Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శులు
- ఉమ్మడి జిల్లాలో సుందరయ్య 35వ వర్ధంతి
నవతెలంగాణ-కంఠేశ్వర్/కామారెడ్డి/ఆర్మూర్‌టౌన్
సుందరయ్య జీవితం ఆదర్శనీయమని సీపీఐ(ఎం) నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కార్యదర్శులు ఎ.రమేశ్‌బాబు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎస్.వెంకట్‌గౌడ్ అన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 35 వర్ధంతి మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించారు.
కంఠేశ్వర్ : జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ.. నిస్వార్ధ నిరాడంబర జీవి, ప్రజల మనిషి అని కొనియాడారు. దేశంలో ఫ్యూడల్ భావాలకు,
బానిసత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలను నిర్వహించిన మహానుభావుడు అని, తన చిన్నతనంలోనే దళితులపై వివక్షతకు వ్యతిరేకంగా సహపంక్తి భోజనాలను నిర్వహించి మనుషులంతా సమానమే అని తెలిపిన వ్యక్తి అని వివరించారు. భూస్వాముల ఆగడాలకు, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలం గాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నాయ కత్వం వహించిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజా సమస్యలపై పార్లమెం ట్‌లో, అసెంబ్లీలో గళమెత్తిన పోరాటయోధుడు అని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నూర్జహాన్, మల్యాల గోవర్ధన్, పి.సూరి, అనిల్, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాలు..
పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బహుజన కాలనీల్లో నిత్యావసర సరుకులను నిరుపేదలకు అందజేశారు.
వ్యకాస ఆధ్వర్యంలో..
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వర్ధంతిని నిర్వహించారు. పాంగ్ర పరిధిలో గల సుందరయ్య కాలనీలో, మోస్రా మండ లంలోని తిమ్మాపూర్‌లో, మోస్రాలో, గోవూర్‌లో, లింగి తాండ లో, ఎడపల్లి మండలం అంబెం (వై)లో వర్ధంతి కార్యక్ర మాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రా ములు మాట్లాడుతూ.. కామ్రేడ్ సుందరయ్య గొప్ప త్యాగశీలుడని తెలిపారు. కార్యక్రమంలో జోగు చిన్న సాయిలు, నర్ర శంకర్, ముస్తఫా, మల్లేష్ యాదవ్, బొర్రా సత్యనారాయణ, లక్ష్మణ్, మొగులయ్య, బెళ్ళారి రమేష్, పిట్ల నారాయణ, హైమద్, భీమశంకర్, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిటౌన్ : జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యా లయంలో సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్ మాట్లాడుతూ.. సుందరయ్య 3లక్షలకు పైగా ఎకరాలను పేదలకు పంచిపెట్టారని తెలిపారు. సుందరయ్య కోరుకున్న పేద ప్రజల రాజ్యం కోసం సీపీఐ(ఎం) ప్రజలు పక్షాన నిలబడి పోరాడుతుందని తెలిపారు. జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, నాయకులు శ్రీనివాస్, వెంకటేష్, మోహన్, సాయిలు పాల్గొన్నారు.
ఆర్మూర్‌టౌన్ : పట్టణంలోని యానంగుట్ట వద్దగల సుందరయ్య కాలనీలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో కుతాడి ఎల్లయ్య అధ్యక్షత వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఒక్క నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లపు వెంకటేశ్ మాట్లాడుతూ... సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో జన్మించి సమానత్వం కోసం పోరాటం చేశాడని తెలిపారు. మండల కమిటీ సభ్యులు టి.భూమన్న, సుజాత, ఎమ్‌డీ మున్నా, తెలంగాణ రైతు సంఘం ఆర్మూర్ కన్వీనర్ బి రాజు. ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.