Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మొయినాబాద్
నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు నక్కలపల్లి సర్పంచ్ స్వప్న కుమారి అంజయ్యగౌడ్ అన్నారు. గురువారం మండలంలోని నక్కలపల్లిలో సీఐ వెంకటేశ్వర్లు సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంపై మమకారంతో లక్ష రూపాయల సొంత నిధులు వెచ్చించి 10 సీసీ కెమెరాలు అమర్చినట్టు తెలిపారు. ఇకపై గ్రామం నిఘానీడలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఐ మాట్లాడుతూ సీసీ కెమెరాలు శాంతిభద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని, నేరాల నియంత్రణే కాకుండా కేసులు ఛేదించడంలోనూ సీసీ కెమెరాలు కీలకంగా మారుతున్నాయన్నారు. అంతేకాక ఆధారాలు సేకరిస్తున్న సమయంలో సీసీ కెమెరాల ఫుటేజీ సాంకేతిక సాక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై వెంకట్, నాయకులు అంజయ్యగౌడ్, ఉప సర్పంచ్, శ్రీకాంత్ రెడ్డి, వార్డ్ సభ్యులు భాను గౌడ్, ప్రవీణ్ కుమార్, రాజు, సులోచన, అశ్విని, శ్యామల, యాదమ్మ, వీఆర్‌ఏ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, వెంకటయ్య, అంగన్‌వాడీ టీచర్, గ్రామస్తులు పాల్గొన్నారు.