Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచాల
వికలాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని 6 నెలలు గడిచినా ఇప్పటికీ పింఛన్ ఇవ్వడంలేదని మండల పరిధిలోని నోముల గ్రామానికి చెందిన వికలాంగుడు నల్ల రమేశ్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని నోముల గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేండ్ల కిందట కాలు విరిగిందని, అప్పటి నుంచి తనకు పింఛన్ రాలేదన్నాడు. తాను నిరుపేద కుటుంబానికి చెందిన వాడినని, ఉండటానికి ఇల్లు కూడా లేదని చెప్పాడు. 6 నెలల కిందట సదరం క్యాంపులో సర్టిఫికెట్ తీసుకుని పింఛన్ కోసం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాని, అయినా ఇప్పటి వరకు పింఛన్ రాలేదని అన్నాడు. అధికారులు రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారే తప్ప పింఛన్ మాత్రం ఇవ్వడం లేదని వాపోయాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తనకు వికలాంగ పింఛన్ వచ్చేటట్టు చూడాలని కోరారు.