Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విప్లవాల మిత్రుడు
విశ్వజ్ఞాన నేత్రుడు
బూర్గుల వాస్తవ్యుడు
తెలంగాణ వీరుడూ
దేశభక్తితో పెరిగినాడమ్మా నర్సింగరావు
ఎర్రజెండా నెత్తినాడమ్మా నర్సింగరావు
భూస్వాముల ఇంటబట్టి - నిరుపేదలవెంట నడిచి
విదేశాల్లో చదువుకొని - పూరి గుడిసెలు వెతుక్కొని
జనుల మేలును కోరుకుంటూ - ఊరికై తండ్లాడుకుంటూ
త్యాగాల తరమునందు వరములాగ అందివచ్చిన
బక్క పలుచని బుద్దిజీవమ్మా - నర్సింగరావు
ముక్కు సూటిగా నడిచినాడమ్మా - నర్సింగరావు
నైజామును ఎదిరించిన - సాయుధ పోరాటమందు
విప్లవాల కొలువు దీరిన - విద్యార్థి సంఘమందు
కలమునే కత్తోలె జేసిన - ఇమ్రోజ్ పత్రికందు
సాహిత్య కొలువు దీరిన వెన్నెల రాతిరియందు
చలితో కొలిమి రాజేసిండు - నర్సింగరావు
చీకటింట వేకువయ్యిండు - నర్సింగరావు
ముల్కిరూలుకై పోరిన - అచ్చమైన హైద్రబాది
తెలంగాణకు పాదులేసిన - తొలితరము సామ్యవాది
గద్దెపై ఎవరున్న బెదరక - ఎదురు నిలిచిన జైలుఖైది
కమ్యూనిజమును కలగంటూ కడదాకా మేల్కొంటు
కరోనాకే బెదరనన్నాడు - నర్సింగరావు
పిరికితనమే మరణమన్నాడు - నర్సింగరావు
విప్లవాల అస్త్రమూ - మార్క్సిజమే శాస్త్రమూ
గెలుపుతథ్యం సత్యమన్నాడో - నర్సింగరావు
అలుపు సొలుపు పారదోలాడో - నర్సింగరావు
- మిత్ర