Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకరపల్లి
శంకరపల్లి మార్కెట్‌లో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఏ కూరగాయలను తీసుకున్నా.. కిలో రూ. 40 నుంచి 100 వరకు ధర పలుకుతుండటంతో సామాన్యుడు బెంబేలెత్తి పోతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు సైతం దీటుగా దరువేస్తుండటంతో వినియోగదారులు కూరగా యలు కొనాలంటే జంకుతున్నారు. కొద్దిరోజుల కిందటి వరకు ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టినా.. ప్రస్తుతం మాత్రం ఉల్లి వినియోగదారులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్కెట్లో నెల కిందట ఉల్లి ధర రూ. 50 ఉంటే, ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా, పచ్చిమిర్చి, వంకాయలు, బీరకాయ, కాకర, దొండకాయలు, చిక్కుడుకాయలు కిలో రూ. 40 నుంచి 50 వరకు పలుకుతున్నాయి. ఇది వరకు వంద రూపాయలతో వారానికి సరిపడా కూరగాయలు చేసేవారు.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడు వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే అదనంగా మరో వంద రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని లేదంటే అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తోం దని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. గతంలో చికెన్ కొనాలంటే భయపడేవాళ్లు ప్రస్తుతం కూరగాయలు కొనాలంటే భయపడా ల్సిన వస్తోందని మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ధరల నియంత్రణకు చొరవ చూపాలని వినియోగదారులు కోరుతున్నారు.
ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది
కూరగాయల ధరలు మరింత పెరగడమే తప్ప తగ్గే అవకాశం కని పించడం లేదు. పెరిగిన ధరల ప్రభావం సామా న్య ప్రజలతో పాటు వ్యాపారులపై కూడా పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందించి కూరగాయల సాగుకు సమకారమందించాలి.
వ్యాపారి మల్లయ్య
ఇకపై చూసి మురవాల్సిందే..
మార్కెట్‌లో కూరగాయలను ఇకపై చూసి మురవాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలతో మార్కెట్‌లో ఏ కూరగాయలు కొనాలన్నా రూ. 50 నుంచి 80 రూపాయల పైమాటే. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలా అయితే సామాన్యుడికి ఇక పప్పు నీళ్లే దిక్కు. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చొరవ చూపాలి.
గృహిణి వడ్ల సుశీల