Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
భవిష్యత్‌ రాజకీయాలపై రైతాంగ పోరాట ప్రభావం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 21,2021

భవిష్యత్‌ రాజకీయాలపై రైతాంగ పోరాట ప్రభావం

జనవరి 29న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ పట్టణంలో ఒక ముఖ్యమైన ఘటన చోటుచేసుకుంది. లక్ష మందికి పైగా హాజరైన రైతుల 'మహాపంచాయతీ' సభలో ప్రముఖ ముస్లిం రైతు నాయకుడు గులాం అహ్మద్‌ ఓలా, నరేష్‌ తికాయత్‌, జయంత్‌ చౌదరి కలిసి వేదిక పంచుకున్నారు. నరేష్‌ తికాయత్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రముఖ రైతు నాయకుడు మహేంద్రసింగ్‌ తికాయత్‌ కొడుకు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు. అలాగే జయంత్‌ చౌదరి చౌదరి చరణ్‌సింగ్‌ మనవడు అంటే అజిత్‌సింగ్‌ కొడుకు. ఈ ముగ్గురూ ఆ వేదికపై బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దయ్యేవరకు ఐక్యపోరాటం కొనసాగుతుందని ప్రతిజ్ఞ చేసారు.
మహేంద్రసింగ్‌ తికాయత్‌కు గులాం అహ్మద్‌ ఓలా సన్నిహిత సహచరుడు. ఇద్దరూ రైతాంగంపై బాగా పట్టున్న నాయకులు. తికాయత్‌ ఎలక్ట్రిసిటీ బిల్లులు, చెరుకు మద్దతు ధరలు తదితర సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన నాయకుడు. ఆయన కృషిలో ఢిల్లీ బోట్‌క్లబ్‌లో 5లక్షల మంది రైతుల ప్రదర్శన ప్రముఖమైనది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ హయాంలో తికాయత్‌ తన పోరాటాల ద్వారా అనేక రాయితీలు రైతాంగానికి సాధించగలిగారు. ఒకసారి తికాయత్‌ 2008లో అప్పటి ముఖ్యమంత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు. ఆయనను అరెస్ట్‌ చేయాలని మాయావతి ఆదేశించారు. ఆ అరెస్టు చేయటానికి ఆయన గ్రామం సిసౌలీ చుట్టూ 6వేల మంది పోలీసులు మొహరించాల్సి వచ్చింది. ప్రజలపై ఆయన పట్టు అలాంటిది. అయితే తరువాత ఆయన క్షమాపణ చెప్పి జైలు నుంచి విడుదల అయ్యారనుకోండి. అది వేరే సంగతి. మహేంద్రసింగ్‌ తికాయత్‌ 2011లో కాన్సర్‌తో మరణించాడు. ఆయన కుమారుడు నరేష్‌ తికాయత్‌ బీకేయూ (భారతీయ కిసాన్‌ యూనియన్‌) అధ్యక్షుడయ్యాడు. మరో కుమారుడు రాకేష్‌ టికాయత్‌ ఆ సంఘానికి మరో ముఖ్యనాయకుడుగా స్పోక్స్‌ పర్సన్‌గా ఉన్నారు. ఇప్పుడు సాగుతున్న రైతాంగ ఉద్యమంలో వారు చురుకైన పాత్ర వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యక్తులు, నాయకుల ప్రాధాన్యతల కంటే వారు ప్రాతినిథ్యం వహిస్తున్న సామాజిక సమూహాలు, అవి నేటి రైతు ఉద్యమంలో కలిసిపోయిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. వర్గ ఐక్యత పునాదిగా ఈ సామాజిక సమీకరణం జరగటం అనేది భారత భవిష్యత్తు రాజకీయాలలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని మనం గ్రహించాలి. ఈ విషయం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఏడు సంవత్సరాలు వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది.
2013లో ముజఫర్‌నగర్‌లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్యర్యంలో మతదాడులు జరిగాయి. చాలా పెద్దయొత్తున మారణకాండ, ఆస్తుల లూటీలు జరిగాయి. 62మంది చనిపోయారు. 50వేల మంది నిర్వాసితులయ్యారు. ఈ మారణకాండకు నిరసనగా ముస్లిం నాయకుడు గులాంఅహ్మద్‌ ఓలా, తన నాయకుడు మహేంద్రసింగ్‌ తికాయత్‌ నుంచి విడిపోయాడు. వేలాదిగా రైతులతో విడిగా సంఘం స్థాపించి నడుపుతున్నాడు. తరువాత జరిగిన వివిధ ఎన్నికల్లో ముస్లింలకు వ్యతిరేకంగా తికాయత్‌ అనుచరులు, జయంత్‌ చౌదరి తదితరులు బీజేపీకి మద్దతు ఇచ్చిన సందర్బాలున్నాయి. ఇప్పుడు వీరంతా ఆ శత్రుత్వాలన్నీ మర్చిపోయి జరుగుతున్న రైతాంగ పోరాటంలో కలిసిపోయారు. కుల, మత వైరుధ్యాలకంటే వర్గవైరుధ్యం ప్రముఖంగా మందుకు వచ్చిందనేది ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశం.
లక్షమందికి పైగా హాజరైన ముజఫర్‌పూర్‌ మహాపంచాయతీ సభలో గులాంఅహ్మద్‌ ఓలా ఇలా ప్రసంగించాడు.. ''నేను 27ఏండ్లపాటు మహేంద్రసింగ్‌ తికాయత్‌తో కలిసి పనిజేసాను. నరేష్‌, రాకేష్‌లు నాకు కొడుకుల్లాంటి వారు. కానీ వాళ్లు 2013తర్వాత తప్పుదారి ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు నరేష్‌ తన తప్పు ఒప్పుకున్నాడు. అలాగే జయంత్‌ ఈ సభలో నా కాళ్లు తాకాడు. దీంతో ఆనాటి గాయాలు మానిపోతాయనే భావిస్తున్నాను. ఇక్కడ హాజరైన లక్షమంది రైతాంగంలో ముస్లింలు 30వేలకు పైగా ఉన్నారు. వాళ్లంతా తాము 'ముందుగా రైతులమనీ ఆ తర్వాతే ముస్లింలమనీ' అనుకుంటున్నారు''. ఇలా సాగింది గులాంఅహ్మద్‌ ప్రసంగం. రైతాంగ పోరాటం సామాజిక ఐక్యతనెలా సాధించిందో చెప్పటాకికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ కాదా? ఇలాంటి మహా పంచాయతీలు ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా యూపీ, హరియానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వందల కొద్దీ జరుగుతున్నాయి. వీటన్నింటిలో ఇతర రైతు నాయకులతో పాటు సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఐద్వా నాయకులు విస్తృతంగా పాల్గొంటున్నారు, ప్రసంగిస్తున్నారు. ఈ సభల్లో అన్ని మతాలవారు, కులాలవారు, స్త్రీలు, పిల్లలు, గిరిజనులు, దళితులు అన్ని సామాజిక వర్గాల తరగతుల వారూ ఐక్యంగా వేల సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలి. అలా కొనసాగితే భారత రాజకీయాల స్వరూపమే మారిపోతుంది. ఇప్పటివరకూ కుల, మత ప్రాతిపదికలపైన జరుగుతున్న విభజన రాజకీయాలు మారిపోయి వాటి స్థానంలో వర్గ ప్రాతిపదికన సమరశీల పోరాటాలకు నాంది పలుకుతాయి.
రైతాంగ పోరాటం రోజురోజుకు మరింత ఉదృతమవుతోంది. జనవరి 26న లక్ష ట్రాక్టర్ల ప్రదర్శన సందర్భంగా ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగిన కొన్ని ఘటనలను సాకుగా చూపి పెద్దఎత్తున నిర్బంధం ప్రయోగించి ఉద్యమాన్ని అణచాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం తిరగబడి ప్రభుత్వం అభాసుపాలైంది. ఉద్యమం మరింత ఉదృతమై ఢిల్లీ సరిహద్దులలో ధర్నాల సంఖ్య మరింతగా పెరిగింది. ఫిభ్రవరి 6న రాస్తారోకో అత్యంత జయప్రదమైంది. ఉత్తరాన కాశ్మీర్‌ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకూ, తూర్పున త్రిపుర బెంగాల్‌ నుంచి పశ్చిమాన గుజరాత్‌ మహారాష్ట్ర వరకూ అన్ని జాతీయ రహదారులూ స్తంబించాయి. అలాగే ఫిబ్రవరి 18న జరిగిన రైల్‌రోకో కూడా బాగా జయప్రదమైంది. ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా, యూపీ, రాజస్థాన్‌ వగైరా ఉత్తరాది రాష్ట్రాలలో వందలాది రైళ్లను ప్రభుత్వమే నిలిపేసుకోవాల్సి వచ్చింది.
అయినా మోడీ ప్రభుత్వం మాత్రం తన వంకరబుద్దిని వదులుకోవటం లేదు. అనేక విధాలుగా ఉద్యమాన్ని అప్రదిష్టపాలుజేయటానికి, నిర్భందాలు ప్రయోగించటానికి పూనుకుంటున్నది. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మోడీ రైతులను 'ఆందోళనజీవుల'నీ, 'పరాన్న బుక్కుల'నీ నిందించాడు. ఆందోళనలు లేకుండా మన దేశ స్వాతంత్య్రంతో సహా ఏ హక్కూ, ఏనాడూ సాధించబడలేదన్న సత్యం మోడీ తెలుసుకోవాలి. ఏ కష్టం చేయకుండా ఇతరుల మీదపడి బతికేవాడు పరాన్నబుక్కు తప్ప తన కష్టంతో మొత్తం దేశానికే అన్నం పెడుతున్న అన్నదాత పరాన్నబుక్కు ఎలా అవుతాడు? కాబట్టి రైతులను పరాన్న బుక్కులని నిందించేవాడి ఇంగితజ్ఞానాన్నే ప్రశ్నించాల్సి ఉంటుంది తప్ప ఇలాంటి కువిమర్శల వల్ల రైతాంగ ఉద్యమానికి జరిగే హాని ఏమీ ఉండబోదని గ్రహించాలి.
ఇక ఉదృతమవుతున్న ఈ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న మన పాలకులు అడ్డగోలు దాడులకు నిర్బంధాలకు పూనుకుంటున్నారు. అలాగైనా ఉద్యమకారులను భయపెట్టవచ్చునేమోనని ఆశపడుతున్నారు. భారత రైతాంగ పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా అభ్యుదయ వాదుల మద్దతు పెరుగుతోంది. విదేశీ ప్రముఖులు రైతాంగ ఉద్యమానికి మద్దతు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వ నేతలు దానికి విరుగుడుగా మన దేశ సెలబ్రిటీలతో ముఖ్యంగా సినీ, క్రికెట్‌ రంగాలవారితో రైతాంగానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయించటానికి వారిపై వత్తిడి తెస్తున్నారు. సచిన్‌ టెండూల్కర్‌, లతా మంగేష్కర్‌ లాంటి కొందరు ప్రముఖులు అలాంటి వత్తిడికి గురైనవారిలో ఉన్నారు. కొంతమంది ఈ వత్తిడులకు లొంగినా అనేకమంది అందుకు తిరస్కరించి రైతాంగానికి మద్దతు ఇస్తుండటం మనం చూస్తున్నాం. అంతర్జాతీయ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ భారత రైతాంగ ఉద్యమానికి మద్దతుగా ప్రతిపాదించిన ఉద్యమ కార్యాచరణ 'టూల్‌కిట్‌'ను షేర్‌ చేసినందుకు బెంగుళూరుకు చెందిన 'ఫ్రైడే ఫ్యూచర్‌' కార్యకర్త దిశారవిని అరెస్ట్‌ చేయటం, ఢిల్లీ ప్రదర్శన సందర్బంగా 122మంది అమాయక రైతులపై అక్రమకేసుల బనాయింపు, ఇంకా అనేకమందిని అరెస్ట్‌ చేస్తూ 'ఖలిస్థాన్‌'వాదులుగా ముద్రలు వేయటం జరిగింది. సింఘా సరిహద్దులో ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్త నవ్‌దీప్‌ కౌర్‌ను అరెస్ట్‌చేసి ఉద్యోగంలోంచి తీసెయ్యడం, ఇంకా కవులు, కళాకారులపై కేసులు ఈ విధమైన నిర్బంధాలకు ప్రభుత్వం తెగబడింది. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తోంది. సింఘా సరిహద్దుకు సందర్శనకు వెళ్లిన 15మంది పార్లమెంట్‌ సభ్యుల బృందాన్ని 3కి.మీ. ముందే అడ్డుకున్నారు.
తనను వ్యతిరేకించేవారిని, ప్రశ్నించేవారిని కేసుల్లో ఇరికించటానికి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించటానికి మోడీ ప్రభుత్వం ఎంతగా దిగజారి ప్రవర్తిస్తుందో భీమా కోరేగాం కేసులో వ్యవహరించిన తీరు చూస్తే అర్ధమవుతుంది. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత వరవరరావుతో సహా 16మంది భీమాకోరేగాం కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రధాని మోడీని హత్యచేయటానికి, ప్రభుత్వాన్ని కూలదోయ టానికి, ఇందుకు అవసరమైన డబ్బు పోగేయటానికి ఈ నిందితులు కుట్రచేసారనేది వారిపై మోపబడిన ఆరోపణ. ఇందుకు సాక్ష్యంగా ఈ నిందితులలో ఒకరైన రోనా విల్సన్‌ దగ్గర స్వాధీనం చేసుకున్న ఆయన కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌లోని లేఖలను చూపారు. పదేపదే ఎన్నోసార్లు కోరిన మీదట నిందితులకు కోర్టు ఇచ్చిన ఆ హార్డ్‌డిస్క్‌ల కాపీల ద్వారా 'అసలు నిజాలు' బయటపడ్డాయి. ప్రభుత్వం చూపిన ఆధారాలు, సాక్ష్యాలన్నీ అభూత కల్పనలేనని స్పష్టంగా రుజువయింది. అంతర్జాతీయ ప్రమాణాలతో పనిజేస్తున్న ప్రతిష్టాత్మక 'ఆర్సెనాల్‌ కన్సల్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌' అనే అమెరికా ఫోరెన్సిక్‌ లేబరేటరీ సంస్థ ఆ హార్డ్‌డిస్క్‌లను తమ లేబరేటరీలో విశ్లేషించి 16పేజీల నివేదిక ద్వారా ఈ నిజాలను బయటపెట్టింది.
ఆ నివేదిక సారాంశమేమిటంటే కొందరు హాకర్లు (హ్యాకర్లంటే కంప్యూటర్‌లలో అక్రమంగా ప్రవేశించి నేరాలు చేసేవాళ్లు - ఈ కేసులో ప్రభుత్వ ఏజంట్లు) 2016 జూన్‌ 13న ఒక ఫేక్‌ మెయిల్‌ ద్వారా రోనా విల్సన్‌ కంప్యూటర్‌లోకి ప్రవేశించారు. అంతకు ముందే ఇదే హ్యాకర్లు వరవరరావు కంప్యూటర్‌లో ప్రవేశించారు. ఈ ఇద్దరి మధ్య వారి ప్రమేయం లేకుండానే ఉత్తరాలు నడిపారు. ఆ ఉత్తరాల్లో మోడీ హత్యకు, ప్రభుత్వ కూల్చివేతకు సంబందించిన విషయాలన్నీ ఉన్నాయి. ఆ ఉత్తరాలనే వారి నుంచి స్వాదీనం చేసుకుని కోర్టులో సాక్ష్యాలుగా ప్రవేశపెట్టారు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే ఎన్నడూ హిందీలో రాయని వరవరరావు హిందీలో ఉత్తరాలు రాయటం. ఈ విషయాలన్నీ ఆర్సెనాల్‌ సంస్థ బయటపెట్టినా ఇప్పటికీ ప్రభుత్వం నోరుమెదపక పోవటం, ప్రధాన మీడియా పట్టించుకోకపోవటం మనం గమనించాలి. మన ప్రభుత్వం యొక్క, ప్రధాన మీడియా యొక్క వర్గనైజాన్ని ఇది బయటపెడుతోంది.
ఈ రైతాంగ పోరాటం మన పాలక వర్గాలు అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడితో కుమ్మక్కై భారత వ్యవసాయ రంగాన్ని కబళించటానికి చేస్తున్న కుట్రను బయట పెట్టింది. ఈ పోరాటం ఒకవైపు కార్పొరేట్‌ శక్తులతో మిలాఖతైన బడాబూర్జువా వర్గాలకు, మరోవైపు ధనికరైతాంగంతో సహా మొత్తం రైతాంగానికి మద్య వైరుధ్యంగా ముందుకొచ్చింది. కార్మికోద్యమం ఇతర శ్రామిక వర్గాలతో కలిసి మరింత ముందుకెళ్లటానికి ఈ వైరుధ్యం తోడ్పడుతుంది. ఇది కార్మిక వర్గానికి కొత్త మిత్రులను సమీకరించుకోవటానికి, భారత రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయటానికి అవకాశం కల్పిస్తోంది.

- తమ్మినేని వీరభద్రం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభాలు - సైన్స్‌ సమాధానాలు
జీవ రహస్యం
పైత్యం పీక్‌ స్టేజ్‌!
మాతృదేశం వీడారు.!
చివరకు బరిలోకి....
కార్పొరేట్‌ కబ్జాని అడ్డుకోవాలి
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
ఆవు.. అబద్ధాలు.. నిజాలు..
మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?
నయా ఉదారవాదానికి సవాలుగా నిలుస్తున్న రైతు ఉద్యమం
నమ్మండి.. ఇది నల్లదొరల పాలనే
లెటజ్‌ సెలబ్రేట్‌ గురూ..!
నగరాన్ని చుట్టుకోనున్న మరో కొండచిలువ
ఆదివాసీలకు బతికే హక్కులేదా?
ఉద్యోగుల పై దుష్ప్రచారం తగదు
దేశ సేవలో ఇండియన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ
భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
ప్రజా చరిత్రకారుడు ప్రొఫెసర్‌ డిఎన్‌ ఝా
హత్యలు.. న్యాయం.. రాజ్యం..
ఎల్‌ఐసీ అమ్మకం చారిత్రక తప్పిదం
ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి...
వాళ్లవల్లే.. మేమే గ్రేట్‌
అయ్యో దేవుడికెంత కష్టం!
ఎవరు కన్న బిడ్డరా.. ఎక్కి ఎక్కి ఏడ్చింది..
'న్యూస్‌క్లిక్‌'ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
త్యాగాల పాట..
ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పా భార్గవ
ఉద్యమ 'దిశ'

తాజా వార్తలు

06:34 AM

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

09:39 PM

మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..

09:30 PM

పాము కాటుతో గొర్కెల కాపరి మృతి

09:19 PM

కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన

09:12 PM

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం..12మందికి పాజిటివ్

09:02 PM

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

08:53 PM

సూర్యాపేట జిల్లాలో 129 కేజీల గంజాయి పట్టివేత

08:47 PM

జగిత్యాల జిల్లాలో వైద్యం వికటించి వ్యక్తి మృతి..

08:39 PM

చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా ఎంపికైన చేతన

08:25 PM

ఎట్టి పరిస్థితుల్లో నేను మాస్క్ ధరించను: రాజ్ థాకరే

08:17 PM

పోలీసుల అదుపులో యూట్యూబ్‌‌ స్టార్‌ షణ్ముఖ్‌‌..

08:10 PM

న్యాయవాదుల హత్యపై కేసీఆర్‌ స్పందించకపోవడం శోచనీయం..

08:02 PM

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : తేజస్వీ యాదవ్‌

07:54 PM

దేశంలో పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

07:40 PM

టీకా ధర నిర్ణయించిన కేంద్రం.. రేటు ఎంతో తెలుసా..?

07:33 PM

పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ అదృశ్యం

07:26 PM

భార్యను బెదిరించడానికి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు..

07:15 PM

మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్

07:08 PM

మహారాష్ట్రలో మార్చి 8వరకు లాక్‌డౌన్‌..

07:00 PM

బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు

06:56 PM

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

06:44 PM

ఖమ్మం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి రెండు ఇళ్లు దగ్థం..

06:39 PM

ఏపీలో కొత్తగా మరో 118 పాజిటివ్ కేసులు

06:10 PM

కాంగ్రెస్ బలహీనపడుతోంది.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

06:00 PM

ఆమె కలెక్టర్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

05:47 PM

నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: కేకే

05:38 PM

పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

05:29 PM

విషాదం.. అలిపిరి మెట్ల మార్గంలో బీటెక్ విద్యార్థి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.