Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
33వ రాష్ట్ర కౌన్సిల్ వరంగల్ జిల్లాలో హన్మకొండలో జరిగిన సర్వసభ్య సమావేశంలో శనివారం దోమ మండలం నుండి రాష్ట్ర పీఆర్టీయూటీఎస్ శాఖకు ఉపాధ్యాయులు ఎన్నికయ్యారు. ఎన్నికైన ఉపాధ్యాయులు పురంధాస్ (ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్‌ఎస్ దోమ), రాష్ట్ర ఉపాధ్యక్షులుగా హరిలల్ (ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్‌ఎస్ బొంపల్లి), రాష్ట్ర కార్యదర్శిగా గోపాల్ (ఎస్‌ఏ జీవశాస్త్రం జెడ్పీహెచ్‌ఎస్ కిష్టాపుర్)లను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున వారికీ పీఆర్టీయూటీఎస్ దోమ మండల శాఖ అధ్యక్షులు కేశవులు, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యుల తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తాండూరు రూరల్ : పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షునిగా జీనుగుర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మృత్యుంజయ స్వామిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్టీ యూ 33వ రాష్ట్ర మహాసభలు శనివారం రోజు వరంగల్ జిల్లా హనుమకొండ పట్టణం లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షునిగా తనను ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా తాండూరు మండలంలో పనిచేస్తున్న లక్ష్మయ్య, మోహన్‌లను ఉపాధ్యక్షులుగా నియమించామని తెలిపారు. కీలకమైన పోస్టులో తాండూర్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులకు వారించడంతో పీఆర్టీయూ నాయకులు అయినవిల్లి రవి, మనోహర్, జైపాల్ రెడ్డి, నాగప్ప, మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
మాడ్గుల : పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియోట్ అధ్యక్షులుగా మండలంలోని నాగిళ్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయులు టి.వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు. శనివారం హనమకొండలో జరిగిన పీఆర్టీయూ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నట్టు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర కమిటీలో మండలం నుండి మరో ఇద్దరికి స్థానం దక్కినట్లు వెంకట్‌రెడ్డి వివరించారు.రాష్ట్ర ఉపాద్యక్షులుగా బి.వేణుగోపాల్,కార్యదర్శిగా చిందం వెంకటయ్యను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్ధన్‌రెడ్డి,రంగారెడ్డిజిల్లా అద్యక్ష,కార్యదర్శులు జగన్‌మోహన్‌గుప్త,గోవర్ధన్‌యాదవ్‌లకు ఈసందర్భంగా వారు కృతజ్ఞలు తెలిపారు.వీరి ఎన్నికపట్ల మాడ్గుల మండల పీఆర్‌టీయూ అధ్యక్ష, కార్యదర్శులు వి.వెంకట్‌రాంరెడ్డి, లాలునాయక్, నాయకులు కొండల్‌రెడ్డి, కరుణ, అశోక్‌రెడ్డి, రవీందర్, జిలాని, యాదమ్మ తదితరులు హర్షం వ్యక్తం చేసారు.