Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహేశ్వరం
బాలబాలికలు చిన్నతనంలోనే తప్పడడుగులు వేయకుండా పాఠశాల స్థాయి నుంచే ఉత్తమ సంస్కరణలతో విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, తల్లిదండ్రులు ఆత్మ గౌరవాన్ని సంఘ గౌరవాన్ని నిలుపుతూ ఉన్నత స్ధాయికి ఎదగాలని మహేశ్వరం ఎంపీపీ కె.రఘుమారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ... పాఠశాలలో చేరిన విద్యార్ధులు అందరూ పరిసరాల పరిశుభ్రత పౌ
ష్టికాహారం ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మైనార్టీ తీరని బాల బాలికలు చెడువ్యసనాలకు అలవాటు పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ జీవితంలో సరైన పోషకాలు లేకుండా ఆరోగ్య జాగ్రత్తలు పాటించిక బాలికలు రక్తహీనతతో అనారోగ్యానికి గురువుతున్నారని, బాల్య వివాహలు అనంతరం గృహ హింసతో బాధపడుతున్నారన్నారు. ఇటీవల చిన్నారి బాలబాలికలపై హింసలు దాడులు జరుగుతున్నాయని బాలబాలికల సంరక్షణపై ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని బాలల హక్కులు చట్టాలపై గృహహింస ఆడపిల్లలు పుట్టకముందే వైద్య పరీరక్షణ పేరుతో జరుగుతున్న వివక్షపై బాలబాలికలు అవగహనతో ముందుకెళ్లాలని తెలిపారు. సినిమాలు, సీరియళ్ల పేరుతో బాలబాలికలకు అవకాశం కల్పిస్తామని చిన్నారులను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ బి.నర్సింహా, ఎంఈఓ కృష్ణ, సీడీపీఓ షబానా, వైస్ ఎంపీపీ ఆర్.సునితాఆంధ్యానాయక్, ఎంపీటీసీ సభ్యులు హెచ్ చంద్రయ్య, పి.సుదర్శన్‌యాదవ్, కెసతాండ సర్పంచ్ జె,మోతిలాల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలత విజయభాస్కర్, సరితారెడ్డి, సంధ్య, అనురాధ, ఇందిర, కవిత, రమ్య, అనసూయ, సుగుణ, కళ్యాణి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.