Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఈ నెల 17న కడ్తాల్ మండలంలో నిర్వహిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితఇంద్రారెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డితో పాటు పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మార్సీ భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్‌ల్యాబ్‌కు శంకుస్థాపనతో పాటు అన్మాస్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రితో పాటు నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నాయణరెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ అనితారెడ్డి తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు జహాంగీర్‌అలీ, ఉపసర్పంచ్ రామకృష్ణ, నాయకులు గంప శ్రీను, లాయఖ్‌అలీ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.