Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరంలోని జీవప్రక్రియల వల్ల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఎక్కువైతే కణాల పనితీరును దెబ్బతీసి అనేక రకాల జబ్బులకు కారణం అవుతాయి. వీటిని ఎదుర్కోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు ఉపయోగ పడుతాయి. మనం తీసుకునే ఆహారం ద్వారా ఎక్కువగా ఇవి లభిస్తాయి. శాకాహారంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రంగురంగుల పండ్లు, కూర గాయల్లో రోజూ తీసుకునే వారికి యాంటీ ఆక్సిడెంట్లు తగినన్ని అందుతాయి. విటమిన్- సి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. టమాటాలు, పుచ్చకాయల్లోని లైకోపీన్ మరొక యాంటీ ఆక్సిడెంట్. బియ్యం, గోధుమలు, పప్పులు లాంటి ధాన్యాల్లోని సెలీనియం యాంటీ ఆక్సిడెంటే. వివిధ రంగుల్లోని ఆహారాల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్, కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సీజనల్‌గా వచ్చే పండ్లు, కూర గాయలు, ధాన్యాలు తీసుకుంటే అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.