఏర్పడిన ప్రారంభంలో చేనేతను ఆదుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ఒకటి, రెండు పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ మూడు, నాలుగేండ్లలోనే వాటిని నిర్వీర్యం చేయడం ప్రారంభించింది. ప్రజల సంక్షేమాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇదే బాటలో ఉన్నది.
దీనికితోడు వృత్తి మీద ఆధారపడిన వారికి ఎంతో కొంత ఆసరాగా ఉన్న చేనేత సహకార సంఘాల ఎన్నికల గడువు 9 ఫిబ్రవరి, 2018 నాటికి పూర్తయినా గత మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదు. పర్సన్ ఇన్‌చార్జి కమిటీ (పిఐసి)ల పాలన కొనసాగిస్తోంది. ఆరు నెలలకోసారి పిఐసీల గడువు పెంచుతూ పోతోంది. దీని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
నేతన్నల జీవనం
ఇంటిల్లిపాది నెలంతా కష్టం చేస్తే వారికి వచ్చేది రూ.10వేల నుంచి 12వేలు మాత్రమే. ఏ నెలకు ఆ నెల బొటాబొటిగా సరిగా సరిపోతది. అనారోగ్యాలు వచ్చినా, పిల్లల చదువులకు ఫీజులు కట్టాలన్నా, ఇతర ఏ అవసరం పడినా అప్పు చెయ్యాల్సిన పరిస్థితి. అప్పు చేశారూ అరటే తీర్చే పరిస్థితి ఉండదు సరికదా, ఉన్న అరకొర భూములను, ఇల్లును అమ్ముకుని రోడ్డున పడాల్సిన దీనస్థితి వారిది. ఈ నేపథ్యంలోనే చాలా మంది నేత వృత్తికారులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా కొందరు ఈ వృత్తి మానేసి ఇతర పనుల్లోకి మారడం, కూలీలుగా వెళ్లడం చేస్తున్నారు.
చరిత్ర
ఓ 30, 40 ఏండ్ల కింది వరకు సహకార సంఘాల నుంచి నూలు తెచ్చుకుని, దానికి రంగులు అద్దడం దగ్గరి నుంచి నేయడం, మార్కెట్ వెళ్లి అమ్ముకునే వరకు నేత వృత్తివారే స్వయంగా చేసుకునే వారు. ఊర్లో పెళ్లి లేదా ఏదైనా శుభకార్యం జరిగితే స్వయంగా నేతన్నల ఇంటికి వచ్చి తమకు ఇలాంటి చీర లేదా దోవతి లేదా తువ్వాలు కావాలని ఆర్డర్ ఇచ్చి వెళ్లేవారు జనం. అరతేకాక నేసిన వస్త్రాలను స్వయంగా అరగడిలో కూచుని అమ్ముకునేవారు. మధ్య దళారీలు లేకురడిరి. దాని వల్ల వృత్తి మీద ఆధారపడి జీవించే వారి పరిస్థితి కొంత మేలుగా ఉండింది. సమాజంలో గౌరవమూ వుండింది.
చేనేత సహకార సంఘాలు
ఇంకోవైపు ప్రభుత్వంచే నిర్వహింపబడుతున్న చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీరు కూడా మాస్టర్ వీవర్స్ మాదిరిగానే నూలు ఇచ్చి, నేసినందుకు కూలీ ఇస్తారు. ఇది కూడా ఈ సంఘాల్లో ఉన్న సభ్యులకు మాత్రమే. మాస్టర్ వీవర్స్‌తో పోలిస్తే బెటర్ కూలి దొరుకుతుంది. అయితే ఈ సంఘాలు ప్రభుత్వానికి లోబడి ఉంటాయి. నేసిన బట్టను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. లేదా స్వయంగా సహకార సంఘాలే ఒకటి, రెండు షాపులను నిర్వహించుకుంటాయి.
ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నప్పటికీ మగ్గం మీద నేసిన బట్టను వారు కొనుగోలు చేయరు. కారణం, వారికి లాభం అరతగా ఉండదు. ఒకే బట్టను మిల్లు మీద నేయడం వల్ల స్పీడ్‌గా తయారవుతుంది. మగ్గం మీద నేయడం వల్ల ఎక్కువ సమయం పడుతుంది. కార్మికులకు కూలి ఇవ్వడంలోనే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. అరదువల్ల మగ్గం మీద నేయించిన బట్టలో లాభం ఉండదు. ఇరదువల్ల మిల్లుమీద తయారైన కాటన్ వస్త్రాలను కొనుగోలు చేస్తారు. దాంట్లో మాల్స్ వారికి ఎక్కువ లాభం ఉంటుంది.
పట్టు వస్త్రాలు లాంటివి తప్పనిసరి మగ్గం మీదనే నేయాల్సి ఉంటుంది. మరమగ్గాల మీద నేయడం కుదరదు. మగ్గం మీద ఇద్దరు కూర్చుని డిజైన్‌ను నేస్తారు. ఒకరు కండెలు చుట్టుతారు. ఇలా వస్త్రం తయారీలో శ్రమకే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. దీనివల్ల మగ్గం మీద తయారైన వస్త్రాలకు ఖరీదు ఎక్కువ. లాభం తక్కువ. కాబట్టి మధ్య దళారీలు లేకురడా స్వయంగా ప్రభుత్వర కొనుగోలు చేసి ఆప్కో, టెస్కోలాంటి షోరూమ్‌లలో అమ్మడం లేదా సహకార సంఘాలే షాపులను నిర్వహించి వస్త్రాలను అమ్మి, వచ్చిన డబ్బుతో నూలుకొని కార్మికులకు ఇవ్వడం చేస్తుంటారు. అయితే ఈ షాపుల్లో వస్త్రాలు కొనుగోలు చేసేవారు తక్కువ. నిజానికి మిల్లు వస్త్రం కంటే, మగ్గం మీద తయారైన వస్త్రం చాలా మన్నికగా వుంటుంది.
మాస్టర్ వీవర్స్
రానురాను నేతన్నలు పరాధీనులు అయిపోయారు. మాస్టర్ వీవర్స్ వచ్చి రంగులు అద్దిన నూలును ఇచ్చి పోతారు. అది నేసిన తర్వాత మీటరుకు ఇంత అని కూలీ కట్టి ఇచ్చిపోతారు. ఇలా కూలీలుగా మారిపోయారు. పేదరికం వల్ల సరైన ఇండ్లు కూడా వీరికి ఉండవు. మగ్గం మీద ఉండగా ఏ ఎలుకలో వచ్చి దారాలను ముక్కలు ముక్కలుగా కొరికిస్తే ఆ నష్టాన్ని నేసేవారే భరించాల్సి ఉంటుంది. పట్టు వస్త్రాలు లాంటివి నేసేటప్పుడు డిజైన్ చేసేటప్పుడు ఒక్క పోగు తప్పుగా పడి ఓ 5, 10 నిమిషాలు అది గమనించుకోకుండా నేసారూ అరటే మొత్తం దాన్ని విప్పి తిరిగి నేస్తారు. దీనివల్ల ఒకోసారి ఒకపూట, ఒక రోజు కూడా సమయం వృథా అవుతుంటుంది. ఇవన్నీ మాస్టర్ వీవర్స్‌కు పట్టదు. తాము ఇచ్చిన నూలు ఎన్ని మీటర్లు నేసారు అన్నదాన్ని బట్టే కూలి లెక్కగట్టి ఇస్తారు. ఈ మాస్టర్ వీవర్స్ పద్మశాలీలే ఉండరు. పెట్టుబడి పెట్టగలిగిన వారు ఎవరైనా ఉంటారు. వీరు దాదాపు తమ స్థాయికి తగ్గట్టుగా మగ్గాల మీద నేయిస్తుంటారు. ఒక్కొక్క మాస్టర్ వీవర్ 100 నుంచి ఆపైన మగ్గాలకు నూలు సరఫరా చేసి, నేయిస్తుంటాడు. సాధారణంగా ఎక్స్‌పోర్ట్ చేసే వస్త్రాలను ఈ మాస్టర్ వీవర్స్ నేయిస్తురటారు. ఇలా పెట్టుబడి పెట్టగలిగినవారు బాగుపడుతున్నారు కానీ వృత్తిమీద ఆధారపడిన వారికి కూలి కూడా గిట్టుబాటుకాని పరిస్థితి నెలకొన్నది.
కరోనా
ఈ నేపథ్యంలోనే కరోనా వచ్చిపడింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తిండికి వెళ్లడం కూడా కష్టంగా తయారైంది. మగ్గం మీద ఉన్న నూలు వరకు నేసారు. కొత్త నూలును మాస్టర్ వీవర్స్ ఇవ్వలేదు. పూట గడవడమే కష్టమైపోయింది. రేషన్ మీద వచ్చిన బియ్యంతో కడుపు నింపుకున్నప్పటికి పోషకాహార లోపంతో అవస్థలు పడ్డారు. ఇతర అవసరాలకు అప్పులపాలయ్యారు.
అలాగే కరోనా పేరుతో ప్రభుత్వం కూడా చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేయలేదు. కొత్త నూలును ఇవ్వలేదు. నేత వృత్తి వారు నేసి తెచ్చిన వస్త్రాలన్నీ సహకార సంఘాల్లో గుట్టలుగా పేరుకుపోయాయి. ఎప్పటికి కొనుగోలు చేస్తుందో తెలియదు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
చేనేత వృత్తిని వృద్ధిలోకి తేవడానికి, ఆదుకోవడానికి ఎంతో చేస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఊదర గొడుతున్నారు. నేత కార్మికులను ఆదుకోవడానికే బతుకమ్మ చీరలను నేయిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆచరణలో బతుకమ్మ చీరలు నేస్తున్న సిరిసిల్ల నేత కార్మికులకు కూడా ఒరుగుతున్నది ఏమీ లేదు.
వస్త్రాలను కొనుగోలు చేయాలి
కరోనా కాలంలో 2020 సెప్టెంబర్‌లో మాత్రమే చేనేత సహకార సంఘాల ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత 5 నెలలుగా కొనుగోళ్లను నిలిపివేసింది. దీని వల్ల వస్త్రాలు గుట్టలుగా పేరుకుపోయాయి. కార్మికులకు పని లేకురడా అయింది. తయారైన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే సంఘాలకు డబ్బులు జమ అవుతాయి. వాటితో తిరిగి నూలు కొనుగోలు చేసి మగ్గం మీద పనిచేసే వృత్తికారులకు ఇస్తారు. ఉదాహరణకు మోత్కూరు గుండాల సహకార సంఘం బ్యాంకు నిల్వలతో నూలు కొనుగోలు చేసి మగ్గం కార్మికులకు పని కల్పించింది. ప్రభుత్వం వస్త్రాలను కొనుగోలు చేయకపోవడంతో బ్యారకులో పైసా లేక, కార్మికులకు పని కల్పించలేక, చేసిన పనికి కూలి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఇప్పటికైనా వస్త్రాలను కొనుగోలు చేసి మగ్గం మీద ఆధారపడి జీవిస్తున్న వారికి పనికి కల్పించాలని నేతన్నలు కోరుతున్నారు.
ఎన్నికలు నిర్వహించాలి
ప్రతి 5 ఏండ్లకోసారి చేనేత జౌళి సహకార సంఘాలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. 9 ఫిబ్రవరి, 2018 నాటికి 5 ఏండ్లు పూర్తయింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్‌చార్జి కమిటీ (పిఐసి)ల పాలన కొనసాగిస్తోంది. ఆరు నెలలకోసారి పిఐసీల గడువు పొడగిస్తోరది. దీనివల్ల సహకార సంఘాలు ఉన్నప్పటికీ పర్సన్ ఇన్‌చార్జీ కమిటీల పాలనలో పరిమిత నిర్ణయాలతో వీటి అభివృద్ధి కుంటుపడింది. నేత కార్మికులు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు సహకార సంఘం బిల్డింగ్ గోడకు మరమ్మతులు చేయాలన్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఎన్నికలు నిర్వహిస్తే పాలక వర్గం నిర్ణయాలు చేసేది. అట్లా పనులు ముందుకు కొనసాగేవి. చేనేత కార్మికుల అభివృద్ధికి ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్తున్న కేసీఆర్ ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని నేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రచారంలో చెప్పినంతగా ఆచరణలో చేనేత వృత్తికి ఒరుగుతున్నది లేదు. ఒకటి, రెండు తడవలు పథకాలను అమలు చేసినప్పటికీ ఆ తర్వాత ఒక్కొక్క పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కార్మికులను ఆదుకోవాలని, ఉత్పత్తి అయిన వస్త్రాలను కొనుగోలు చేయాలని, థ్రిప్ట్ ఫండ్‌ను కొనసాగించాలని, హెల్త్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.
జాతీయ రహదారి 65పై, చిట్యాలకు - నార్కట్‌పల్లికి మధ్యలో ఉన్న వివేరా హౌటల్ వద్ద చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో స్టాల్ నిర్వహిస్తున్నారు. చౌటుప్పల్, కోయలగూడెం, మోత్కూరు గుండాల, నకిరేకల్ తదితర సహకార సంఘాల వారు నేత కార్మికుల నుంచి నేయించిన వస్త్రాలను ఈ స్టాల్ ద్వారా విక్రయిస్తున్నారు. మగ్గాల మీద నేసిన ఈ వస్త్రాలు మన్నికైనవి. మధ్య దళారీలు లేకురడా నేరుగా వినియోగదారులు పొందవచ్చు. ఇక్కడి వస్త్రాలను హౌటల్‌కి సందర్శించిన వారు కొనుగోలు చేస్తే ఆ డబ్బు సంఘాల ద్వారా కార్మికులకు చేరుతుంది. అరటే నేతన్నలకు పని కల్పించినవారవుతారు, ఆదుకున్న వారవుతారు.
- మిర్యాల పద్మ (తాయమ్మ కరుణ)
ప్రభుత్వం నీరు గారుస్తున్న పథకాలు
త్రిఫ్ట్ ఫండ్:
త్రిఫ్ట్ ఫండ్ సేవింగ్ అరడ్ సెక్యూరిటీ స్కీమ్ (TFSSS)ను 2017లో రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం ప్రవేశపెట్టింది. నేత కార్మికులు తమ సంపాదనలో నుంచి 8 శాతాన్ని బ్యాంకులో పొదుపు చేస్తారు. దీనికి ప్రభుత్వం 16 శాతం జమ చేస్తుంది. తమ సంపాదనలో ఎక్కువలో ఎక్కువ రూ.1200లకు మించి పొదుపు చేయడానికి వీలు లేదు. ఇట్లా 3 ఏండ్లు పొదుపు చేసిన అనంతరమే వీటిని నేత కార్మికులు తీసుకోవడానికి వీలుంటుంది.
కరోనా నేపథ్యంలో ఒకటి, రెండు నెలలు అరటే 36 నెలలకు బదులుగా 34 నుంచి 35 నెలలకు ఈ ఫండ్ మొత్తాన్ని ప్రభుత్వం కార్మికులకు ఇచ్చింది. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల మేలు కోరి ప్రవేశపెట్టామని చెప్పింది. అయితే ఈ కరోనా సమయంలో జమ అయిన మొత్తాన్ని తిరిగి చెల్లించిన ప్రభుత్వం తిరిగి వారి నుంచి ఫండ్‌ను కట్టించుకోవడం లేదు. ఈ పథకం వల్ల తమకు కొంత మేలు జరిగినప్పటికీ ప్రభుత్వం నిలిపివేయడంతో నష్టపోతున్నామని నేత కార్మికులు వాపోతున్నారు.
యారన్ సబ్సిడీ
Yarn ఇంగ్లీషు పదం. యార్న్ క్రమేణా యారన్ అయ్యింది. యారన్ అరటే నూలు. నూలు కొనుగోలుపై సబ్సిడీని 3 ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అరదిస్తోంది. ఈ సబ్సిడీలో తరతమ భేదాలు ఉన్నాయి. నూలు కొనుగోలు చేసిన పారిశ్రామికులకు 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. చేనేత సహకార సంఘాలకు మాత్రం 5 శాతం ఇస్తోంది. జియో ట్యాగింగ్ ఉన్న నేత కార్మికులకు కూడా ముఖ్యంగా బతుకమ్మ చీరలు నేస్తున్న సిరిసిల్ల జిల్లా నేత కార్మికులకు కూడా నూలు కొనుగోలుపై సబ్సిడీని ప్రభుత్వం అరదజేస్తోంది. నేషనల్ హాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHDC) నుంచి కొనుగోలు చేసిన నూలుకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తోంది. నూలు కొనుగోలు చేసిన ప్రతి బిల్లుకు సబ్సిడీ ఇవ్వడం లేదు. ఉదాహరణకు నూలు కొనుగోలు చేసిన 10 నుంచి 15 బిల్లులు పెడితే, అరదులో 2 నుంచి 3 బిల్లులకు మాత్రమే సబ్సిడీ ఇస్తోంది. విడి కార్మికులకు కూడా అరదరికీ ఇవ్వడం లేదు. ఇలా పలు అవకతవకలతో ఉన్నప్పటికీ సదరు సబ్సిడీని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.
హెల్త్ స్కీమ్
చేనేత కార్మికుల ఆరోగ్య రక్షణకు హెల్త్ కార్డులను ప్రభుత్వం ఇచ్చింది. ప్రారంభంలో ఏ ఆస్పత్రిలో అయినా రూ.12వేల వరకు ఉచితంగా వైద్యం పొంది, సదరు బిల్లులను పెడితే రీయింబర్స్‌మెంట్ వచ్చేది. అయితే క్రమేణా ప్రభుత్వం పేర్కొన్న సెంటర్లలోనే వైద్యం పొందాలనే నిబంధనలు రూపొందించారు. 5, 6 ఏండ్లుగా ఈ పథకమూ పని చేయడం లేదు. మహాత్మాగాంధీ బునకర్ బీమా పథకం
ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దాదాపు 20 ఏండ్ల కింద అప్పటి బీజేపీ ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టింది. నేత కార్మికులేకాక అనుబంధ రంగాల్లో పనుల్లో చేస్తున్న కార్మికులు ఈ పథకానికి అర్హులు. 18 నుంచి 59 ఏండ్ల లోపు చేనేత కార్మికులు ఇందులో చేరవచ్చు. సంవత్సరానికి కార్మికుడు రూ.80 బీమా చెల్లించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వర రూ.130, జీవిత బీమా సంస్థ రూ.100 జమ చేస్తుంది. మొత్తం ఏడాదికి కార్మికుడి పేరిట రూ.310 ప్రీమియం జమ అవుతుంది. ఈ పథకం కింద కార్మికుని పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఒక్కొక్కరికి ఏటా రూ.1,200 చొప్పున ఇద్దరు పిల్లలకు ఉపకార వేతనం పొందొచ్చు. అలాగే బీమా దారుడు ప్రమాదంలో మరణిస్తే రూ.1.50లక్షలు, సహజ మరణం పొందితే రూ.60వేలు మృతుడి కుటుంబ సభ్యులకు అరదుతుంది. ప్రమాదంలో రెరడు కాళ్లు, రెండు చేతులు కోల్పోతే రూ.1.50 లక్షలు, పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.75 వేలు చెల్లిస్తారు. 5, 6 ఏండ్లుగా కార్మికుల నుంచి బీమా సొమ్మును కేంద్ర ప్రభుత్వం జమ చేసుకోవడం లేదు. ఒకరకంగా ఈ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది.