Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
నార్సింగి మున్సిపల్ చైర్మెన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్ మున్సిపల్ అద్యక్షులు రామేశ్వరం నర్సింహా, మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్ అన్నారు. శుక్రవారం నార్సింగి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఖానాపూర్ వార్డు నుంచి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తుందన్నారు. ఐదేండ్ల నుంచి ఖానాపూర్ సర్పంచ్‌గా ప్రజలు అవకాశం కల్పించినట్టు తెలిపారు. మరోసారి తమకు చైర్మెన్ అవకాశం రావడంతో జనరల్‌గా బరీలో నిలుస్తున్నట్టు తెలిపారు. టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న పథకాలు ప్రకాశ్ గౌడ్ అండతో నార్సింగి మున్సిపా ల్టీలో అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ సాధించుకుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి నామినేశన్ వేశారు.