Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి

హాస్యం అనేది ఒక తెలివైన భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ. భారతదేశంలో కునాల్‌ కమ్రా, మునావర్‌ ఫారూఖీ లాంటి కమెడియన్‌లు, రచితా తనేజా లాంటి కార్టూనిస్ట్‌లు ఇలాంటి కళలలో భాగస్వాములుగా ఉన్నారు. వారంతా (వారు చేసిన పనికి వ్యతిరేకంగా) వివిధ రూపాలలో నేర విచారణలను ఎదుర్కొంటున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ఎంఎల్‌ఏ కుమారుడు ఇచ్చిన ఒక ఫిర్యాదుపై ఆధారపడి, తనకు ఏ విధంగా సంబంధంలేని (జోక్‌లు) హాస్యాన్ని సృష్టించాడని మునావర్‌ను జైల్లో పెట్టారు. కోర్టును ధిక్కరించారన్న నెపంపై కునాల్‌, రచితలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చర్యలు, సమకాలీన రాజకీయాలలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క నిస్సహాయతను నగంగా తెలియజేస్తున్నాయి. మొదటి ముప్పు సహజంగానే ప్రస్తుత రాజకీయ కార్యనిర్వహక వర్గం నుంచి, రెండవది వ్యవస్థాగతంగా, రాజ్యాంగం ప్రకారం, (అంగీకారం కానటువంటి) ప్రభుత్వ దుర్మార్గాలను నిరోధించాల్సిన న్యాయస్థానాల నుంచి వాటిల్లుతుంది.
చట్టబద్దంగా మాట్లాడే మాటలను, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను కార్యనిర్వహకశాఖ నేరంగా పరిగణించడం, పూర్తిగా వాటిని తొలగించడం లాంటి చర్యలకు పూనుకుంటున్నది. విద్యార్థులు, కార్యకర్తలు, కమెడియన్‌లు, జర్నలిస్టులను క్రిమినల్‌, టెర్రరిస్టు వ్యతిరేక చట్టం కింద నేరాలను ఆరోపించి కేసులు నమోదు చేయడం, విమర్శలను అదుపు చేయడమే ప్రభుత్వ వ్యూహంగా ఉంటున్నది.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రభుత్వ యుద్ధం, మతపరమైన అంశాలతో ప్రజల అభిప్రాయాలను నాశనం చేస్తుంది. ద్వేషపూరిత ప్రసంగాలను సృష్టించే 'UPSC జిహాద్‌', 'కరోనా జీహాద్‌' లాంటి ప్రదర్శనల ద్వారా ఒకవైపు ముస్లింలపై అపవాదులు వేసే చర్యలను ప్రోత్సహిస్తున్నది. మరో వైపు ప్రభుత్వం లేదా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏ చిన్న విమర్శ చేసినా నేరారోపణలు చేస్తున్నారు. ఆర్నబ్‌ గోస్వామికి వ్యతిరేకంగా నేరం మోపినపుడు, దానిని బహిరంగంగా ఖండించిన కేంద్ర మంత్రులు, ప్రభుత్వ విధానాలతో ఏకీభవించని జర్నలిస్టులకు ఆ విధమైన రక్షణను కల్పించ లేదు. ఈ అసమానతలు ప్రభుత్వం యొక్క హిందూ జాతీయ ఎజెండాను ముందుకు తీసుకుపోయేందుకు ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం సంతోషించే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారి కంటే అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వారికుండే హక్కులను కూడా కుదిస్తుంది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ, స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇటీవల స్పందించిన తీరును, ఉదారవాద ప్రజాస్వామ్యాలు విమర్శను ఎలా పరిగణనలోకి తీసుకోవో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతుల పట్ల కేంద్రం వైఖరిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే , రాజ్యాంగబద్దంగా కల్పించబడిన స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వక్రీకరిస్తుందో తెలుసుకోవచ్చు. మొదటిది, శాంతియుతంగా జరుగుతున్న సభను అనుమతించడానికి బదులుగా, ప్రభుత్వం దాన్ని పరిమితం చేసేందుకు, సరిహద్దు నిరసన ప్రదేశాలలో రోడ్లపై మేకులు నాటించడం, కాంక్రీటు గోడలను, బారికేడ్లను నిర్మించడంపై కేంద్రీకరించింది. బారికేడ్లు పెద్ద అవరోధమేమీ కాదు, కానీ ఈ ఒక్క ఉదాహరణ ప్రభుత్వ హింసాత్మక చర్యను తెలుపుతుంది. ఇంటర్నెట్‌, విద్యుత్తు, నీటి సరఫరాలను కుదించడంతో పాటు, గౌరవప్రదమైన జీవితానికి, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇచ్చే మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1), 21ని పూర్తిగా నిలిపివేశారు.
రెండవది, ప్రభుత్వం నిరసనలను చాలా చురుగ్గా అడ్డుకుంటుంది. అనేక మంది నిరసనకారులను నిర్బంధించింది. అనేక సందర్భాల్లో హింస చెలరేగింది. ప్రభుత్వం, దాని మిత్రులు చొచ్చుకొని పోవడం వల్లనే ఈ హింస చెలరేగిందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీకి రైతులు రాకుండా అడ్డుకునేందుకు, నిరసనలకు కేంద్రంగా ఉన్న ఆగ్రాలో రైతులను హౌస్‌ అరెస్ట్‌ చేయించింది.
మూడవది, రైతుల ఉద్యమంపై తయారైన విమర్శ నాత్మక నివేదికలలో కొన్ని అంశాలను తొలగించడం, నేరారోపణలు చేసి కేసులు బనాయిస్తామనే బెదిరింపుల ద్వారా అడ్డుకునే విధానం. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనలను, ప్రతిఘటనను అణచివేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అంతర్జాతీయ విమర్శలకు గురి అయ్యాయి. ఫిబ్రవరి 2న నిరసనలలో సంభవించిన మరణాల గురించి తమ నివేదికల ద్వారా తెలియజేసిన కనీసం ఎనిమిది మంది సీనియర్‌ జర్నలిస్టులపైన దేశద్రోహం కేసు, మతసామ రస్యానికి విఘాతం కలిగించారని నేరారోపణలు చేస్తూ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయాలను (తొలగింపు అభ్యర్థనల ద్వారా) తొలగించడం మొదలుపెట్టింది.
భారతదేశంలో ప్రస్తుతం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క స్థితి,1970వ దశకంలో విధించిన జాతీయ ఎమర్జెన్సీతో పోల్చే విధంగా ఉంది. ఇక్కడ ఎవరికైనా రాజ్యాంగబద్ధమైన రెండు పరస్పర విరుద్ధ లక్షణాలు కనిపిస్తాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ పాలన, ప్రభుత్వానికి విస్తతమైన అధికారాలను సమకూర్చి, న్యాయ సమీక్ష చేసే అవకాశాన్ని పరిమితం చేసింది. ఇది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కుదించడానికి అనుమతించింది. బీజేపీ కంటే ముందున్న భారతీయ జనసంఘ్ భాగస్వామిగా ఉన్న జనతా పార్టీ 1977లో అధికారాన్ని చేపట్టి, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అంతకు ముందు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన మార్పులన్నింటినీ రద్దు చేసింది. దాని ఫలితంగా, కేబినెట్‌ ఆమోదం లేకుండా అధికారికంగా ఎమర్జెన్సీ ప్రకటన, ప్రాథమిక హక్కుల నిలిపివేత సాధ్యం కాదు. ప్రభుత్వ చర్యలను సమీక్షించే కోర్టు అధికారాన్ని పునరుద్ధరించారు. ముఖ్యంగా ఆ రాజ్యాంగ సవరణ, కార్యనిర్వహకవర్గం నిర్ణయాలు తీసుకునే క్రమంలో ప్రజాస్వామిక ప్రక్రియలో విలువైన అంశాలను పునరుద్ధరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు, జనసంఘ్ ఒక కొత్త అవతారంలో బీజేపీగా అధికారం చేపట్టినప్పుడు, రాజ్యాంగంపై చేసిన దాడులన్నీ అనధికారమైనవి, అయినా వాస్తవమైనవి. ఒక్క అధికారిక రాజ్యాంగ సవరణ లేకుండా, ప్రభుత్వం అనేక ప్రాథమిక హక్కుల అమలును రద్దు చేసింది. శాంతియుతంగా చేస్తున్న ఆందోళన, రాజకీయ చర్చల కుదింపుతో, సమకాలీన భారతదేశం దురదష్టం కొద్దీ వాస్తవ ఎమర్జెన్సీకి దగ్గరగా ఉంది . కొత్త అధికార వ్యవస్థ ప్రతీ నిరసనను ఒక ''అంతర్గత అల్లరిగా'' పరిగణిస్తూ, దానిపై గట్టి చర్యలకు పూనుకుంటుంది.
న్యాయ విధానం
కార్యనిర్వహకవర్గం ఎవరూ అంగీకరించని రీతిలో భావప్రకటనను పరిమితం చేసినప్పుడు, న్యాయవ్యవస్థ ఈ స్వేచ్ఛను సంరక్షిస్తుందని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. ఇక్కడ ఒక కేసును పరిశీలిస్తే, 1950లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు కేసులను సుప్రీంకోర్టు ఎదుర్కొంది. మొదటిది, 'క్రాస్‌ రోడ్స్‌' అనే పత్రికపై మద్రాసు ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా సవాల్‌ (రొమేష్‌ థప్పర్‌ వెర్సస్‌ మద్రాసు ప్రభుత్వం). రెండవది, 'ఆర్గనైజర్‌' పత్రికపై కార్యనిర్వహక ఉత్తర్వులు విధించిన నియంత్రణకు వ్యతిరేకంగా సవాల్‌ (బ్రిజ్‌ భూషణ్‌ × ఢిల్లీ ప్రభుత్వం). ఆసక్తికరంగా, ఇద్దరు పిటీషన్‌ దారులు రాజకీయ రంగంలో ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. 'క్రాస్‌ రోడ్స్‌' రొమేష్‌ థప్పర్‌ సంపాదకత్వంలో నిర్వహించబడుతున్న కమ్యూనిస్ట్‌ పత్రిక. 'ఆర్గనైజర్‌' ఆరెస్సెస్‌ పత్రిక. కానీ రెండూ, వారి వారి కేసులకు మద్దతుగా (భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు) రాజకీయ విలువలపై ఆధారపడి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా స్వేచ్ఛకు ఉండే సుగుణం. ఇది సాంప్రదాయ వాదులకు వ్యతిరేకంగా, ఉదారవాదులకు అనుకూలంగా ఏ విధమైన వివక్షతను చూపదు. ఇది అసమ్మతిని తెలిపే, తప్పు చేసే, ఎగతాళిచేసే, చర్చించుకునే స్వేచ్ఛకు అనుమతిస్తుంది.
రెండు కేసులలో కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోరిన పిటీషన్‌ దారులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. థప్పర్‌ కేసులో, ''భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అన్ని ప్రజాస్వామిక సంస్థల పునాదులలో ఉంటాయి, స్వేచ్ఛాయుతమైన రాజకీయ చర్చ లేకుండా ప్రభుత్వ విద్య సాధ్యపడదు, ప్రజా ప్రభుత్వ పనితీరు ప్రక్రియ సరిగా ఉండేందుకు స్వేచ్ఛ అవసరం'' కాబట్టి చీఫ్‌ జస్టిస్‌ పతంజలి శాస్త్రి చాలా సంకుచితమైన ఆలోచనా చర్యలు మాత్రమే భావప్రకటనను కుదిస్తాయని రాశాడు. రర70సంవత్సరాల తరువాత, జనవరి 2021లో మునావర్‌ ఫారూఖీ బెయిల్‌ మంజూరు కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టును కోరాడు. అసాధారణంగా ఒక కమెడియన్‌ను, (బహుశా తాను భావించిన జోకులకు) అరెస్ట్‌ చేశారు. బెయిల్‌ మంజూరు వాదనలలో, న్యాయస్థానాల్లో నేరాలు చేసిన వారి తప్పులను గుర్తించని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని హైకోర్టు నిస్సంకోచంగా చెప్పింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన రెండు సంఘటనలలో రెండు కోర్టుల వైఖరులు భిన్నంగా ఉన్నాయి. మొదటిది, రాజ్యాంగాన్ని సంరక్షించే క్రమంలో కోర్టు వెంటనే స్పందించింది. రెండవది, ప్రభుత్వానికి ఉన్నంత అసహనాన్ని కోర్టు కూడా ప్రదర్శించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్షణ కల్పించడంలో (కొన్ని మినహాయింపులతో) హైకోర్టు, సుప్రీంకోర్టుల పని తీరు. సుధా భరద్వాజ్‌, వరవరరావు, ఆనంద్‌ టెల్‌ టుబ్డేలతో పాటు అనేకమంది రచయితలు, విద్యార్థులు, జర్నలిస్టులపై నమోదు చేయబడిన నేరారోపణలను కొట్టివేయాలని పెట్టుకున్న దరఖాస్తులను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏ అరెస్ట్‌కూ రాజకీయ గుర్తింపు గానీ, కోర్టుల అనంగీకారానికి ప్రభుత్వం యొక్క క్రమబద్ధమైన విధానం గానీ లేకుండా పోయింది. ఆఖరికి ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కోరినప్పటికీ, సుప్రీం కోర్టు జమ్మూ కాశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించడానికి తిరస్కరించింది.
కోర్టులు కూడా కండీషన్‌ బెయిల్‌ మంజూరుకు భావ వ్యక్తీకరణను పరిమితం చేసే భారమైన నియమ నిబంధనలను విధించడం మొదలు పెట్టాయి. ఉదాహరణకు, కేరళ హైకోర్టు 2020లో రెహానా ఫాతీమా ఆవు మాంసాన్ని వండుతున్న వీడియోను అప్‌ లోడ్‌ చేసిందన్న నేరారోపణపై అరెస్ట్‌ చేసిన తర్వాత సోషల్‌ మీడియాను ఉపయోగించకూడదన్న నిబంధనలతో మాత్రమే బెయిల్‌ మంజూరు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడన్న అభియోగంపైన అరెస్ట్‌ చేయబడిన ఒక యువకుడిని సోషల్‌ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అలాంటి నిషేధం భావ వ్యక్తీకరణకు ప్రత్యక్షంగా ముప్పు కలుగజేస్తుంది. ఈ తొలగింపులు (సెన్సార్‌ షిప్‌) న్యాయస్థానాల నుంచి వచ్చాయన్న నిజం ప్రమాదకరమైన సూచికలను తెలియజేస్తుంది. ఇది సాధారణంగా న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు ఉండే విశ్వసనీయతను బలహీన పరుస్తుంది.
అందువలన భారతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక శాఖల నుంచి అనేక దాడులను ఎదుర్కొంటుంది. స్వేచ్ఛ అనేది ఒక రాజకీయ ఆవశ్యకత. ప్రజాస్వామ్యం పునరుత్థానం అవడానికీ, దానితోపాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పొందే హక్కు కోసం సహాయం అందించిన వారికి దేశం కృతజ్ఞతలు చెప్పే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కార్యనిర్వహక వర్గాన్ని కఠినమైన ప్రశ్నలు అడిగిన ప్రతిపక్ష రాజకీయ నాయకులు, రైతులకు; ప్రభుత్వ హింసను ధిక్కరించిన స్వతంత్ర జర్నలిస్టులకు, రాజకీయ పరిహాసాన్ని పండించిన కమెడియన్‌లకు కూడా దేశం ఆ రోజున కృతజ్ఞతలు తెలియ జేస్తుంది. కానీ చరిత్ర, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను తొలగించిన నిరంకుశ ప్రభుత్వం పట్ల, ఆ స్వేచ్ఛను పునరుద్ధరించడంలో విఫలమైన న్యాయస్థానాల పట్ల మాత్రం కనికరం చూపించదు.

- కాళీశ్వరమ్‌ రాజ్‌, తులసీ కే. రాజ్‌
'ఫ్రంట్‌ లైన్‌' సౌజన్యంతో
అనువాదం:బోడపట్ల రవీందర్‌,
సెల్‌:9848412451





మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే
మోడీ గారడీ!
విలువల చెలికాడు
లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
జర చెప్పండి ప్లీజ్‌...
భూమి మనిషి సొంతమా?
భారత ప్రజాస్వామ్యం బతుకు పోరాటం చేయాలి
ప్రభుత్వ రంగాన్ని అమ్ముకుంటే రేపు పుట్టగతులుండవ్‌...
నిజమైన దేశభక్తుడు...
సంక్షోభాలు - సైన్స్‌ సమాధానాలు
జీవ రహస్యం
పైత్యం పీక్‌ స్టేజ్‌!
మాతృదేశం వీడారు.!
చివరకు బరిలోకి....
కార్పొరేట్‌ కబ్జాని అడ్డుకోవాలి
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
ఆవు.. అబద్ధాలు.. నిజాలు..
మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?
నయా ఉదారవాదానికి సవాలుగా నిలుస్తున్న రైతు ఉద్యమం
నమ్మండి.. ఇది నల్లదొరల పాలనే
లెటజ్‌ సెలబ్రేట్‌ గురూ..!
నగరాన్ని చుట్టుకోనున్న మరో కొండచిలువ
ఆదివాసీలకు బతికే హక్కులేదా?
ఉద్యోగుల పై దుష్ప్రచారం తగదు
దేశ సేవలో ఇండియన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ
ప్రజా చరిత్రకారుడు ప్రొఫెసర్‌ డిఎన్‌ ఝా
హత్యలు.. న్యాయం.. రాజ్యం..
భవిష్యత్‌ రాజకీయాలపై రైతాంగ పోరాట ప్రభావం

తాజా వార్తలు

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.