Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సమస్యల సమాహారం సం'క్రాంతి' | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

సమస్యల సమాహారం సం'క్రాంతి'

తెలుగింట అలరించే సంక్రాంతి పండుగ భిన్న వాతావరణంలో సాగిపో తున్నది. కరోనా, స్ట్రెయిన్‌ లాంటి వైరస్‌ల భయాలు వెన్నంటిన వేళ పండుగ మనకెన్నో మెలకువలను నేర్పుతోంది. సంప్రదాయాలు వెలవెల పోతున్న ఈ కాలంలో పండుగ చేసుకోవాలన్న తపన ఉన్నా సమస్యలెన్నోసాక్ష్యాత్క రిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, చేతినిండా సంపాదన లేక డబ్బుల గలగలలు కరువై పండుగ పరిమళాన్ని చిదిమేస్తున్నాయి. సరికొత్త సమస్యల సమాహారంతో సంక్రాంతి తెరపైకొచ్చింది.
సంక్రాంతి తెలుగు లోగిళ్లలో పెద్ద పండుగ. అదో గొప్ప అనుభూతి. మన పండుగల్లో ఆంగ్ల సంవత్సరాది ఆరంభంలో వచ్చే తొలి పండుగ కావడంతో సకల జనులు ఉత్సాహంగా జరుపుకుంటారు. గడచిన ఏడాదికి గురుతుగా భిన్నరుచులను, ఆస్వాదిస్తూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. నిరుడు మార్చిలో పడగెత్తిన మహమ్మారి కరోనా పుణ్యామాని పండుగ వాసనలు ఈ ఏడాది అంతంత మాత్రంగానే ఉన్నాయనేది కాల గమనం లో అందరికెరుకే. 2020లో దాదాపుగా సింహభాగం ప్రపంచవ్యాప్తంగా కరోనా కార్చిచ్చు... పండుగ అనుభూతులపై ప్రభావం చూపింది. రోజువారీ జనజీవనమే నెలల తరబడి స్థంభించి లాక్‌డౌన్లు, లాఠిన్యాల్లో చిక్కిన జనం ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో పండుగ 'క్రాంతి' అంతంత మాత్రమే.
వాస్తవ పరిశీలనలో మన సంప్రదాయాలను తరచిచూస్తే... ప్రతి సంక్రాంతికి మార్పులు అనివార్యమౌతున్నాయి. ప్రకృతి ప్రకోపాలు, జన బాహుళ్యం ఆలోచనల్లో రూపాంతరం, వేగంగా దూసుకెళుతున్న సాంకేతికతల మేళవింపు పండుగల సంస్కృతుల్లోనూ ఎన్నో మార్పులు తెచ్చాయి. సంక్రాంతి వచ్చిందంటే.... ముత్యాల ముగ్గులతో లోగిళ్లు కలకలలాడేవి. ఇప్పుడు ఈ ప్రభ చాలా మటుకు తగ్గిపోయింది. ఊళ్లన్నీ, బజార్లన్నీ తెల్లారే సరికి రంగవల్లులతో అలరించేవి. హరిదాసుల ఊసులు నామమాత్రం అయ్యాయి. ఎడ్ల పందాలు చూస్తే ఎక్కడోచోట తప్పించి కనుమరుగయ్యాయి. నిజానికి సంక్రాంతి నాటికి ఊళ్లల్లో ధాన్యపురాశులు ప్రతి ఇంటా ఉండేవి. గాదెల్లో, పురుల్లో తమపంటను ఇంటి ముందు చూసుకుని మురిసేవారు. ఇప్పుడు ఆ ధాన్యపురాశుల్లేవు. కారణం... యాంత్రీకరణతో వచ్చిన మార్పులే. మిషన్‌ కోతలు ముందుకొచ్చాయి. కుప్పలు, నూర్పిళ్లు ఇక దాదాపుగా లేనట్లే. ధాన్యాన్ని ఇంటికి చేర్చాలంటేనే రైతులకు గగనమైపోతోంది. పెరిగిన ఖర్చులు, శ్రమకు అన్నదాతలు విసుగెత్తి పోయారు. సూక్ష్మంలో మోక్షంలా సులభ పద్దతులే శరణ్యమని భావిస్తున్నారు. పండిన పంటను చేలల్లోనే అమ్మకం చేస్తున్నారు. చడీ చప్పుడు లేకుండా ముంచుకొస్తున్న వానలు తీరా పంట చేతికొచ్చే తరుణంలో చేస్తున్న చేటు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నది. ఈ సంక్రాంతికి ముందుగా నవంబరు మాసంలో విరుచుకుపడిన వర్షాలతో రైతు కుదేలయ్యాడు. పంట చేతికొచ్చే సమయం లో దిక్కులు చూడాల్సి వచ్చింది. సంక్రాంతి ముంగిట సందడి చేసే కోడి పందాలు ప్రస్తుతం కరోనా కట్టడిలో చిక్కాయి. అయినా పండుగ వేళ ఈ పందాలాట అనివార్యమే. వీటిని న్యాయస్థానాలు నిషేధించినా షరా మామూలే. రాజకీయ నాయకుల వెన్నుదన్నులతో సాగుతున్న ఈ పందాలను నిలువరించే ధైర్యం ఎవరికీ లేదనేది తెలిసిందే. ఇక చేతినిండా డబ్బున్నా ధరల దండయాత్ర చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. నిత్యావసరాల రేట్లు ఆకాశాన్నంటాయి. కూరగాయలు కొరకొర చూస్తున్నాయి. పిండి వంటలకు గ్రామాల్లో సంక్రాంతికి ప్రాధాన్యమిస్తుంటారు. సంక్రాంతికి అరిసెల వాసన, చక్రాలు జంతికల కరకరలూ సహజం. కానీ, చాలా చోట్ల ఇళ్లలో సంక్రాంతి వంటకాలు మునుపు ఉన్నట్లు లేవనే చెప్పుకోవచ్చు. ఉదాహరణకు వంటనూనెల ధరలు, పప్పుల రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే డిసెంబరు నుంచి నూనెలు కాగిపోతున్నాయి. మార్కెట్ల్లో వస్తువుల ధరల మూలంగా సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. సంప్రదాయాల గుర్తుగా వాడే మామిడి తోరణాలు గుమ్మడి కాయలు కనిపించటం అరుదే. అందరినీ ఆహ్లాదపరిచే ముగ్గుల్లో వాడే రసాయనాలు, అరటి ఆకులు ఇత్యాది ఖర్చులు అదనపు బరువే.
సంక్రాంతి వచ్చిందంటే ముందుగా ప్రయాణ ప్రణాళికలతోనే ఆలోచనలు మొదలవుతాయి. ఆఫీసులు, సెలవులు, ఆర్థిక వ్యయప్రయాసలపై లెక్కవేసుకుంటారు. నిజానికి ఈ నెల మొదటినుంచే ఊళ్లకెళ్లే టైం టేబుల్‌ రెడీ అవుతుంది. బస్సులు, రైళ్లు సొంత వాహనాలు సిద్ధం చేసుకుంటారు. అయితే ఈ సంక్రాంతిలో ఈ సందడి చాలా వరకు తగ్గిపోయింది. కరోనా కాటు, సగటు జీవి సంపాదనపై ప్రతికూల ప్రభావం, రాకపోకలపై స్పష్టతకు లేక పోవడం, వైరస్‌లపై ఎనలేని భయాందోళనలూ ఊరెళ్లటానికి అవరోధంగా మారాయి. మునుపటి జ్ఞాపకాలతో తరచి చూస్తే... చేసేపని, ప్రదేశం వేరైనా పండుగ పూటయినా కనీసం ఇంటి పట్ట్టున పదుగురిని కలవాలని అభిలషిస్తుంటారు. ఎక్కడెక్కడో ఉన్న ఊరి జనమంతా ఎక్కువ భాగం ఇళ్లకొస్తారు. బంధువులు, పిల్లా పాపలతో పల్లెలు శోభిల్లుతాయి. కబుర్లు, కాలక్షేపాలతో ఇంటింటా ఉండే సందడి చెప్పనలవి కాదు. కొత్త బట్టలు, వస్తువుల కొనుగోలుతో ప్రతి ఇంటా ఏదో ఒక అనుభూతిని ప్రోది చేస్తుంటారు. ఉన్నంతలో ఖర్చుకు వెనుకాడరు. ఇక ఈ ఏడాది సంక్రాంతి ఆఫర్లెన్ని ఉన్నా గతంలోలా ఆ ఉరవడి తగ్గిందనే సంకేతాలున్నాయన్నది వ్యాపార వర్గాల వాదన. కరోనా, పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం, ఆర్ధిక ఒడి దుడుకులు, ధరలమోత... ఇలా ఎన్నో కారణాలను వ్యాపారులు వెల్లడి స్తున్నారు. గడచిపోతున్న ఈ పండుగ ప్రభ.... గతానికన్నా భిన్నమే. ఎన్నో ప్రతికూలతల నడుమ సాగిన సంవత్సర కాలం అందరినీ ఆలోచింపజేసింది. ఏతావాతా సకల జనులకూ సం'క్రాంతే' !!

- చెన్నుపాటి రామారావు
సెల్‌: 9959021483


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మన మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు
పంట విలాపం!
నేతాజీ పేరిట తృణమూల్‌, బీజేపీ లొల్లి
ట్రంప్‌ నాయకత్వంలో కొత్తపార్టీ..?
మనిషే మహనీయుడన్న మహా మానవవాది
గ్రాంసీ ఆలోచనలు - ఆవశ్యకత
విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరి సొంతం?
డిటిహెచ్‌ లో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం
చట్టాల కోరల్లో కార్మికులు
ద్వేషమే చట్టంగా మారితే !
బడా బాబులకు భారీగా బకాయిల రద్దు
ద్వంద్వ ప్రమాణాల వాట్సాప్‌..?
ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!

తాజా వార్తలు

04:33 PM

పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్ ను రివర్స్ గేర్ లో నడిపిన రైతు..

04:32 PM

భార్య చేసిన ప‌నికి భర్త ఆత్మహత్య..

04:20 PM

నిలకడగా శశికళ ఆరోగ్య పరిస్థితి..

04:12 PM

అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

03:58 PM

ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర పతకాలు..

03:51 PM

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

03:45 PM

పెళ్లి స‌మ‌యంలో నిహారిక ‌కన్నీరు..వైర‌ల్‌ అవుతున్న వీడియో

03:42 PM

నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఆత్మహత్య..

03:28 PM

ఎప్పటికీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయరు..

03:24 PM

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఎమ్మెల్యేల రాజీనామా

03:13 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం

03:09 PM

పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్ఈసీ

03:08 PM

క‌రోనా పాజిటివ్.. ఇన్‌కం ట్యాక్స్ అధికారి అత్మ‌హ‌త్య

02:24 PM

ఓ అభిమాని పెండ్లికి హాజరైన హీరో సూర్య..

02:19 PM

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..

02:17 PM

ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో కొత్త ట్విస్టు

02:11 PM

అత్తారింటి ముందు మౌన దీక్షకు దిగిన కోడలు..

02:08 PM

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంలో విచారణ

02:02 PM

27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు..

01:56 PM

నగరంలో రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్

01:51 PM

విజయలక్ష్మీ కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారం : ఆళ్ల నాని

01:32 PM

ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌

01:32 PM

కూకట్‌పల్లిలో దుర్గామాత ఆలయంలో విగ్రహల ధ్వంసం..

01:28 PM

ఎస్‌బీఐలో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

01:17 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా గవర్నర్ చూడాలి : యనమల

01:12 PM

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా గర్జన-మహా ప్రదర్శన ప్రారంభం

01:09 PM

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

12:59 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

12:50 PM

తెలంగాణ ఆంధ్ర తారతమ్యాలు మాకు లేవు..క‌ళ‌లే మా ఊపిరి

12:44 PM

ఆజాద్​ మైదానానికి భారీగా తరలివచ్చిన రైతులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.