Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి అనుకొని ఉన్న జాతీయ రహదారులపై తరుచుగా.. మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల 44వ జాతీయ రహదారిపై నిత్యం రధ్దీగా ఉంటూ వేలాది వాహనాలు నిలిపే ప్రదేశం తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద దిశపై లైంగికదాడి, హత్య చేసిన సంఘటన వెలుగు చూసిన విషయం విధితమే. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై పోలీసు నిఘా వైఫల్యం కూడా ఒక ప్రధాన కారణమంటూ..! పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నేటికీ జాతీయ రహదారులపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. ఇంకా ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాల్సివస్తుదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విచ్చలవిడిగా బెల్టుషాపులు..
జాతీయ రహదారులపై బెల్లుషాపులు విచ్చల విడిగా వెలువడంతో ఆకతాయిలకు జాతీయ రహదారులే అడ్డాగా మారాయి. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద వేలాది వాహనాలు నిలుస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సరుకులు రవాణా చేసే వాహనాలు ఇక్కడికి వచ్చి నిలుపుతారు. హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ఇదే ప్రధాన కూడలి. ఈ ప్రాంతం నుంచి నాలుగు రాష్ట్రాలకు వెళ్లడానికి రోడ్డు మార్గం ఉన్నది కావున ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇదే అదునుగా బెల్టుషాపు వ్యాపారాని యథేచ్చగా కొనసాగిస్తున్నారు. తప్పతాగిన మానవ మృగాలు పైశాచిక ఆనందం కోసం అమాయక మహిళలపై దాడులకు పాల్పడుతున్న పరిస్థితి చూస్తునేఉన్నాం. ఈ ప్రాంతలో అనేక మార్లు ఆకతాయిలు తప్పతాగి అమ్మయిలను తీసుకొచ్చి లైగికదాడులు పాల్పడిన ఘటనలపై పోలీసు అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోక ప్రాణం పోయాక హడవుడి చేయడంతో ఏమీ ప్రయోజనమని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా దీర్ఘకాలిక చర్యలు చేపట్టి ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
జాతీయ రహదారుల పై ఉన్న అన్ని జంక్షన్‌ల వద్ద సీసీ కెమెరలు లైటింగ్ ఏర్పాటు చేసి రాత్రి సమయంలో సెక్యూరిటీ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారులు అండర్ పాసు కింద ఎలాంటి లైటింగ్ సౌకర్యం లేక పోవడంతో అండర్ పాసు నిర్మాణాలే ఆకతాయులకు అడ్డాగ నిలుస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళల్లో గ్రామాలకు వెళ్లాలంటే భయంవేస్తోందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు..
పోలీసులు వెంటనే స్పందించాలి : నందకిషోర్
శంషాబాద్‌లో జస్టిస్ ఫర్ దిశపై జరిగిన లైంగికదాడి అందరిని కలచివేసింది.శంషాబాద్లో ఇలాంటి నేరాలు జరగకుండా పోలీసులు వెంటనే స్పందించాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగు పర్చాలి.
టోల్ గేట్ వద్ద వాహనాలు నిలుపొద్దు : ఉట్ పల్లి మాజీ సర్పంచ్ కొండ చంద్రశేఖర్ గౌడ్
బెంగళూరు జాతీయ రహదారి44 తొండుపల్లి వద్ద అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ రహదారి పక్కనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నిలిచి ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో నిరంతరంగా నిఘా పెంచాలి.
రహదారి బాగు చేయాలి : ముచింతల్ మాజీ ఎంపీటీసీ వి.చంద్రయ్య
శంషాబాద్ నుంచి పాలమాకుల వరకూ ఉన్న జాతీయ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలతో పాటు ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలు, మహిళలపై దాడులు జరుగుతున్నాయి. దిశ వంటి అమాయకమైన అమ్మా యిల మీద దుర్మార్గులు పాశవిక దాడి చేసి అంతం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి జాతీయ రహదారి వెడల్పు చేసి అభివృద్ధి చేయాలి.