Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సర్పంచ్
నవతెలంగాణ-శంషాబాద్
తాను సర్పంచ్‌గా గెలిస్తే గ్రామం లోని ప్రతీ ఆడపిల్ల పెండ్లికి కానుకగా రూ. పదివేల రుపాయలు నగదు ఇస్తా మని మండల పరిధిలోని చౌదర్‌గూడ గ్రామ సర్పంచ్ కటికెల రాజ్‌కుమార్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వా దంతో గెలిచిన ఆయన ఇచ్చిన మాట నిలుపుకుంటూ వస్తున్నారు. గురువారం గ్రామానికి చెందిన బక్క ఎల్లమ్మ యాద య్య దంపతులు కూతురు రోజా వివా హం జరిగింది. కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ నూతన పెండ్లి జంటను ఆశీర్వదించి రూ.10,051 రుపాయల నగదును కానుకగా అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పెండ్లి చేసుకుంటున్న ప్రతి ఆడపిల్లకూ భవిష్యత్తు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్, బక్క సుదాకర్, తాళ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.