నవతెలంగాణ-నిజాంసాగర్/ముప్కాల్ మండలంలోని తుంకిపల్లి, సింగీతం, ధూప్‌సింగ్‌తండ, కోమలాంచ, మగ్దుంపూర్ గ్రామాల్లో శుక్రవారం జడిచైర్‌పర్సన్ ధఫెదర్ శోభ కొనుగులు కేంద్రాలను ప్రారంభించారు. అదేవిధంగా అర్హులైన లబ్దిదారులకు షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం సింగీతం గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకంక్రింద ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమికి సంబందించిన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు పట్లోళ్ల జ్యోతి, సర్పంచ్, ఎంపీటీసీలు, ఏఎంసి వైఎస్ చైర్మెన్ విఠల్, సిడిస్ చైర్మన్ గంగారెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీడీవో పర్బన్న, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ, నాయకులు దుర్గారెడ్డి ,లింగాల రాంచందర్, విఠల్, మొయిజోద్దీన్ పాల్గొన్నారు. ముప్కాల్: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని వేంపల్లి ప్రాథమిక సహకార సంఘం సొసైటీ చైర్మెన్ జక్క రాజేశ్వర్ తెలిపారు. మండలంలోని వేంపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధర రూ.1835, బి గ్రేడ్‌కు రూ. 1815 ప్రకటించిందని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్క గంగాధర్, సొసైటీ సీఈవో వంశీకృష్ణ, సొసైటీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.