Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సమరం జయిస్తుంది... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2021

సమరం జయిస్తుంది...

గణతంత్ర దినోత్సవాన రణతంత్రుల మీటుతోంది. ఘనజనం, కృషీవలుల సమూహం. మట్టిగుండెలు నింగిపైకి ఎగజిమ్ముతున్న నినాదమై, మనిషి వెనుక మనిషితోడు, వరుసలలో ప్రవాహజోరు, ఉరకలేస్తు ఉవ్వెత్తున చైతన్య పథగమనం, పదండి ముందుకు, ముందుకేనంటూ కదులుతోంది ప్రభంజనం. దిక్కులన్ని పిక్కటిల్ల ధిక్కారపు గొంతుల జడి, దారిపొడవు జీవనసడి సాగిపోయే సమరానికి, పిడికెడు ధైర్యపు ఖడ్గం, దోసెడు సంకల్పాన్ని ఎదనింపిన వర్గం, వణికించే చలిపై మనోఫిరంగి పేల్చి, ఆకలి దప్పుల కత్తిని అరివీరులై విరిచి, దీర్ఘశృతిలో, తీవ్ర ధ్వనితో ఒకే ఒక్క లక్ష్యంతో ఐక్యంగా లక్షలాది గుండెలు కదిలిన దృశ్యం, అదిగదిగో కండ్లముందు, మన ముందర కదులుతోంది. ఓ యువతా! ఓ భవితా! శ్రామికుడా, మేథావీ కళారవీ కవీ, సైనికుడా సజ్జనుడా! నిరంతరం చెమటోడ్చి సకలం సృష్టించేవాడా, ఉద్యోగి, బోధకుడా, సామాన్యుడా, సాహసుడా కనండి కండ్లారా! మన గణతంత్రాన్ని ఘనంగా నిలుపుకునే ప్రయత్నమే యిది. మనందరి శ్రేయస్సుకు, అన్నంమీద ఆధారపడే మనుషులందరి భవిష్యత్తును కాపాడుకునే తండ్లాట యిది. ఏ ఒక్కరిదో కాదు సమరం... సమస్త జనావళి కలలకు కాపలాకాసే కవాతు ఇది.
వాళ్ళు కందకాలు తవ్వుతారు. చైతన్యాన్ని అడ్డుకునేందుకు, వాళ్ళు కుట్రలు పన్ని ఐక్యతపై వేటేయ పూనుకుంటారు. వాళ్ళు నీటి ఫిరంగుల్ని పేల్చి నినాదాల్ని చల్లార్చాలనుకుంటారు. వాళ్ళు సైనికుల లాఠీలతో అక్కసును వెల్లగక్కుతారు. వాళ్ళు, ఉగ్రవాదులని విషాన్ని నిర్లజ్జగా చిమ్ముతారు. వాళ్ళు కుతంత్రాలు చేసి దేశద్రోహులని అబద్ధాలు కుమ్మరిస్తారు. చెమటవాసనే పడని, శ్రమ సౌందర్యమే తెలియని ఒఠ్ఠి మూర్ఖశిఖామనులు వాళ్ళు. అంతే కాదు, సైనికులై దేశానికి పహరా కాస్తున్న దేహాల వారసత్వాన్ని ద్రోహులుగా చిత్రిస్తారు. అమాంతంగా హంతకులను నియమించి హత్యలకూ పథకాలు వేస్తారు. విధ్వంసానికి వ్యూహరచన చేస్తారు. ఇవన్నీ కొందరు వ్యక్తులుగా చేస్తున్నదికాదు... సాక్షాత్తూ అధికారం చేస్తున్న నీచత్వం ఇంతకంటే హీనమైనదేమున్నది ప్రజాస్వామ్యాన.
ఇన్ని ఎత్తులు వేసినా ఉద్యమం శాంతిని వీడలేదు. సహనాన్ని కోల్పోలేదు. ప్రాణాలు గాలిలో కలుస్తున్నా మానవీయ కోణాన్ని వీడలేదు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లలేదు. తమని నిలువరించే పోలీసు బలగాలకు అన్నం పెట్టారే తప్ప నష్టాన్ని తలపెట్టలేదు. తమజీవితాల కోసం పడే తాపత్రయం, త్యాగం తప్ప విధ్వంస రచన చేయనేలేదు. అందుకనే ఇది చరిత్ర పుటల్లోకి చేరుకుంటున్న ఉద్యమం. స్వాతంత్య్రోద్యమం తరువాత పీడనపై, దోపిడీపై ఎగిసి పడుతున్న రైతాంగ సంకల్ప నిబద్ధ మహౌద్యమం. స్వదేశీ రక్షణకై సాగుతున్న నిజమైన దేశభక్తి ఉద్యమం. డాక్టర్‌ అంబేద్కర్‌ నేతృత్వంలో రూపొందించిన రాజ్యాంగం అందించిన హక్కులను పరిరక్షించుకునే పోరాటం. అందుకనే దేశరాజధానికి బారులు తీరి పహరాకాస్తున్నది. మనందరి హృదిని కదిలిస్తున్నది. ప్రపంచ దేశాల ప్రజల చూపుల్ని తనవైపు తిప్పుకుంటున్నది. అశేష జనుల జేజేలు పొందుతున్నది.
పదిహేనుకోట్ల రైతుల గుండెలయకు ఈ ఉద్యమం ఓ ప్రతీక. వ్యవసాయంతో అనుబంధమై ఉన్న యాభైకోట్ల ప్రజల జీవన్మరణ సమస్య. ఈ మహౌద్యమాన్ని చిన్నదిగా చూపాలన్న కుబుద్ధుల ప్రయత్నాలేవీ సఫలం కాకపోవటంతో ప్రత్యక్ష నిర్భంధానికి పూనుకొని పంతానికి పోతున్నది ప్రభుత. కానీ, ''నేనుపోతే మా వారసులు బారులుతీరి వస్తారనే'' రణన్నినాదం అచంచల ఆత్మ విశ్వాసానికి, వర్గపోరు లక్షణానికి మచ్చుతునక. ఈ దేశంలోని ప్రగతి శీలశక్తులకు, వర్గ ఉద్యమకారులకు ఇదో స్ఫూర్తిపాఠం. రాబోయే కాలానికి ఓ ప్రేరణాఘట్టం. జీవన సమస్య అవలోకనలోకి వస్తే సంఘర్షణ ఎంత తీవ్రంగా నిబద్ధంగా ఆచరణలోకి మారుతుందో, ఎన్ని సవాళ్ళనైనా ఎలా ఎదుర్కొంటుందో కండ్ల ముందుంచిన ఉద్యమమిది. శత్రువు, ప్రత్యర్థి ఎంతవాడు, ఎవరనేది కాదు. మన జీవితం మునిగిపోతున్నప్పుడు ఎదురుతిరిగి నిలబడడమే ప్రకృతి నైజమని, సామాజిక చలనమని నిరూపించిన ఉద్యమం ఇది.
ఇది మతాలకతీతంగా, కులాలకతీతంగా, ప్రాంతాల హద్దులను చెరిపేసిన ఉద్యమం. మహిళల భాగస్వామ్యం సమభాగంగా సాగుతున్నది. మహిళా దృఢచిత్తానికి ఉదాహరణగా నిలుస్తున్న పోరాటం ఇది. ఇన్ని విధాలుగా సంచలనంగా అరువై దినాలుగా రాజధాని వీధులు వీరోచిత పోరాటానికి వేదికలవుతున్నా, చలినెగళ్ళ వేడితో ధ్వనిస్తున్న సమరదృశ్యాల్ని పతాక శీర్షిక చేయలేకపోతున్న మన మీడియా ఎవరి పక్షం వహిస్తున్నదో, ఎటువైపు మొగ్గివున్నదో తేటపరుస్తున్నదీ ఈ ఉద్యమమే.
కొందరు మేథోజీవుల ఆలోచనల అమ్మకాలు, ఎంత నిర్లజ్జగా జరుగుతున్నాయో, ఎన్ని భ్రమల రెక్కలపై విహరిస్తున్నాయో వెన్నుచరిచి చూపించిన ఉద్యమమూ ఇదే. ఎన్ని పాఠాలను ఇచ్చింది! ఎవరెవరు ఎలా ఆలోచిస్తారో చూపింది! అయినా ఒకే ఒక్కలక్ష్యం కోసం పెరేడ్‌ చేస్తోంది. కార్పొరేట్ల కత్తికి మా కుత్తుకలను తెగ్గొట్టొద్దంటూ గొంంతులే ఢంకాధ్వానాలై ఎలుగెత్తుతూ ధ్వనిస్తోంది.
అందుకనే సమస్త ప్రజలారా! రండి వాళ్ళు నినదిస్తున్నది మనందరికోసమే. అన్నంతినే వాళ్ళందరి సమస్య కోసమే. ఇప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. కాలం తప్పక కొత్తపొద్దును వాగ్దానం చేస్తుంది. సమైక్య సమరం జయిస్తుంది.

- కె. ఆనందాచారి
సెల్‌:9948787660



మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేట్‌ - కాషాయ కూటమికి ప్రతిఘటన
మార్చి 8-మహిళల భద్రత - సవాళ్ళు
శ్రామిక మహిళా పోరాటం వర్థిల్లాలి
బీజేపీ టూల్‌కిట్టు - చమురు బాండ్ల లోగుట్టు
బీజేపీ టూల్‌ కిట్టు - చమురు బాండ్ల లోగుట్టు
వ్యవస్థ ఉన్నతం.. వ్యాఖ్యలు పాతాళం
మోడీ ఇమేజ్‌ మసక బారుతోంది
పురాణాలకు చారిత్రక ఆధారాలుండవు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మన కర్తవ్యం
ప్రశ్న గెలవాలి
వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే
మోడీ గారడీ!
విలువల చెలికాడు
లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
జర చెప్పండి ప్లీజ్‌...
భూమి మనిషి సొంతమా?
భారత ప్రజాస్వామ్యం బతుకు పోరాటం చేయాలి
ప్రభుత్వ రంగాన్ని అమ్ముకుంటే రేపు పుట్టగతులుండవ్‌...
నిజమైన దేశభక్తుడు...
సంక్షోభాలు - సైన్స్‌ సమాధానాలు
జీవ రహస్యం
పైత్యం పీక్‌ స్టేజ్‌!
మాతృదేశం వీడారు.!
చివరకు బరిలోకి....
కార్పొరేట్‌ కబ్జాని అడ్డుకోవాలి
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
ఆవు.. అబద్ధాలు.. నిజాలు..
మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?

తాజా వార్తలు

12:03 PM

నడిరోడ్డులో టీచ‌ర్‌పై విద్యార్థి కాల్పులు...

11:35 AM

ఆ కొండంతా బంగారం...

11:16 AM

ఘోర రోడ్డు ప్రమాదం...

11:10 AM

దేశంలో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు

11:00 AM

సొంత అన్న, అక్కను చంపిన తమ్ముడు

10:40 AM

అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి

10:36 AM

రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత

10:26 AM

ప్రియుడిపై పెట్రోల్‌ బాంబు దాడి

10:10 AM

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

09:20 AM

రౌడీషీటర్ దారుణ హత్య

09:08 AM

భార్య చేతులు క‌ట్టే‌సి నోట్లో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ పోసి

08:48 AM

ఫిలింనగర్‌లో దారుణం...

08:25 AM

కాచిగూడలో నిప్పంటించుకుని నవ వధువు ఆత్మహత్య

08:09 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:46 AM

14 నెలలకే వధువు ఆత్మహత్య

07:25 AM

రంగానగర్‌లో యువకుడి దారుణ హత్య

07:14 AM

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు...

07:00 AM

రెండో డోసు తీసుకున్నాక కరోనా పాజిటివ్..!

06:46 AM

మహిళలకు యశోద ఆస్పత్రి ప్రత్యేక ప్యాకేజీ

06:44 AM

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌

06:34 AM

కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు

09:59 PM

అదే జరిగితే 100 ఏళ్లు వెనక్కిపోతా: హరీశ్ రావు

09:48 PM

రెండో డోసు తీసుకున్నాక డాక్టర్ కు కరోనా

09:29 PM

ఈ నెల 15 త‌ర్వాత తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు

09:15 PM

మహా­రా­ష్ట్రలో 10,187 కరోనా కేసులు నమోదు

09:09 PM

ఎన్నికల్లో బీజేపీకి యువత సరైన సమాధానం చెప్పాలి : కేటీఆర్

08:51 PM

బస్సులో మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు

08:35 PM

బాంబు‌ పేలుడు.. 20 మంది మృతి

08:29 PM

మనిషి అలికిడి లేక.. ఆవిష్కరణ

08:14 PM

దేవాలయాలపై దాడుల వెనుక ఉన్నది హిందుత్వవాదులే : ఒవైసీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.