Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహిపాల్ అన్నారు. శనివారం వికారాబాద్‌లో కేవీపీఎస్ కార్యాల యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహా ఉన్నతమైన భారత రాజ్యాంగానికి బీజేపీ మనువాదులు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. దేశంలో రాజ్యాంగానికి రక్షణ కరువైందని అన్నారు. కులం, మతం, గో రక్షకుల పేరుతో దళిత, మైనార్టీల, గిరిజనుల పైన దాడులు, హత్యలు హత్యచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాన్య రాష్ట్రాలు క్రిస్టియన్ మైనార్టీలకు దళితులకు రక్షణ కరువైందని అన్నారు.
ఐక్యతా లౌకికవాదం దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కులాలకు మతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండి భారత రాజ్యాంగాన్ని ఆచారాలను కాపాడుకోవాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆరేండ్ల కాలంలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కేసీఆర్ నియంత పాలన సాగుతోందని, సకాలంలో దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని దూషించారు. ప్రభిత్వా హాస్టల్స్‌లో మెడికల్ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని, రాత్రి డ్యూటీ టీచర్‌ను ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్, జిల్లా నాయకులూ మల్లేష్, సుదర్శన్, రాజేందర్, లాలయ్య, శ్రీను వెంకట్, యాదయ్య మల్లేష్, సుభాష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.