Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అధ్యక్షుడే నేరస్తుడు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 16,2021

అధ్యక్షుడే నేరస్తుడు

అమెరికా ప్రజాస్వామ్య సౌధం కేపిటల్‌ భవనంపై స్వయాన సిట్టింగ్‌ అధ్యక్షుడు ట్రంప్‌ ఉసికొల్పి దాడిచేయించారు. కొత్త అధ్యక్షుడిగా జోబైడెన్‌ ఎన్నికను ధృవీకరించేందుకు జరుగుతున్న ప్రతినిధుల సభ, సెనెట్‌ సంయుక్త సమావేశంపై ఆయుధాలు ధరించిన ట్రంప్‌ గుండాలు తెగబడ్డారు. ఐదుగురు మృతిచెందారు. 200ఏండ్ల అమెరికన్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. అమెరికాలో ప్రజాస్వామ్యం డొల్లతనం ప్రస్పుటమైంది. దాడి నాలుగు గంటలపాటు జరిగినా సమావేశం తన కార్యక్రమాన్ని పూర్తిచేసి బైడెన్‌ ఎన్నికను ఆమోదముద్ర వేసింది. తన ట్వీటర్‌ నుంచి దాడి చేయండని ఉసికొల్పి మొత్తం వ్యవహారాన్ని వీడియోలో చూసి, ఒకదశలో ఇక ఆపండని, హింసవద్దు చట్టాన్ని గౌరవించండని మళ్ళీ ట్రంప్‌ ట్వీట్‌ చేయడం ఆయన బరితెగింపునకు తాజా ఉదాహరణ. దేశ విదేశాల నుంచి విమర్శలు రావడంతో ట్రంప్‌ వెనకడుగు వేసి ఓటమిని అంగీకరించారు. దాడి సమయంలో నిండు సభలో ఉన్న ప్రతినిధులు టేబుళ్ల కింద, సొరంగంలో దాక్కుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ఓ ట్వీట్‌ చేస్తూ కేపిటల్‌లోకి ప్రవేశించిన వారంతా దేశభక్తులుగా కొనియాడారు.
అయితే కేపిటల్‌ భవనంపై దాడిని అమెరికా చట్టసభల సభ్యులు ఖండిస్తూ.. ఇది హేయమైన చర్యగా పేర్కొన్నారు. చట్టసభకు ఎంపికైన సభ్యులుగా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ గెలుపును దృవీకరించాల్సిన బాధ్యతను పూర్తి చేయడాన్ని ట్రంప్‌ మమ్మల్ని అడ్డుకునేందుకు యత్నించడం ప్రజాస్వామ్య ప్రక్రియకు అంతరాయం కలిగించారు. కాబట్టి ఆయనపై తక్షణం అభిశంసన ప్రకటించి, అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి అనే వాదన ముందుకు వచ్చింది. దానితో రాజ్యాంగంలోని 25వ సవరణను ఉపయోగించుకోవాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కేబినెట్‌కు సూచించారు. ఇలా అన్ని వైపుల నుంచి ట్రంప్‌కు చుక్కెదురైంది.
హింస జరగకుండా అమెరికా అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ సులభంగా దిగరన్న అంచనాలు చివరికు నిజమైనాయి. మెజారిటీ ప్రజలు పట్టంగట్టిన బైడెన్‌ను అధికారంలోకి రానివ్వకుండా ఆయన విజయాన్ని తారుమారు చేసేందుకు ట్రంప్‌, ఆయన మద్దతుదారులు చేసిన చిట్టచివరి ప్రయత్నం విఫలమైంది. ప్రపంచం ముందు అమెరికా పరువు ప్రతిష్టలను అధికారంలో ఉన్న ట్రంప్‌ దిగజార్చారు.
భద్రతకు మారుపేరుగా ఉండాల్సిన ప్రాంతంలో ఏకంగా మిలిటరీని దించాల్సిన దుస్థితి రావడం గమనించాల్సిన విషయం. ఈ ఉన్మాద ఘటనలో పాల్గొన్న ట్రంప్‌ మద్దతుదారులలో శ్వేతజాత్యా హంకారులు, కుట్ర సిద్ధాంత సమర్ధకులు, నల్లజాతి వ్యతిరేకులే ఎక్కువగా ఉన్నారు. నల్లజాతివారు ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నారు. శ్వేతజాత్యాహంకార పోలీసులు అనేక మంది నల్లజాతీయులను ఈ మధ్య అకారణంగా హత్యచేసారు. ఇంత దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించలేదని? ఇది చాలా న్యాయమైన ప్రశ్న. అమెరికా సమాజం ఎంత చీలిపోయి ఉందో ఈ సంఘటన స్పష్టం చేస్తున్నది.
ఎన్నికలు జరిగిన నాటి నుంచి ట్రంప్‌ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని చెపుతూవచ్చారు. ఓట్ల లెక్కింపులో మెయిల్స్‌ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించకూడదని డిమాండ్‌ చేశారు. తను గెలిచినట్టు తనే ప్రకటించుకున్నారు. తన గెలుపును దొంగిలించారని గగ్గోలు పెట్టారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. అధికారంలో ఉన్నది ట్రంప్‌, ఆరోపణలు చేస్తున్నది ట్రంప్‌. అంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉండి కూడా ఓటమిపాలవుతానని గ్రహించి వ్యవస్థనే బదనాము చేయడానికి పూనుకున్నారు. ఇది ట్రంప్‌ వ్యక్తిగత విషయం అనుకుంటే సరిపోదు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితి మధ్యతరగతి ప్రజలలో అసంతృప్తిని రగిలించింది. దానితో వలసవచ్చేవారిపై ద్వేషం అమెరికా సమాజంలో తీవ్రంగా పెరిగిపోయింది. ట్రంప్‌ ద్వేషపూరిత సోషల్‌ మీడియా పోస్టులు పరిస్థితి ఆజ్యం పోస్తూ అగ్నిగుండంగా మార్చివేశాయి. అందుకే ఫేస్‌బుక్‌, ట్వీటర్‌లు ట్రంప్‌ ఖాతాలను నిలిపివేయడం ఒక సముచిత చర్య.
ఎన్నికల కంటే రెండు నెలల ముందే స్టీగ్లిజ్‌ నోబుల్ బహుమతి గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త రిపబ్లికన్ల నంచే అమెరికాకు ప్రమాదం పొంచి ఉన్నదన్న మాటలు అక్షర సత్యం అని తేలిపోయింది.

- టి.ఎన్‌.వి.రమణ
సెల్‌: 8985628662








మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?
నయా ఉదారవాదానికి సవాలుగా నిలుస్తున్న రైతు ఉద్యమం
నమ్మండి.. ఇది నల్లదొరల పాలనే
లెటజ్‌ సెలబ్రేట్‌ గురూ..!
నగరాన్ని చుట్టుకోనున్న మరో కొండచిలువ
ఆదివాసీలకు బతికే హక్కులేదా?
ఉద్యోగుల పై దుష్ప్రచారం తగదు
దేశ సేవలో ఇండియన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ
భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
ప్రజా చరిత్రకారుడు ప్రొఫెసర్‌ డిఎన్‌ ఝా
హత్యలు.. న్యాయం.. రాజ్యం..
భవిష్యత్‌ రాజకీయాలపై రైతాంగ పోరాట ప్రభావం
ఎల్‌ఐసీ అమ్మకం చారిత్రక తప్పిదం
ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి...
వాళ్లవల్లే.. మేమే గ్రేట్‌
అయ్యో దేవుడికెంత కష్టం!
ఎవరు కన్న బిడ్డరా.. ఎక్కి ఎక్కి ఏడ్చింది..
'న్యూస్‌క్లిక్‌'ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
త్యాగాల పాట..
ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పా భార్గవ
ఉద్యమ 'దిశ'
రాజే ద్రోహి
నూతన విద్యావిధానం - కార్పొరేట్లకు దాసోహం
ఎన్నికల అస్త్రంగా నేతాజీ!
కార్పొరేట్లకే రక్షణ బడ్జెట్‌
ఢిల్లీ రైతాంగ ఉద్యమం ఆధునిక వర్గపోరాటం
వామపక్ష అణచివేతకు ఈక్వెడోర్‌ లో సరికొత్త కుట్ర?
భావప్రకటనా స్వేచ్ఛ - రాజకీయ హక్కు

తాజా వార్తలు

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

06:18 PM

క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు

06:10 PM

26 భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) మద్దతు

05:54 PM

ఖమ్మం జిల్లాలో మహిళను లైంగికంగా వేధించిన కార్మిక నేత..

05:39 PM

మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.