Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - షాబాద్
బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 8 నుంచి 11 వరకు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో తీరని అన్నాయం జరుగుతోందన్నారు. బీసీలకు జనాభా ప్రాదిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లు 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 8న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, కేంద్ర మంత్రులను, 36 ప్రతిపక్షపార్టీ నేతలను కలిసి బీసీలకు రావాల్సిన వాటాలపై నివేదిక ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాచైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు నర్సింహులు, నాగర్‌గూడ సర్పంచ్ ఈదుల కృష్ణగౌడ్, నాయకులు ఖలీల్, రాజశేఖర్, రాజ్‌కుమార్, వెంకటస్వామి పాల్గొన్నారు.