Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరంలోని కొన్ని భాగాల్లో ఎక్కువగా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫిట్‌నెస్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం ప్రతిరోజూ అల్లం కషాయం తాగితే చాలు.
శరీరంలోని మలినాలను బయటకు వెళ్లగొట్టి, మెటబాలిజంను పెంచడంలో అల్లం కషాయం బాగా పనిచేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా తలెత్తే వ్యాధుల నుంచి కూడా రక్షణ ఇస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచి, రక్తనాణాల్లో రక్తం గడ్డలు కట్టకుండా నియంత్రించే శక్తి అల్లం కషాయానికి ఉంది. రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, ఆర్థ్రయిటిస్ మొదలైన కీళ్ల నొప్పుల నుంచి రక్షణ అందిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా చేయడంలో కూడా అల్లం కషాయం అద్భుతంగా పని చేస్తుంది. ఐదు లీటర్ల నీళ్ళలో వంద గ్రాముల అల్లం తురుము వేయాలి. 15నిమిషాల పాటు చిన్నమంటపై మరగనివ్వాలి. ఆ తర్వాత చల్లార్చి వడగట్టాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం కలిపి ప్రతిరోజూ పొద్దున్న టిఫిన్‌కు ముందు, రాత్రి భోజనానికి ముందు ఒక కప్పు తాగాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అధిక బరువు సమస్య తీరుతుంది.