Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ గణ తంత్ర దినం
నా రైతు నవ చరితను
లిఖించిన దినం
స్వాతంత్య్రానంతరం
ఉవ్వెత్తున ఉరికిన
ఉద్యమ తరంగం.
దేశరాజధాని
గుండెంతా
రైతు నిండిన క్షణం
వేకువ వెలుగుల
ప్రవాహమైన
క్రాంతి సింధూరం
శాంతి సామరస్యం
నింగికెగిరిన
శ్వేతకపోతం
స్వేదంతో మమేకం
ప్రకృతి పచ్చదనం
త్రివర్ణ పతాకమై
నా రైతుకు
చేసిన వందనం
ప్రజలను నడిపేది
ఆయుధ పాలన కాదని
ఉద్యమంతో సాగే
ప్రజా స్వామ్యలాలనని
ధర్మచక్రంగా
రుజువైన భారతం
ఉద్యమంలోనే కదా
అసలు రంగులు స్పష్టం
సన్నాయి నొక్కులకు
మీనమేషాలకు
కచ్చిత నీచకుట్రలకు
కాలంచెల్లిన వైనం
కళ్ళుంటే చూడాలి
మనసుంటే వినాలి
తెలివుంటే నేర్చుకోవాలి
నా రైతు ఉత్యమ పథం
ముప్పూటలా కష్టపడి
అన్నం పెట్టే వాస్తవం
బిడ్డలతో పహారా
కాయించే దేశరక్షణం
ఇప్పుడు
ప్రజాస్వామ్యాన్ని కాపాడే
హృదయాంతరంగం
సస్యశ్యామల భారతం
అంబానీ అదానీలది
ససేమిరా కాదని
భావిభారతానిదేనని
ఉద్యమ సాక్షిగా
చేసిన శపథం
అణచివేతకు
గురైనవారి
తిరుగుబాటులోనే
చరిత్ర పురుడు
పోసుకోవడం
నిత్యం.. సత్యం.. తథ్యం..
- కె. శాంతారావు
సెల్: 9959745723