Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
బాలికల ఆత్మరక్షణకు కరాటే శిక్షణ అవసరమని ఏఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణంలోని నవీన ఆదర్శ పాఠశాలలో బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ప్రిన్సిపాల్ నరేశ్‌రాజు మాట్లాడుతూ ఆడపిల్లల ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. బాలికలు కరాటే నేర్చుకుంటే ధైర్యంగా ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో మహి ళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. అందువల్ల ఆత్మరక్షణ కోసం కరాటేను తప్పనిసరిగా ఉపయోగపడుతుందని అన్నారు. కరాటే శారీరక దృఢత్వంతో పాటు మేధాశక్తి పెరుగుతుందన్నారు.
అంతేకాకుండా కరాటే మహిళలు, బాలికలు స్వేచ్ఛగా తిరిగేందుకు దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పిల్లలకు రక్షణ కల్పించాలని సూచించారు. అమ్మాయిలంతా కరాటే నేర్చుకుని పోకిరిగల భరతం పట్టాలని తెలిపారు. విద్యార్థినులకు ఇలాంటి శిక్షణ ఇప్పిస్తున్న పాఠశాల యజమాన్యాన్ని ఏఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్ రాజు, కరాటే మాస్టర్ సురేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. 0 జ్‌ూ