Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్థలాల గుర్తింపు పూర్తి
564 కంపోస్టు షెడ్డుల నిర్మాణాలే లక్ష్యం
జిల్లా డ్వామ పీడీ కృష్ణన్
నవతెలంగాణ-యాలాల
వికారాబాద్ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాల గుర్తింపు చేశామని జిల్లా డ్వామా పీడీ కృష్ణన్ అన్నారు. యాలాల మండలంలోని కమాల్‌పూర్ గ్రామంలో కొనసాగుతున్న పల్లె ప్రకృతి నిర్మాణం పనులను ఆయన గురువారం పరిశీలించారు. మొక్కలకు నీల్లు పోశారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పల్లె సిగలో ప్రకృతి వనాలు ఒక భాగం అని పేర్కొన్నారు. కమాల్‌పూర్ ప్రకృతి వనం దగ్గర ఫినిషింగ్, గేటు, ఆర్చ్, పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రకృతి వనాల ఏర్పాటుతో ఆహ్లాదమైన వాతావరణం ఏర్పడనుందని ఆయన చెప్పారు. యాలాల మండలంలో ఇది వరకు 27 జీపీల్లో ప్రకృతి వనాల కోసం స్థలాలు గుర్తించినట్టు తెలిపారు. ఆదే విధంగా జిల్లా పరిధిలో 564 కంపోస్టు షెడ్డులు నిర్మించేం దుకు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 176 కంపోస్టు షెడ్డుల నిర్మాణం పూర్తి అయిందన్నారు. జిల్లాలో ఆరో విడత హరితహారంలో భాగంగా 33 లక్షలు మొక్కలు నాటడం లక్ష్యం కాగా, అందులో 26 లక్షలు మొక్కలు నాటడం పూర్తైందన్నారు. యాలాల ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ సుధాకర్, అధికారులు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాగుందన్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీలతో పాటు, అనుబంధ గ్రామాల్లోకూడా ప్రకృతి వనాల ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ సుధాకర్, సర్పంచ్ బస్వరాజ్, ఉపాధిహామీ ఏపీఓ జనార్దన్, ఈసీ శ్రావణ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.