Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
మొక్కజొన్న పంటకు కత్తెరపురుగు తగిలి పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఆరుకాలం కష్టపడి పండించడంతోపాటు, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన పంటలు చేతికి వచ్చే దశలో పురుగుల బెడద తగలడంతో అన్నదాతలు ఆందో ళన చెందుతున్నారు. ఇతర వాణిజ్య పంటలైన పత్తి, కంది పంటలకు కూలీల కొరత ఉండడంతో అన్నదాతలు మొక్కజొన్న పంటసాగుకు ఆసక్తి కనబర్చారు. ప్రభుత్వం మొక్కజొన్న సాగు చేయవద్దన్న, తక్కువ ఖర్చుతో పంట సాగు చేయవచ్చనే అభిప్రాయంతో మండలంలో చాలా వరకు రైతులు మొక్కజొన్న పంటను సాగుచేశారు. రైతుకు ఖర్చు తక్కువ రావడంతో పాటు పశువులకు మేత లభిస్తుండడం మొక్కజొన్న పంటను సాగును చాలా వరకు రైతులు వేశారు. పంట ప్రస్తుతం కంకి ఏర్పడే దశలో ఉన్న స్థితిలో కత్తెరపురుగుల ఉధృతి ఎక్కవగా ఉండి, పంటను పీల్చి పిప్పిచేస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న సాగు వద్దని చెప్పడంతో కత్తెర పురుగును అరికట్టేందుకు రైతులు వ్యవసాయ అధికారులను సలహాలు, సూచనలు అడిగినా వారు చెప్పడం లేదు. దీంతో పంటను ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. కత్తెర పురుగు నివారణకు అధికారులు తగు సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.