Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచాల
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో మర్రి నిరంజన్‌రెడ్డి (ఎంఎన్‌ఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ అవసరమన్నారు. అందువల్ల ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభిస్తే ప్రతి పేద విద్యార్థికి ఆంగ్ల విద్య అందుబాటులో ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇంగ్లీష్ విద్య ప్రాంభించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఎంఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
అనంతరం ఎంఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మర్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ మూడేండ్ల నుంచి తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే బుధవారం మంచాల మండల ంలోని పాఠశాలల్లో పంపిణీ చేసినట్టు చెప్పారు. ఆయా పాఠశాలల్లో స్టడీ మెటీరియల్‌తో పాటు బెంచీలు, క్రీడా వస్తువులు, బాలికల పాఠశాలలో కరాటే కూడా నేర్పించనున్నట్టు తెలిపారు. పాఠశాలల్లో మరిన్ని వసతులు కల్పిస్తూ మరింత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం మర్రి నిత్యానిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్య నేర్పడానికి ఉపాధ్యాయులు ఉన్నారని మౌలిక వసతులు కల్పించడానికి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. అందువల్ల ప్రతి విద్యార్థి మంచిగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించి ఉన్నతస్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు పాఠశాలకు పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో మలక్‌పేట్ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, ఎంపీపీ జాటోత్ నర్మద లచ్చిరాం, జెడ్పీటీసీ నిత్యానిరంజన్ రెడ్డి, వైస్ ఎంపీపీ పొలగొని రాజేశ్వరి, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ భూపతిగాళ్ళ మహిపాల్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ దేవుజి, మాజీ ఎంపీపీ గుండెమోని జయమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వింజమురి రామ్‌రెడ్డి, సర్పంచ్ అనిరెడ్డి జగన్‌రెడ్డి, ఎంపీటీసీ ఎడమ నరేందర్‌రెడ్డి, లింగంపల్లి, జపాల్, ఆంబోథ్ తండా, బండలేముర్ ఎంపీటీసీలు పల్లాటి జయనందం, లాట్టుపల్లి చంద్రశేఖర్ రెడ్డి, రాందాస్, వెదిరే మధుసూదన్ రెడ్డి, బోదకొండ, ఎల్లమ్మతండా సర్పంచులు జాటోత్ అలివేలు, సపావట్ పద్మశ్రీదర్ నాయక్, కాంగ్రెస్ యువజన నాయకులు సంపత్ రెడ్డి, ఒరుగంటి మహేష్, చేతాల సతీష్, తదితరులు పాల్గొన్నారు.