Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేయనున్నట్టు ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ తెలిపారు. దండుమైలారం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలని, తరువాత ఎన్నికలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అప్పుడే ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. 30 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాలను సుందరంగా తయారయ్యాయన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి ందన్నారు. సర్వంచులుకూడా సంతోషంగా ఉన్నారని చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టడం జరిగిందని వివరించారు. పరిశుభ్రత కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లీశ్వరి, ఉప్పసర్పంచ్ హర్షవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు అరుణ, అనసూయ, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, ఏఈ ఇంద్రసేనారెడ్డి, నాయకులు చీమల జగన్నాథం, రాకేష్‌గౌడ్ ఉన్నారు.