- ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు విత్తనాలు విక్రయించాలి - కామారెడ్డి కలెక్టర్ శరత్ నవతెలంగాణ-కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జనహిత భవన్‌లో ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కూలీకి రూ.200లపైనా డబ్బులు వచ్చేలా చూడాలని సూచించారు. చెరువులు, ఫీడర్ చానల్స్, కాలువలలో పూడికతీత చేపట్టాలని తెలిపారు. తెలిపారు. మాచారెడ్డి మండలంలో ఉపాధి హామీ పనులలో సాధిస్తున్న ప్రగతిని ఆయన అభినందించారు. పనుల్లో నిర్దిష్టత లక్ష్యాన్ని సాధించని సిబ్బంది తమ పనితీరు మార్చు కోవాలని, ప్రభుత్వ లక్ష్యాలను సాధించి అందరికీ పనులు కల్పించాలని ఆదేశించారు.వానాకాలం దగ్గరలో ఉన్నందున గ్రామాలలో పారిశుధ్య పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలనితెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల సంరక్షణ చేపట్టాలని, ప్రతి శుక్రవారం వాటరింగ్ డే, నిర్వహించి మొక్కలకు నీరు అందించాలని వివరించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి చంద్రమోహన్‌రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, డీపీవో సాయన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. మార్గదర్శకాల మేరకు విత్తనాలు ఎరువులు విక్రయించాలి.. నియంత్రిత పంటల విధానంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకే ఎరువులు, విత్తనాలు డీలర్లు విక్రయించాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శరత్ డీలర్లను ఆదేశించారు. జిల్లా కేంద్ర శివారులోని వెలమ ఫంక్షన్ హాల్‌లో వ్యవసాయాధికారులు, డీలర్లతో వానాకాలం పంటల సాగుకు సంబంధించిన వ్యవసాయ సాగు పద్ధతులు, విత్తనాలు ఎరువుల విక్రయాలపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో రైతును బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నియంత్రిత వ్యవసాయ విధానం అందరూ ఆచరించాలని, రైతు శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. ప్రస్తుత వానకాలంలో డీలరు వరి విత్తనాలు అమ్మవద్దని, గ్రీన్ కార్డు విధానం ప్రకారం సీడ్ కార్పొరేషన్ ద్వారా వరి విత్తనాలు సరఫరా చేస్తుందని తెలిపారు. అనంతరం ఎస్పీ శ్వేత మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు ఎరువుల విక్రయాలు పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. మారిన చట్టాలననుసరించి పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్‌ధోత్రే, జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య పాల్గొన్నారు.