- మాజీ ఎంపీ కవిత తరపున కలెక్టర్‌కు అందజేసిన నుడాచైర్మన్ నవతెలంగాణ-నిజామాబాద్‌సిటీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తరపున నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి 500 పీపీఈ కిట్లు, 2 వేల క్లాత్ మాస్కులను కలెక్టర్ నారాయణరెడ్డికి శుక్రవారం కలెక్టరేట్లో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో, క్వారంటైన్ సెంటర్‌లో పనిచేసే వాళ్లకు పీపీఈ కిట్లతో వైరస్ సోకకుండా ఉంటుందన్నారు. జిల్లాలో 61కేసులు నమోదుకాగా ఎక్కువగా నిజామాబాద్ కార్పొరేషన్లలోనే ఉన్నాయన్నారు. గ్రీన్ జోన్‌కు వెళ్లాలంటే ఎవరూ బయటకు రావద్దని, వస్తే మాస్కులు ఉండాలని, భౌతికదూరం పాటించాలని, చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. అతిక్రమిస్తే కేసులు పెడతామన్నారు. సామూహిక ప్రార్థనలు చేయొద్దన్నారు. కార్యక్రమంలో ఏవో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.