Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ మద్దతు ధర ఇవ్వక పోవడమే కాకుంగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరువాత నెలల డబ్బులు చెల్లించడం లేదు. దీంతో దిక్కుతోచని రైతులు ఏమి చేయాలో తోచక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరగా చేసుకున్న కొంతమంది మద్య దళారులు కొనుగోళ్ల తీరుపై మండిపడుతున్నారు. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతను అందరూ కలిసి నిలువునా ముంచుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని కాపాడుకున్న పంటను మార్కెట్‌కు తెస్తే తేమ సాకు, తాలు పేరుతో వ్యాపారులు తక్కువ ధరకు బేరమాడుతుండటంతో బేలచూపులు చూడటం అన్నదాత వంతవుతుంది. పత్తి, మక్కరైతులు గిట్టుబాటు లేక లబోదిబోమంటున్నారు. పత్తి పంటకు మద్దతు ధర రూ.5550 ఉండగా మార్కెట్‌లో రూ.4000 నుంచి రూ.4500 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు పెద్దఎత్తున ప్రారంభమైనా ఇప్పటి వరకు మార్క్‌పెడ్ లాంటి సంస్థ కొనుగోలు కేంద్రం జాడలేదు. ఒకవేళ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా తమకు పెద్దగా ఒరిగెది ఏమిలేదని రైతులు పెదవి విరుస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 77వేల హెక్టార్లలో పత్తి, 32 వేల హెక్టార్లలో మక్కలు పండిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మక్కలను రూ.1760 కొనుగోలు చేస్తుండగా, బయట మార్కెట్‌లో రూ.2100 నుంచి రూ.2300 వరకు కొనుగోలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో నాలుగు సెంటర్లలో మాత్రమే కొనుగోలు కేందాలను మార్కుఫెడ్ అధికారులు ఏర్పాటు చేశారు. ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న అన్నదాతకు దళారుల బెడద ఎప్పుడూ ఉండనే ఉంటుంది. పంటలకు చీడపీడలలాగా వీరుకూడా రైతులను అంటిపెట్టుకునే ఉంటారు. వీరు ఎక్కడికి వెళితే అక్కడ వీరికన్నా ముందే ప్రత్యేక్షం అవుతారు. దీంతో వీరికి గిట్టుబాటు ధరలు ఎలాగూ రావు. కనీసం మద్దతు ధరలలు కూడా రాకుండా చేస్తారు. తాము దర్జాగా కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడపడానికి అన్నట్టుగా వీరు వ్యాపారులతో కుమ్మక్కయి రైతులను నిలువునా పీల్చేస్తుంటారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వీరు లేకుండా మార్కెట్లు ఉండవు. వ్యాపారులు ఉండరు. దీంతో రైతులు ఇదంతా తమ ఖర్మగా భావించి చివరకు అటుతిరిగి ఇటుతిరిగి వారివద్దకే వెళ్ళాల్సిన దుస్తితి ఏర్పడుతోంది. దళారుల కారణంగానే రైతులు తము పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర పేరుకే ఉంటాయి. సీజన్ ప్రారంభంలో ఆశించిన రీతిలో లభించినా కొద్ది రోజుల్లోనే తగ్గుముఖం పట్టేలా చేస్తారు. కారణం పంటబాగా వచ్చిందనో లేదా, మార్కెట్‌లో ఆదరణ లేదనో ప్రచారం చేస్తారు. తీసుకుని వచ్చిన ధాన్యం అయినకాడికి అమ్ముకునేలా చేస్తారు. ఇప్పడు మక్కల ధరలను తీసుకుంటే ఆదే విషయం అర్థం అవుతోంది. వివిధ మార్కెట్లలో ధరలు దారుణంగా పడిపోయాయి. రైతులు ఆందోళనకు దిగినా పలకరించే వారు లేరు. మక్కలను ధర పలకడం లేదు. కొద్దిరోజులుగా వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం రాక పెరగడంతో ఆదే అదనుగా భావించిన వ్యాపారులు తక్కువకు కోనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని రోజుల నుంచి మార్కెట్‌కు మక్కలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆదే అదనుగా దళరులు రంగప్రవేశంచేసి వద్దతు ధరలను మాయం చేశారు. ఈ క్రమంలో వ్యాపారులకు అందేలా చూడడంతో రైతులు తీవ్రంగా నష్టపొతున్నారు. మద్దతు ధరను రైతులకు అందేలా చూడడంలో మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారులకు కొందరు అధికారులు సహకరిస్తుడడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు పంటలు నష్టపోగా వచ్చిన కొద్దిపాటి దిగుబడిని మార్కెట్‌కు తెస్తే మద్దతు ధరలు లభించకపోవడం వారిని కృంగదీస్తోంది. తేమ, మట్టి పేర సాకులు చెబుతూ గిట్టుబాటు ధర ఇవ్వడంలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సివిల్‌సప్లయి, మార్కెఫెడ్‌ను రంగంలోకి దింపి మక్కలను ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు కోరుతున్నా అనుకున్న స్పందన రావడం లేదు. మార్కెట్ కమిటీకి పాలకవర్గాలను నియమించినా వారు కూడా చేతులెత్తేస్తున్నారు. వికారాబాద్ మార్కెట్‌కు నేటికీ పాలక వర్గం లేదు. కోనుగోళ్లు చేపట్టకపోవడంతో వారం రోజులుగా మార్కెట్ యార్డులో ధాన్యం రాశులు పేరుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. తేమ తగ్గితే ప్రభుత్వ మద్దతు వస్తుందనే ఆశతో రైతులు నాలుగైదు రోజులుగా యార్డులో ధాన్యం ఆరబెట్టుకున్నా కొద్దిపాటి తేడా ఉన్నా అధికారి కొనుగోలుకు ముందుకు రాలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదే అదనుగా తక్కువ ధరలను చూపి దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. రైతులు చేసేది లేక వ్యాపారులు అడిగినంత ధరకు అమ్ముకొని ఇంటిముఖం పట్టాల్సిన దుస్థితి మార్కెట్‌లో నెలకొంది.