Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం పాత పోలీసుక్వార్టర్స్ వద్ద రెండువేల గజాల స్థలంలో నిర్మిస్తున్న మార్కెట్‌ను మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 523 జీవోను వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పార్థసారథి విడుదల చేశారు. మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణానికి ఇప్పటికే రూ.కోటి 6లక్షలను స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కేటాయించారు. ఇక ఈ స్థలాన్ని మోడల్ కూరగాయల కేంద్రానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడంతో మార్కెట్ నిర్మాణానికి పూర్తిగా అడ్డంకులు తొలగిపోయాయని స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కూరగాయల రైతులు, వీధుల్లో కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపారులకు మార్కెట్ కష్టాలు తీరనున్నాయని చెప్పారు. ఈ మార్కెట్‌లో అదనపు వసతుల కల్పనకు మరో రూ.70 లక్షల విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.