Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
చట్టాల కోరల్లో కార్మికులు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

చట్టాల కోరల్లో కార్మికులు

కార్మికులు పోరాడి సాధించు కున్న కార్మిక చట్టాలను సవరించి, వారి హక్కులను హరించి, యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా మార్చడమే నేటి ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. కరోనా కల్లోలంలో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికవర్గానికి ఉపాధి కరువైంది.కరోనా కాలంలో కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని, వారందరికీ తగిన సామాజిక భద్రత కల్పించాలని, సాధారణ పరిస్థితులు నెలకొనే దాకా ఒక్కో కార్మికుడికి పది వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించాలని, కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావడం సరైంది కాదని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించరాదని అనేక ఆందోళనలు జరిగాయి. అయినా 2020సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ ఏకపక్షంగా కార్మిక వ్యతిరేక బిల్లులను ఆమోదించింది. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను 4 కోడ్‌లుగా రూపొందిస్తున్నామని, కార్మిక వర్గానికి ఇది లాభం చేకూర్చే విధంగా ఉంటుందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మాటలు వట్టి బూటకం.
ఆక్యుపేషన్‌, సేఫ్టీ, హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌ కండిషన్‌ కోడ్‌2020
ఈ కోడ్‌లో కలిపిన చట్టాలు 1. ఫ్యాక్టరీ యాక్ట్‌ 1948, 2.మైన్స్‌ యాక్ట్‌1952, 3.డెక్‌ వర్కర్స్‌(సేఫ్టీ హెల్త్‌ అండ్‌ వెల్ఫేర్‌)యాక్ట్‌ 1986, 4.భవన ఇతర నిర్మాణ కార్మిక చట్టం 1996 (ఓబిసి), 5.ప్లాంటేషన్‌ లేబర్‌ యాక్ట్‌ 1951, 6. కాంట్రాక్ట్‌ లేబర్‌ (రెగ్యులేషన్‌ అండ్‌ అబాలిషన్‌)యాక్ట్‌ 1970(సియల్‌ ఏఆర్‌ యస్‌), 8.వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఇతర న్యూస్‌ పేపర్స్‌ ఎంప్లాయిస్‌ యాక్ట్‌ 1955, 9.వర్కింగ్‌ జర్నలిస్ట్‌ 1958, 10.మోటార్‌ ట్రార్ట్‌ యాక్ట్‌ 1976, 11.సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయిస్‌ యాక్ట్‌1976, 12.బీడీ, చుట్ట కార్మికుల చట్టం 1966, 13.సినీ వర్కర్స్‌, సినిమా ధియేటర్స్‌ వర్కర్స్‌ యాక్ట్‌ 1981. ఈ సంక్షేమ చట్టాలన్నీ విడివిడిగా ఆయా రంగాలకు వర్తించే విధంగా రూపొందించబడినవి. దీనికి తూట్లు పొడిచే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేసింది. పార్లమెంట్‌ ఆమోదించిన వేజ్‌ కోడ్‌లో లేబర్‌ అధికారుల అధికారాలను కత్తిరించడం జరిగింది. లేబర్‌ అధికారుల పాత్ర నేడు కేవలం ఫెసిలిటేటర్‌గా, యజమాని సహాయకుడిగా ఉండటమే తప్ప మరొకటి లేదు. దీనివల్ల జరిగేది ఏమిటి? వేజ్‌ కోడ్‌ కార్మిక వర్గానికి లాభం చేయకపోగా అత్యంత నష్టాన్ని కలిగించే విధంగా పాలకవర్గాలు ఆమోదించడం సిగ్గుచేటైన విషయం.
సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌ 2020: 9 కేంద్ర కార్మిక చట్టాలను కుదిస్తూ ఈ కోడ్‌గా రూపొందించారు.
1.కార్మిక భవిష్య నిధి చట్టం 1952(పి.ఎఫ్‌), 2. ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ యాక్ట్‌ 1948(ఇ.యస్‌.ఐ), 3.ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌(కంపల్సరీ నోటిఫికేషన్‌ ఆఫ్‌ వేకెన్సీస్‌)యాక్ట్‌ 1959, 4.మెటర్నటీ బెనిఫిట్‌ యాక్ట్‌ 1961, 5.గ్రాట్యుటీ యాక్ట్‌ 1972, 6.సినీ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ యాక్ట్‌ 1981, 7.భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996(బిఓసి), 8.అన్‌ ఆర్గనైజ్డ్‌ వర్కర్స్‌ సోషల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ 2008, 9.ఎంప్లాయిస్‌ కంపెనైజేషన్‌ యాక్ట్‌ 1993(డబ్ల్యు.సి) లాంటి కేంద్ర కార్మిక చట్టాలన్నింటినీ కలిపి ఒక కోడ్‌గా రూపొందించడం మేము చేసిన ఘన కార్యం అని కేంద్రం. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరించి వేసే లక్ష్యమే నేడు ఈ ప్రభుత్వం ఆమోదించిన కోడ్‌లో ఉంది. ఇది కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం గోబెల్స్‌ ప్రచారానికి పూనుకుంది. యాజమాన్యాలు వివిధ రంగాలలో కార్మికులను నియమించుకొని పని చేయించుకుంటారు. వారందరి పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా ఆయా రంగానికి సంబంధించి కార్మిక చట్టాలను రూపొందించారు. నేడు ప్రభుత్వం అన్నింటిని గుండుగుత్తగా, అడ్డగోలుగా సవరించింది. దీని వలన కార్మికవర్గానికి నిర్దిష్ట ప్రయోజనాలు అందకుండా దూరమవు తున్నాయి. కార్మికవర్గాన్ని ప్రభుత్వం నుంచి అందే సంక్షేమాల నుంచి ఉద్యోగ భద్రత నుంచి దూరం చేయడానికే ప్రభుత్వం ఈ కుట్రలకు దిగింది.
ఇండిస్టియల్‌ రిలేషన్‌ కోడ్‌ 2020 : ఈ కోడ్‌లో మూడు కేంద్ర కార్మిక చట్టాలను క్రోడీకరించారు. 1.పారిశ్రామిక వివాదాల చట్టం 1947, 2.కార్మిక సంఘాల నిర్మాణ చట్టం 1926, 3.ఇండిస్టియల్‌ ఎంప్లాయిమెంట్‌ స్టాండింగ్‌ ఆర్డర్‌ చట్టం 1946. ఈ చట్టాలను కార్మికవర్గం పోరాడి సాధించుకుంది. వీటిని ఒక్క కలంపోటుతో ఏకపక్షంగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా సవరించింది. కార్మిక వర్గానికి సమ్మె జన్మహక్కు లాంటిది. యజమానులతో బేరసారా లకు, తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె ఉపయోగపడుతుంది. పారిశ్రామిక వివాదాల చట్టం సమ్మె చట్టబద్ధ హక్కుగా పేర్కొన్నది. కానీ ఈ సవరణ సమ్మెకు తూట్లు పొడవడం తప్ప మరొకటి కాదు. యజమానులకు అధిక అవకాశం కల్పించి కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే విషయమే తప్ప ఇందులో మరొకటి లేదు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం పరిశ్రమలో వచ్చిన వివాదాన్ని సంబంధిత జిల్లా, రాష్ట్ర లేబర్‌ అధికారులు కన్సిలేషన్‌ మీటింగ్‌ నిర్వహించి పరిష్కరించవచ్చు. కానీ నేడు ఈ కోడ్‌ వివాదాలను ట్రిబ్యునల్‌లో పరిష్కరించాలని పేర్కొన్నది. ట్రిబ్యునల్స్‌ అంటేనే ఆలస్యానికి నిలయాలు. అనేక సంవత్సరాలుగా వివాదాలు పరిష్కారం కాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సవరణ కార్మికవర్గానికి ఏవిధంగా ప్రయోజనకర మైనది?
యాజమాన్యాలు కార్మికులను అడ్డగోలుగా తొలగించడానికి పారిశ్రామిక వివాదాల చట్టం అడ్డంకిగా ఉంది. ఈ కోడ్‌ ఆ అడ్డంకులను తొలగించింది. దీనితో కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ యజమానులకు అధిక స్వేచ్ఛను ఈ కోడ్‌ కల్పించింది. నేడు ప్రభుత్వం సవరించిన, కుదించిన ఇండిస్టియల్‌ రిలేషన్‌ కోడ్‌ 300 మందికి పెంచడం దారుణం. చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలు తక్కువ మంది కార్మికులతో నడుస్తున్నాయి. మూడు వందల మంది ఉంటేనే అనుమతి అవసరం అనేది ప్రమాదకరం, ఇది యాజమాన్యాలకు లాభకరమైన విషయం. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న సంఘ నిర్మాణ హక్కుకు తూట్లు పొడవడం ఈ కుదింపు చట్టంలో ఉంది. నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇండిస్టియల్‌ రిలేషన్‌ కోడ్‌ పరిశ్రమ సంబంధాలను మరింత ప్రమాదకరమైన స్థితిలోకి నెడుతుంది. కేంద్ర కార్మిక చట్టాలను సులభతరంకై, నవీనీకరణకై కోడ్‌లుగా కుదించా మన్నది పచ్చి బూటకం. సింప్లిఫై, మోడ్రనైజేషన్‌ అంటే కేవలం యాజమాన్యాలకు సులభతరంగా ఉండడానికే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణలు, కుదింపులకు పూనుకున్నది.

- నాదేండ్ల శ్రీనివాస్‌
సెల్‌: 9676407140

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేట్‌ - కాషాయ కూటమికి ప్రతిఘటన
మార్చి 8-మహిళల భద్రత - సవాళ్ళు
శ్రామిక మహిళా పోరాటం వర్థిల్లాలి
బీజేపీ టూల్‌కిట్టు - చమురు బాండ్ల లోగుట్టు
బీజేపీ టూల్‌ కిట్టు - చమురు బాండ్ల లోగుట్టు
వ్యవస్థ ఉన్నతం.. వ్యాఖ్యలు పాతాళం
మోడీ ఇమేజ్‌ మసక బారుతోంది
పురాణాలకు చారిత్రక ఆధారాలుండవు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మన కర్తవ్యం
ప్రశ్న గెలవాలి
వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే
మోడీ గారడీ!
విలువల చెలికాడు
లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
జర చెప్పండి ప్లీజ్‌...
భూమి మనిషి సొంతమా?
భారత ప్రజాస్వామ్యం బతుకు పోరాటం చేయాలి
ప్రభుత్వ రంగాన్ని అమ్ముకుంటే రేపు పుట్టగతులుండవ్‌...
నిజమైన దేశభక్తుడు...
సంక్షోభాలు - సైన్స్‌ సమాధానాలు
జీవ రహస్యం
పైత్యం పీక్‌ స్టేజ్‌!
మాతృదేశం వీడారు.!
చివరకు బరిలోకి....
కార్పొరేట్‌ కబ్జాని అడ్డుకోవాలి
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
ఆవు.. అబద్ధాలు.. నిజాలు..
మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?

తాజా వార్తలు

10:40 AM

అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి

10:36 AM

రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత

10:26 AM

ప్రియుడిపై పెట్రోల్‌ బాంబు దాడి

10:10 AM

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

09:20 AM

రౌడీషీటర్ దారుణ హత్య

09:08 AM

భార్య చేతులు క‌ట్టే‌సి నోట్లో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ పోసి

08:48 AM

ఫిలింనగర్‌లో దారుణం...

08:25 AM

కాచిగూడలో నిప్పంటించుకుని నవ వధువు ఆత్మహత్య

08:09 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:46 AM

14 నెలలకే వధువు ఆత్మహత్య

07:25 AM

రంగానగర్‌లో యువకుడి దారుణ హత్య

07:14 AM

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు...

07:00 AM

రెండో డోసు తీసుకున్నాక కరోనా పాజిటివ్..!

06:46 AM

మహిళలకు యశోద ఆస్పత్రి ప్రత్యేక ప్యాకేజీ

06:44 AM

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌

06:34 AM

కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు

09:59 PM

అదే జరిగితే 100 ఏళ్లు వెనక్కిపోతా: హరీశ్ రావు

09:48 PM

రెండో డోసు తీసుకున్నాక డాక్టర్ కు కరోనా

09:29 PM

ఈ నెల 15 త‌ర్వాత తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు

09:15 PM

మహా­రా­ష్ట్రలో 10,187 కరోనా కేసులు నమోదు

09:09 PM

ఎన్నికల్లో బీజేపీకి యువత సరైన సమాధానం చెప్పాలి : కేటీఆర్

08:51 PM

బస్సులో మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు

08:35 PM

బాంబు‌ పేలుడు.. 20 మంది మృతి

08:29 PM

మనిషి అలికిడి లేక.. ఆవిష్కరణ

08:14 PM

దేవాలయాలపై దాడుల వెనుక ఉన్నది హిందుత్వవాదులే : ఒవైసీ

08:08 PM

తహసీల్దార్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న మహిళా రేషన్‌ డీలర్

07:33 PM

బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు తీవ్ర అస్వస్థత..

07:26 PM

ఫొటో చూసి ఓకే చెప్పింది..ప్రత్యక్షంగా చూసి పారిపోయింది

07:16 PM

అనంతపురం జిల్లా సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

07:13 PM

బాలుడిపై మహిళ లైంగికదాడి.. గర్భవతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.