Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ద్వేషమే చట్టంగా మారితే ! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 20,2021

ద్వేషమే చట్టంగా మారితే !

మాజీ ప్రధానమంత్రి చౌదరీ చరణ్‌ సింగ్‌, 1954లో ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, కులాంతర వివాహాలు చేసుకోవాలని కోరుకొనే వారికి, గతంలో చేసుకున్న వారికి మాత్రమే గెజిటెడ్‌ ఆఫీసర్స్‌గా పదోన్నతులు ఇచ్చే విధంగా చట్టం తేవాలని సూచించారు. ఈ ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారు. భారత ప్రజల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు, భంగం వాటిల్లుతుందని నెహ్రూ ఈ ప్రతిపాదనను నిరాకరించారు.
సుదీర్ఘ కాలం తరువాత, ఇప్పుడు ఆనాటి చరణ్‌ సింగ్‌ రాష్ట్రం (ఉత్తరప్రదేశ్‌)లో, ప్రభుత్వం మతాంతర వివాహాలను నేరపూరితం చేస్తూ ఆర్డినెన్స్‌ జారీచేసింది. యూపీ ప్రభుత్వం దృష్టంతా ముస్లిం యువకులు హిందూ యువతులను వివాహం చేసుకోకుండా కఠినంగా నిరోధించడంపైనే కేంద్రీకరిస్తుంది. మతపరమైన మార్పిడులను క్రమబద్ధీకరించే వంకతో వారు ఈ విధమైన ఆర్డినెన్సులను తెస్తున్నారు.
యూపీలో చేసిన చట్టం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పరిపాలించే మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలలో ప్రామాణికమైనదిగా కాపీకొట్టారు. యూపీకి ప్రక్కనే ఉన్న మరొక బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌కు చెందిన సాంఘిక సంక్షేమశాఖ నిరంతరాయంగా మతాంతర, కులాంతర వివాహాలను ప్రోత్సహించే పథకాలతో, పత్రికా ప్రకటనలు ఇస్తూ ఉంటుంది. ఈ ప్రకటన మత పరమైన దృక్పథం కలవారిని ఆందోళనకు గురిచేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో, మత స్వేచ్ఛ పేరుతో అనేక ప్రజా వ్యతిరేక చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పత్రికా ప్రకటనను వారి ప్రభుత్వ విధానాల అతిక్రమణగా భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత అధికారిపై దర్యాప్తుకు ఆదేశించారు.
బ్రహ్మ సమాజానికి చెందిన కేశవ చంద్రసేన్‌ ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా, 1872లో బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం, ఒక చట్టాన్ని ముందుకు తెచ్చింది. ఆ వినతి పత్రంలో, భిన్న నేపథ్యాలు కలవారు తమ మనస్సాక్షికి అనుగుణంగా వివాహం చేసుకోవడానికి అనుమతించాలని డిమాండు చేసాడు. స్వతంత్ర భారతదేశంలో 1954లో చేయబడిన ప్రత్యేక వివాహ చట్టాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ, వలసవాద అవసరాలకు అనుకూలంగా చట్టాలలోని మత సంబంధమైన విషయాలను తొలగించాలనే నిర్ణయాన్ని చేసింది. ఏమైనా అది ఇంకా ప్రభుత్వ జోక్యాన్ని అనుమతించింది. వ్యక్తిగత చట్టాల వలే కాకుండా ముందుగానే వినతి పత్రాలు ఇచ్చే విధంగా సవరణ చేసింది. కలిసి ఉన్న జంటలు కానీ, జంటలు లేక జీవిత భాగస్వాములు కానీ పెండ్లి చేసుకోకుండా ఈ చట్టం తేబడింది. కానీ ఈ నిబంధన మతపరమైన సామాజిక బృందాలచే, అలాంటి కలయికలు జరగకుండా దుర్వినియోగం చేయబడింది.
ఈ నేపథ్యంలోనే భారతదేశంలో, ఈమధ్యకాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో అనేక చట్టాలు ప్రవేశ పెట్టడాన్నిచూస్తున్నాం. వాటిలో ప్రధానంగా, గోవధ, వివాహ, మతమార్పిడులను ఆసరాగా చేసుకుని, ముస్లింలను లక్ష్యంచేస్తూ దాడులు చేయడం, బహిరంగ ప్రదేశాలను అందరూ కలిసి వినియోగించుకోవడానికి అనుమతించకపోవడం, ఈ రిపబ్లిక్‌లో పౌరులుగా సమాన హక్కులను తిరస్కరించడం జరుగుతూ ఉంది. ఈ విధానం భారతదేశంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రోజువారీ జీవన విధానాన్ని, సౌభ్రాతత్వాన్ని నాశనం చేస్తుంది. యూపీ ప్రభుత్వంచే జారీ చేయబడిన ఆర్డినెన్స్‌ 2020 ద్వారా ''చట్టబద్ధంగా లేని మతమార్పిడులను నిషేధించడం ఆర్డినెన్స్‌ 2020'' అదే విధంగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'బిల్లు 2020' బిల్లులు ప్రత్యేకంగా నాలుగు విధాలుగా విషపూరితమైనవి.
రాజ్యాంగానికి లోబడి ప్రతి పౌరుడు తనకున్న హక్కులను వినియోగించుకోవడానికి, బాధ్యతలు నిర్వర్తించడానికి వీలుంటుంది. ఈ కొత్త చట్టాలు వ్యక్తిగత పౌరులకు బదులుగా మతపరమైన సమాజాలను ప్రాథమిక సంస్థలుగా గుర్తిస్తాయి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు వ్యక్తిగతంగా స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించడానికి అనుమతిస్తుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మన రిపబ్లిక్‌ యొక్క చట్రాన్ని ప్రాథమికంగానే వక్రీకరిస్తున్నాయి.
కొందరు, రాజ్యాంగం ప్రధానంగా మైనారిటీలకు, అస్పశ్యుల కు ఇచ్చిన హక్కులను గూర్చి వాదిస్తూ ఉంటారు. ఇది కేవలం వారు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను, వ్యక్తులుగా తమ హక్కులను అనుభవించటానికి పౌరులుగా వారు, వారి సామర్థ్యానికి దూరం కాకుండా చూడడమే లక్ష్యమని వారు అంగీకరించవలసి ఉంటుంది. ప్రపంచాన్ని హిందూ ముస్లింల మధ్య విభజనగా చూసినప్పుడు అధునాతనమైన ప్రపంచంలో వ్యక్తులుగా ప్రతి భారతీయునికి ఇవ్వవలసిన ప్రాథమికమైన స్వయంప్రతిపత్తి అనే హామీకి భంగం కలుగుతుంది.
రెండవది, వీరు చేసిన ఈ చట్టాలు, వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రశంసిస్తూ, 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిర్ద్వంద్వంగా ఉల్లంఘించినట్లే అవుతుంది. సామాజిక సంబంధాలలో రాజ్యం యొక్క జోక్యం ఇద్దరు వ్యక్తుల మధ్యనున్న సామరస్య పూర్వకమైన సంబంధాన్ని, రాజ్యాంగం యొక్క ప్రాథమిక చట్రాన్ని ఉల్లంఘించి నట్లే అవుతుంది.
మూడవది, ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతి లేకుండా వ్యక్తులు తమ వ్యక్తిగత విశ్వాసాలను పాటించే హక్కు లేకుండా దూరం చేస్తాయి. ఈ కొత్త చట్టాలకు లోబడి ప్రతి ఒక్కరి నుండి, అనేక రకాలుగా పోలీసుల నుండి, స్థానిక సంస్థల నుండి, మతపరమైన బందాల నుంచి, కుటుంబాల నుండి జోక్యం చేసుకోవడానికి తగిన అవకాశం ఇవ్వబడి, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి చోటు లేకుండా చేస్తాయి. వృత్తిని మార్చుకునే విషయంలో గానీ, జాతీయత విషయంలో కానీ, ఎన్నికలకు సంబంధించిన ఎంపికలో, రాజకీయ పార్టీల విషయంలో కూడా ఎలాంటి జోక్యాన్ని అనుమతించరాదు . సుప్రీంకోర్టు 1977లో ఇచ్చిన తీర్పు, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాలలో మతమార్పిడుల విషయంలో గతంలో విధించిన నిబంధనలను సమర్థించింది. ఆ విధంగా తీర్పు ఇవ్వడానికి కారణాన్ని కూడా సుప్రీంకోర్టు వివరించింది. బలవంతంగా మతమార్పిడి చేసినా, మోసం చేసి ఆకర్షించినా, కపటంతో లోబరుచుకున్నా, జరిమానా విధించేందుకు వీలుగా ఆదేశించవలసి వచ్చిందని సుప్రీంకోర్టు వివరించింది. మరొక విషయం ఏమంటే ప్రతి పౌరుడు తనకిష్టమైన వృత్తిని, మతాన్ని ఆచరిస్తూ దాని ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఒత్తిడి ద్వారా గాని, బలవంతంగా గాని లేక మరే విధమైన ఆకర్షణ పద్ధతుల ద్వారా గాని ఇతరులహక్కులలో జోక్యం చేసుకోవడాన్ని, వారి అభిప్రాయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25(1)ను అతిక్రమించడమే. పై ఆర్టికల్‌ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ప్రచారాన్ని వివాదాస్పదం చేస్తూ 1977లో ఆర్టికల్‌ 25లో ఉన్న స్వేచ్ఛ అనే పదాన్ని వెనక్కి తీసుకుంది. డాక్టర్‌ అంబేద్కర్‌ బౌద్ధమతంలోకి సామూహికంగా మారినందువల్ల జైలు శిక్షకు గురవుతాడనే దృష్టితోనా!? 1977 తీర్పును వెనక్కి తీసుకోవడానికి బదులుగా ఈ చట్టాలు వ్యక్తుల యొక్క విశ్వాసం ప్రకారం ఎన్నుకునే స్వేచ్ఛను మరింత నేరపూరితం చేస్తాయి.
నాలుగవది, కొత్తచట్టానికి ప్రాతిపదిక పూర్తిగా పురుషాధిక్యతతో కూడుకున్నది. మతపరమైన అభిమానాలతో, దురభి మానాలతో 1920 దశకంలో భారతావని ఒక పీడ కలగా మారింది. పోటీతత్వంతో కూడిన హిందూ మతోన్మాదం ఉత్తర భారతదేశంలో పశువుల వలె లాక్కెళ్లబడిన స్త్రీలు, నేడు కూడా అటువంటి అనుభవాలను చవి చూస్తున్నారు. ప్రమాదకరమైన అవాస్తవమైన ''లవ్‌ జిహాద్‌'' పేరుతో యుక్తవయసు ఆడపిల్లలను తమ ఆస్తిగా భావిస్తూ, ఇది కేవలం ఒక పాంప్లెటో, వాట్సప్‌ సమాచారమో కాదనే విషయం మరిచారు. అది ఇప్పుడు ఒక చట్టంగా మారింది. 2017 లో చట్టవిరుద్ధంగా మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్‌ 2020 యొక్క దారుణమైన చీకటి ఫలితాలను ప్రత్యక్షంగా గమనించాము. ఈ చట్టం కేరళకు చెందిన ఆరోగ్య కార్యకర్త ''హదియా' విషయంలో ఎదురైంది. ఒక సంవత్సరం తర్వాత తన వైవాహిక విశ్వాసంతో ''ఇస్లాం'' స్వీకరించినప్పుడు ఈ సమస్యను ఆమె ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ చట్టం ముస్లిం యువకులను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ హిందూ యువతులకు కూడా సజీవ నరకంగా మారింది.
భారతదేశం తాను ఎంచుకున్న మంచి లక్ష్యాలతో సామాజిక మార్పులను సాధించింది. మన రిపబ్లిక్‌ లో మంచి లక్ష్యాలను సాధించాలనే కోరికతో విలువలతో కూడిన చట్టాలను రూపొందించినందుకు మనం కతజ్ఞులమై ఉండాలి. మన రాజ్యాంగం, మనం ఆచరించాలి అనే కోరికతో ఉన్నతమైన లక్ష్యాలను రూపొందించింది. కానీ భారతీయులు ఎన్నడూ ఆ స్థాయిలో జీవించడం లేదు. ఉన్నత లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా ఉంటూ నెమ్మదిగా ముందుకు వెళుతున్నాం. గతం కంటే మెరుగ్గా పురోగమిస్తున్నాం. అన్ని చట్టాలు ఆ లక్ష్యాలను క్లుప్తంగా అయినా అనుకున్నది సాధించాలి. ప్రస్తుతం తెచ్చిన కొత్త చట్టాలు పై లక్ష్యాలకు భిన్నంగా ఉన్నాయి. అవి ప్రభుత్వ అధికారాన్ని, చట్టాలను కూడా మత పక్షపాత ఆధిపత్య భావంతో ఉంచుతాయి. ఇది తమ పాలనలో వివాహ మరియు స్నేహాలను, సాంగత్యాలను, సావాసాల విషయంలో తిరోగమన భావాలను ప్రవేశపెడుతుంది. మతాంతర వివాహాలు 2.5శాతానికి తక్కువగానే ఉండవచ్చు. కాని వారిచ్చే వాగ్దానాల సంఖ్య అంచనాలకు మించి ఉంటుంది. వారు అందరు పౌరులు సమానమనే భావంతో పాటు స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను పునరుద్ఘాటిస్తారు.
''లవ్‌ జిహాద్‌ గురించి మద్దతుదార్ల పుకార్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటికి ఆధారమేమీ లేదని పార్లమెంటులో ధృవీకరించింది. అది పూర్తిగా గర్హనీయమైనది. నైతికంగా చెడు సాంప్రదాయం కలది. అది అపనమ్మకమనే విత్తనాలను నాటుతోంది, కాబట్టి ప్రమాదకరమైనది బహుళత్వంతో కూడిన ప్రజాస్వామ్య దేశాలు ఉండవలసిన తీరు దానికి ఉండవలసిన ప్రాథమికమైన సూత్రాలను మార్పు చేస్తుంది. రాజ్యాంగ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని నిలబెట్టాలంటే కోర్టు తనంతట తానుగా ఈ చట్టాలను తిరస్కరించవలసి ఉంటుంది.
1935, సెప్టెంబర్‌ 13న హిట్లర్‌ న్యూరెన్‌ బర్గ్‌ చట్టాలను తీసుకొచ్చినప్పుడు జర్మన్‌, జూయిష్‌ పిల్లల యొక్క మిశ్రమ సంతతిగా మారి అధోగతి పాలవుతుందనే భయం స్వచ్ఛత అనే ఆలోచనతో నాజీలు నిమగమయ్యారు. జనాభాలో 50శాతం యూదులు 50శాతం ఆర్యన్‌ల వల్ల నాజీ ఆలోచనలకు ప్రమాదకరమని నాజీలు భావించారు. అలాంటి వైవాహిక, లైంగిక సంబంధాలను నిరోధించడం అనే ఆలోచనలకు మోసపూరితమైన ''నరవంశశుద్ధి'' అనే సామాజిక రాజకీయ ఆలోచనాతత్వానికి దగ్గర సంబంధం ఉంది. విచారించదగ్గ విషయం ఏమంటే ఈ చట్టాలు తెచ్చినప్పుడు తగినంత నిరసనలు వెలువడలేదు. ఈ చట్టాలు మిగిలిన ఒక దశాబ్ద కాలం పాటు, నాజీ సామ్రాజ్య కాలం నాటి జాతి సిద్ధాంతానికి మార్గ దర్శకత్వం వహిస్తూ ముగింపు పలికాయి. ద్వేషమే చట్టంగా మారితే మన సమాజం, దేశం మూల్యం చెల్లించవలసి ఉంటుందనే విషయాన్ని మరువకూడదు.

- సీమా ఛిస్తీ
(హిందూ' సౌజన్యంతో)
అనువాదం: మల్లెంపాటి వీరభద్రరావు,
సెల్‌:9490300111





మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేట్‌ - కాషాయ కూటమికి ప్రతిఘటన
మార్చి 8-మహిళల భద్రత - సవాళ్ళు
శ్రామిక మహిళా పోరాటం వర్థిల్లాలి
బీజేపీ టూల్‌కిట్టు - చమురు బాండ్ల లోగుట్టు
బీజేపీ టూల్‌ కిట్టు - చమురు బాండ్ల లోగుట్టు
వ్యవస్థ ఉన్నతం.. వ్యాఖ్యలు పాతాళం
మోడీ ఇమేజ్‌ మసక బారుతోంది
పురాణాలకు చారిత్రక ఆధారాలుండవు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మన కర్తవ్యం
ప్రశ్న గెలవాలి
వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే
మోడీ గారడీ!
విలువల చెలికాడు
లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
జర చెప్పండి ప్లీజ్‌...
భూమి మనిషి సొంతమా?
భారత ప్రజాస్వామ్యం బతుకు పోరాటం చేయాలి
ప్రభుత్వ రంగాన్ని అమ్ముకుంటే రేపు పుట్టగతులుండవ్‌...
నిజమైన దేశభక్తుడు...
సంక్షోభాలు - సైన్స్‌ సమాధానాలు
జీవ రహస్యం
పైత్యం పీక్‌ స్టేజ్‌!
మాతృదేశం వీడారు.!
చివరకు బరిలోకి....
కార్పొరేట్‌ కబ్జాని అడ్డుకోవాలి
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
ఆవు.. అబద్ధాలు.. నిజాలు..
మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?

తాజా వార్తలు

10:36 AM

రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత

10:26 AM

ప్రియుడిపై పెట్రోల్‌ బాంబు దాడి

10:10 AM

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

09:20 AM

రౌడీషీటర్ దారుణ హత్య

09:08 AM

భార్య చేతులు క‌ట్టే‌సి నోట్లో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ పోసి

08:48 AM

ఫిలింనగర్‌లో దారుణం...

08:25 AM

కాచిగూడలో నిప్పంటించుకుని నవ వధువు ఆత్మహత్య

08:09 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:46 AM

14 నెలలకే వధువు ఆత్మహత్య

07:25 AM

రంగానగర్‌లో యువకుడి దారుణ హత్య

07:14 AM

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు...

07:00 AM

రెండో డోసు తీసుకున్నాక కరోనా పాజిటివ్..!

06:46 AM

మహిళలకు యశోద ఆస్పత్రి ప్రత్యేక ప్యాకేజీ

06:44 AM

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌

06:34 AM

కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు

09:59 PM

అదే జరిగితే 100 ఏళ్లు వెనక్కిపోతా: హరీశ్ రావు

09:48 PM

రెండో డోసు తీసుకున్నాక డాక్టర్ కు కరోనా

09:29 PM

ఈ నెల 15 త‌ర్వాత తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు

09:15 PM

మహా­రా­ష్ట్రలో 10,187 కరోనా కేసులు నమోదు

09:09 PM

ఎన్నికల్లో బీజేపీకి యువత సరైన సమాధానం చెప్పాలి : కేటీఆర్

08:51 PM

బస్సులో మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు

08:35 PM

బాంబు‌ పేలుడు.. 20 మంది మృతి

08:29 PM

మనిషి అలికిడి లేక.. ఆవిష్కరణ

08:14 PM

దేవాలయాలపై దాడుల వెనుక ఉన్నది హిందుత్వవాదులే : ఒవైసీ

08:08 PM

తహసీల్దార్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న మహిళా రేషన్‌ డీలర్

07:33 PM

బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు తీవ్ర అస్వస్థత..

07:26 PM

ఫొటో చూసి ఓకే చెప్పింది..ప్రత్యక్షంగా చూసి పారిపోయింది

07:16 PM

అనంతపురం జిల్లా సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం

07:13 PM

బాలుడిపై మహిళ లైంగికదాడి.. గర్భవతి

06:33 PM

ఉరేసుకుని బాలుడు ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.