Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాబాద్ ఎంపీడీవో రామకృష్ణ
నవతెలంగాణ-షాబాద్
పర్యావరణాన్ని పరిరక్షించే మొక్కలను విరివిగా నాటాలని షాబాద్ ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. షాబ ాద్ మండల పరిధిలోని ముద్దెంగూడ, సంకెపల్లిగూడ, గొళ్లూర్‌గూడ, నాగర్‌కుంట, కేశవగూడ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వాలు విరివిగా మొక్కలు నాటి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అందులో భాగంగానే హరితహారం పథకాన్ని తీసుకువచ్చినట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో పల్లెప్రగతి వనాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. రహదారుల వెంబడి వందశాతం మొక్కలను నాటినట్టు తెలిపారు. నాటిన ప్రతి మొక్కనూ చెట్లుగా పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గా మొక్కలను సంరక్షించాలన్నారు. వాతావరణం కలు షితం కాకుండా కీలక పాత్ర పోషిస్తున్న మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రోజు రోజుకూ అడవులు తరిగి పోతుండడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతు న్నాయని తెలిపారు. సకాలంలో వర్షాలు కురువాలంటే మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొక్కలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హరితహారం పథకాన్ని తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం పథకంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీట ీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.