Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అక్షర జలపాతం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 07,2021

అక్షర జలపాతం

ఆమె మదిలోని భావాలు చుట్టూ జరిగే సంఘటనలతో పుట్టుకొచ్చి అనుభూతులకు ఆజ్యం పోస్తాయి... ఓపలేని వేదనా వెతలను ఒడుపుగా బయటపెట్టి ఓదార్పు జోలలు పాడుతాయి... మస్తిష్క మేరు పర్వతం నుండి ఉద్భవించి పాలకడలై పరుగులిడుతూ అమతపు భావ అలలకు అలవాలమవుతాయి. ఆమె కలమే హలమై సేద్యం చేయగా శ్వేత పొలంపై కవితలపంట పండిస్తున్నాయి... అంతర్మథనమునే పెట్టుబడిగా పెట్టి నైతిక విలువలు గల పైరు దిగుబడికి కవనమే అస్త్రంగా కీచక క్రిములను చీల్చి చెండాడుతున్నాయి...
ఆమె ఎవరోకాదు వర్ధమాన కవయిత్రి శ్రీమతి కాసనగొట్టు స్వప్నకృష్ణ.. ''ఎందుకో ఈవేళ'' అంటూ ఎనభై కవితలతో చక్కని సంపుటాన్ని వెలువరించి సాహితీ క్షేత్రంలో తనకంటూ చక్కని స్థానాన్ని సంపాదించుకొని కవితలపంట పండిస్తుంది.. తన కవితా సంపుటిలోని మచ్చుకి కొన్ని కవితలను మీకు రుచిచూపించాలనే నా ఈ చిన్ని ప్రయత్నం.. తన ''జ్ఞాపకాల పుటలు'' అనే కవితలో కవయిత్రి జ్ఞాపకాలను ఎంత కవితాత్మకంగా గుప్పించిందో చూడండి..
'ఒంటరితనపు నెచ్చెలితో సహచర్యం చేసిన వేళ...
మానసపుత్రికలై మనోగతం నుండి పరుగున వచ్చి పంచనచేరతాయి...
లేలేత పరుగుల బాల్యపు తీయని గురుతులు..
యెదను నిలవనీయని యవ్వనపు చిందులు...
మేటవేసిన అనుభవాల కుప్పలన్నీ
విజృంభించిన ఇసుకతుఫానై వీచి
తనువంతా ముంచుతాయి...
ఉరుకులమయమై ఉసూరుమంటున్న ప్రాణానికి
ఉపశమన గుళికలై జీవామతం పోస్తాయి...'
అంటూ చిక్కని భావామతాన్ని వెదజల్లింది...
ఇంకా 'ఏకాకి జీవితం' అనే కవితలో
'అవును నేను ఏకాకినే..
చుట్టూ సంద్రమల్లే జనమున్నా
ఆదరణ బిందువులకు నోచని ఏకాకిని...
స్నేహముసుగులో దాగిన స్వార్థంతో
అంధకారం అలుముకున్న ఒంటరిపక్షిని...' అంటూ చివరలో 'కవనమే స్నేహమై సాగగా
గోడు వెల్లబోసుకుంటూ
అక్కున చేర్చుకునే ఆలింగంనంకై
ఆశావహ దక్పథంతో జీవిస్తున్న ఏకాకిని...' అంటూ ముగింపుపలికిన స్వచ్ఛమైన మనసున్న ఆశాజీవి స్వప్నకష్ణ గారు... ఇలా చూసుకుంటూ పోతే ప్రతికవిత ఓ కలికితురాయే ఎంతో ఆర్ధ్రత నిండిన భావ కవితలేకాక సమాజపు కుళ్ళును తన కలంతో కడగాలనే అభ్యుదయ భావజాలమున్న కవయిత్రి. తన పుస్తక సంపుటికి పెట్టిన 'ఎందుకో ఈవేళ' అనే శీర్షికతో కూడిన కవితను ఎంత అద్భుతంగా ఆవిష్కరించిందంటే...
'మనసెందుకో
జామురాతిరి జాబిలమ్మ ఒడిలో
సేదతీరిన తారకలా
తన ఉనికిని చాటుకుంటూ ఉరకలేస్తున్నదీ వేళ...
తనువెందుకో
తామరాకుపై జలముత్యంలా
దుఃఖపు ధూళిని జారవిడుస్తున్నదీ వేళ...
ఉల్లమెందుకో మరుమల్లై
మధుర పరిమళాల విందులలో విహరిస్తున్నదీ వేళ...
కనులెందుకో కాకరవత్తులై
మిరుమిట్ల చిలకరింతలతో ప్రకాశిస్తున్నవీ వేళ...
గతస్మతుల కవ్వింతలు జ్ఞప్తికి వచ్చి
పదుగురిలో అభినయాల ఆయువు పోసుకున్నందుకేమో...
వందలో పొందికగా తిష్టమేయక
ప్రత్యేకతల సుగంధంతో తేలుతూ
అస్థిత్వపు రాస్తాను సష్టించుకున్నందుకేమో...'
అంటుంది స్వప్నకృష్ణ గారు... నిజమే మరి వందలో పొందికగా తిష్టవేయకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను సష్టించుకొని ఎల్లలెరుగని కీర్తిసుమాలను పూయించి కవిత్వ పిపాసకుల మదిని తన కవనపరిమళాలతో నింపాలని ఆశిస్తూ.. మరెన్నో కవితా సంపుటాలు తనకలం నుండి జాలువారాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించుతున్నాను.
(ఎందుకో ఈవేళ (కవితా సంపుటి), వెల: రూ.100/-, సెల్‌ : 7780493575)

- వకుళ వాసు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
ఆడబిడ్డలకు భరోసానిద్దాం...

తాజా వార్తలు

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.