Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
ప్రజా ప్రతినిధులు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. శుక్రవారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా పి.విజరు కుమార్ ఉపాధ్యక్షుడిగా అమ్రాది నర్సింలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పండరి నాథ్ చారి , కౌసల్య , బుచ్చిలింగం, రమేష్, గౌసుద్దీన్, జనార్దన్ రెడ్డి, సంతోష, మల్లికార్జున్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎమ్మెల్యే మెతకు ఆనంద్ సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతినిధులు తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు మారుతూ ఉంటారు కానీ ప్రజలు మర్చిపోలేని నాయకులు కొందరే ఉంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి నూతన పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వికారాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో గత సంవత్సరం తూనికలలో 20 నుంచి 30 కిలోల వరకు రైతులను మోసం చేశారని ఇటువంటివి పునరావృత్తం కాకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా పాలకవర్గం చూసుకోవాలని సూచించారు.
రైతులకు అందుబాటులో ఉండి సేవ చేస్తా : ఏఎంసి చైర్మన్ పి విజరు కుమార్
నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ మార్కెట్ సమస్యలు పరిష్కరిస్తానని, శాసనసభ్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్ సహకారంతో మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు సేవ చేస్తానని ఏఎంసీ చైర్మెన్ పి. విజరుకుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా వంటి ఇంతకాలం ప్రవేశపెట్టి రైతులను ప్రోత్సహిస్తున్నారని, తన వంతు సహకారం వికారాబాద్ రైతులకు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విద్య మౌలిక వసతుల కల్పన చైర్మన్ నాగేందర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.