Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిగి: విద్యార్థులను ఆహ్లాదపరుస్తూ పాఠాలు బోధించాలని మండల విద్యాధికారి హరి చందర్ అన్నారు. గురువారం పరిగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెంబర్1లో రెండో జారుపుల్ లర్నింగ్, ట్రైయినింగ్ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలు బడికి సంతోషంగా వచ్చే విధంగా మానసిక సంసిద్ధత చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. వారికి కథల ద్వారా విద్యాభోదన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయు లు ఆర్పీలు ఎండీ ఉస్మాన్‌అలీ, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.