Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ దామోదర్
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్ దామోదర్ సూచించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దామోదర్ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రమాణం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలను ప్రజలందరూ పాటించి రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత వర్షాలకాలంలో ప్రజలు నివసించే పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించాలని, చెత్త, వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయడం మానుకోవాలని, లేదంటే ఈగలు, దోమలు, బెడద తప్పదని హెచ్చరించారు. పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వంటి ప్రదేశాల్లో చెత్త ఎక్కడ వేయకూడదని అక్కడ ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లోనే చెత్తను వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.