Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోమిన్‌పేట్
మండల పరిధిలోని అమ్రాది కుర్దు గ్రామంలో అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. గురువారం మండల పరిధిలోని అమ్రాది కుర్దు గ్రామంలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఉన్న పెంట కుప్పలు తీసివేయడంతో అదే గ్రామానికి చెందిన బురాన్, జలీల్, ఇస్మాయిల్, హైమద్ అనే వ్యక్తులు ఖాళీ స్థలంలో కబ్జా చేయడం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. వీరిపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. గ్రామ సర్పంచ్, కార్యదర్శిలకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. అనంతరం తహసీల్దార్‌కు, సూపరెండంట్ శాంతకు వినతి ప్రతం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు