Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఇది తిరోగమనమా? పురోగమనమా? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 14,2021

ఇది తిరోగమనమా? పురోగమనమా?

డిసెంబరు 26, 2020 నాడు ఓ వార్తా పత్రిక (డెక్కన్‌ క్రానికల్‌)కు ఒక పాఠకుడు రాసిన ఉత్తర సారాంశం మనసును గగుర్పొడిచేదిగా, భవిష్యత్తును భయపెట్టేదిగా అనిపించింది. ఆ ఉత్తరం ఏమిటి, దేనికి స్పందనగా పాఠకుడు అలా రాశాడు? అన్న విషయాలు తెలుసుకునే ముందు పురాణాలు ఇతిహాసాలు సమాజ గమనాన్ని ముందుకు తీసుకెళతున్నయా లేక తిరోగమనంలో పూడ్చి పెడుతున్నాయా? అన్న భయాందోళన కలుగుతున్నది.
పశ్చిమ బెంగాల్లోని సౌమిత్రఖాన్‌ అనబడే బీజేపీ పార్లమెంటు సభ్యుడు తన భార్యకు విడాకుల నోటీసు పంపించారు. తన భార్యకు ఆయన విడాకుల నోటీసు పంపిస్తే మనకేంటి అభ్యంతరం! అనుకోకండి. విడాకులు పంపించడానికి కారణం ఏమంటే సుజాత మోండల్‌ అనబడే ఆయన భార్య తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిందట. తాను బీజేపీలో నాయకుడిగా చలామణీ అవుతుంటే తన భార్య ప్రత్యర్థి పార్టీలో చేరడం ఏమిటని వారికి కోపం వచ్చింది. సదరు బార్యాభర్తలిద్దరూ గత కొంతకాలంగా వేరు వేరుగా నివసిస్తున్నారు. సౌమిత్రఖాన్‌ కూడా మొదట్లో తృణముల్‌ కాంగ్రెస్‌ నాయకుడే. అనంతర కాలంలో బీజేపీ నాయకులుగా రూపాంతరం చెందారు. భార్యతో వేరువేరుగా నివశిస్తూ ఆమె బాగోగుల గురించి ఆలోచించని వ్యక్తి, ఆమె నిర్ణయాన్ని మాత్రం తప్పుబడుతూ విడాకుల నోటీసు పంపించడం ఆశ్చర్యకరం. వారు ఎందుకు వేరువేరుగా ఉండాల్సి వచ్చిందో, ఆ కారణాల చేత విడాకులకు వెళితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ రాజకీయమైన దురుద్దేశంతో ఒక మహిళను ఇలా కట్టడి చేయడం ఎలా సమంజసం? అయితే ఈ వ్యాసాన్ని రాయడానికి పురిగొల్పిన అంశం వీరి విడాకులో లేదా వారి రాజకీయపరమైన పూర్వాపరాలో కాదు. ఈ విడాకులపై సోషల్‌ మీడియాలోనూ ప్రధాన స్రవంతి మీడియాలోనూ జరుగుతున్న చర్చే కారణం. మొదట్లో ప్రస్తావించినట్టుగా ఈ విడాకుల నోటీసును దక్కన్‌ క్రానికల్‌ పాఠకుడు తన ఉత్తరంలో సమర్థించడానికి చెప్పిన కారణమేమంటే, రామాయణంలో ఒక వ్యక్తి సీతమ్మ పవిత్రతను అనుమానించడంతో రాముడు సీతాదేవిని త్యజించి ఆమెను అడవిలో వదిలి పెట్టాడు. ''ఇంతటి ఘనచరిత్ర గల మనం భర్తని కాదని, భార్య మరో రాజకీయ పార్టీతో సంబంధం పెట్టుకుంటే ఎందుకు సహించాలి, విడాకులు ఇవ్వడమే సరైన పద్ధతి'' అంటూ స్పందించాడు. రామాయణ ఇతివత్తంలో ఎవరో ఒక వ్యక్తి నిందించడంతో, నిండు చూలాలు అని కూడా చూడకుండా అడవిలో వదిలిపెట్టడం న్యాయమో అన్యాయమో చర్చించవలసిన అవసరం ప్రస్తుతం లేదిక్కడ. కానీ బోడిగుండుకూ మోకాలికీ లింకు పెట్టినట్టు చదివిన ఇతిహాసాలను ఈ విధంగా ఆపాదించుకుంటూ స్త్రీలను తక్కువగా చేసి చూడటం చాలా తప్పు. భర్త అంటేనే భరించేవాడు అంటారు. మరి అలాంటి భర్త భార్యను దూరంగా పెట్టి ఆమె బాగోగులు పట్టించుకోకుండా, దూరంగా నివసిస్తున్న ఆమె తనకు నచ్చిన పార్టీని ఎంచుకోవడాన్ని కాదనే హక్కు ఎవరిచ్చారు? ఓషో కథల నుంచి ఒసేరు రాములమ్మ వరకు అన్నింటా రాజకీయ దురంధరులు అమాయక అబలలను చెరబట్టడం మన పురాణ గాథల కొనసాగింపే. అందుకేనేమో ఇప్పుడు మత ఛాందసవాదంతో రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారు నిర్భయ సంఘటన మొదలు దిశ, కథువా, హత్రాస్‌ నుంచి నిన్నటి అనంతపురం స్నేహలత వరకూ మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, హత్యలపై నోరు మెదపరు, నిరసన తెలపరు, ఇంకా చెప్పాలంటే నిందితులపై మమకారం చూపిస్తారు, రక్షణగా నిలుస్తారు. ఇవన్నీ కూడా ఇతిహాసాల ప్రకారం పెద్దగా తప్పుగా అనిపించవేమో! ప్రస్తుతం నోరు మెదపకుండా, నిరసనలు తెలుపకుండా ఉంటున్నారు గానీ భవిష్యత్తులో బహిరంగంగా సమర్ధిస్తారేమో...! తలుచుకుంటేనే భయమేస్తోంది. ప్రతి ఏటా లక్షల కొద్ది పేద బాలికలూ మహిళలూ వేలంపాటల్లో కొనుగోళ్ళ ద్వారా అపహరణకు గురై కొన్నాళ్ళ తరువాత వ్యభిచార కూపాల్లో తేలుతున్నారు. ప్రస్తుతం ఇది చట్టరిత్యా నేరమే కానీ, తరువాతి కాలాల్లో స్వయంవరం పేరు మీద బహిరంగ వేలం నిర్వహించి ఆడపిల్లలను గెలుచుకొని తీసుకెళ్ళి, మహభారతంలో అర్జునుడు గెలుచుకొచ్చిన ద్రౌపదిని ఐదుగురుకి భార్యలను చేయలేదా...అంటూ వారి దుశ్చర్యకు సమర్థనగా మహాభారతాన్ని చూపిస్తారేమో! నరబలులు, కన్నెపిల్లల సమర్పణలూ అనేక గాథల్లో మనకు వినిపిస్తాయి... వాటన్నింటీని ఉటంకిస్తూ సమర్థిస్తూ పోతే ఇంకెంత ప్రమాదమో!
కుల వ్యవస్థ ఒకప్పుడు సమాజం ఏర్పరుచుకున్న పని విభజన, ''ఇది కాలక్రమేణా అంతరించిపోతుంది... అందరూ అన్ని పనులు చేసుకుంటూ సమానంగా ఉంటారు...'' అని చిన్నప్పుడు ఒక అభ్యుదయవాదంగా టీచర్లు బోధిస్తే సంతోషించాం. పౌరోహిత్యం తప్ప నేడు అన్ని వత్తులూ కులానికతీతంగా జరుగున్నవి. కానీ రాజకీయుల ప్రయోజనాల దష్ట్యా కుల కాష్టం రాజుకుంటూనే ఉన్నది. నేడు బహు ప్రాబల్యం పొందిన చిన్న జీయర్‌ స్వామి లాంటివాళ్ళు కుల వ్యవస్థ అవసరమని, ఒక కులం వాడు మరో కులానికి లొంగి ఉండడం అంతకన్నా అవసరమని, అన్ని కులాలు సమానంగా ఉండాలని కోరడం సరైంది కాదంటూ ''చేతికి ఐదు వేళ్ళు ఎలా ఉన్నాయో చూడండి'' అని చూపిస్తూ కుల వ్యవస్థలోని అసమానతలను సమర్థిస్తూ ఉంటే... ఇది తిరోగమనమా? పురోగమనమా?

- జి. తిరుపతయ్య
సెల్‌: 9951300016





మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?
నయా ఉదారవాదానికి సవాలుగా నిలుస్తున్న రైతు ఉద్యమం
నమ్మండి.. ఇది నల్లదొరల పాలనే
లెటజ్‌ సెలబ్రేట్‌ గురూ..!
నగరాన్ని చుట్టుకోనున్న మరో కొండచిలువ
ఆదివాసీలకు బతికే హక్కులేదా?
ఉద్యోగుల పై దుష్ప్రచారం తగదు
దేశ సేవలో ఇండియన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ
భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
ప్రజా చరిత్రకారుడు ప్రొఫెసర్‌ డిఎన్‌ ఝా
హత్యలు.. న్యాయం.. రాజ్యం..
భవిష్యత్‌ రాజకీయాలపై రైతాంగ పోరాట ప్రభావం
ఎల్‌ఐసీ అమ్మకం చారిత్రక తప్పిదం
ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి...
వాళ్లవల్లే.. మేమే గ్రేట్‌
అయ్యో దేవుడికెంత కష్టం!
ఎవరు కన్న బిడ్డరా.. ఎక్కి ఎక్కి ఏడ్చింది..
'న్యూస్‌క్లిక్‌'ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
త్యాగాల పాట..
ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పా భార్గవ
ఉద్యమ 'దిశ'
రాజే ద్రోహి
నూతన విద్యావిధానం - కార్పొరేట్లకు దాసోహం
ఎన్నికల అస్త్రంగా నేతాజీ!
కార్పొరేట్లకే రక్షణ బడ్జెట్‌
ఢిల్లీ రైతాంగ ఉద్యమం ఆధునిక వర్గపోరాటం
వామపక్ష అణచివేతకు ఈక్వెడోర్‌ లో సరికొత్త కుట్ర?
భావప్రకటనా స్వేచ్ఛ - రాజకీయ హక్కు

తాజా వార్తలు

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

06:18 PM

క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు

06:10 PM

26 భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) మద్దతు

05:54 PM

ఖమ్మం జిల్లాలో మహిళను లైంగికంగా వేధించిన కార్మిక నేత..

05:39 PM

మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.