Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతుల ఐక్యతే ప్రభుత్వ మెడలు వంచుతుంది! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 09,2021

రైతుల ఐక్యతే ప్రభుత్వ మెడలు వంచుతుంది!

ప్రస్తుతం నడుస్తున్న రైతాంగ పోరాటంలో వివిధ వ్యవసాయ వర్గాల మధ్య ఐక్యత స్పష్టంగా కనబడుతున్నది. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలు, వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులకు దారి తీస్తున్నాయి. రాజ్యాంగం యొక్క ఫెడరల్‌ స్వభావాన్ని ఉల్లంఘిస్తున్నాయి. అదేవిధంగా బడా కార్పొరేట్‌ శక్తులు ఒక వైపు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, పేదలు, మధ్య తరగతి రైతులు మరొకవైపు, ధనిక వ్యవసాయదారులు, పెట్టుబడి దారి భూస్వాములు ఇంకొకవైపు సంఘటిత పడ్డారు. పెట్టుబడిదారి భూస్వాముల మధ్య కూడా తేడాలున్నాయి. ఈ వర్గ పోరాటానికి ట్రేడ్‌ యూనియన్‌ నాయకత్వంలో, వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు భేషరతు మద్దతు లభించడం ప్రధాన శక్తిగా మారింది. వివిధ రైతాంగ వర్గాల మధ్య పెరుగుతున్న ఐక్యతను ప్రధానమైన పురోగమనంగా చూడాలి. ఈ ఐక్యతే నయా ఉదారవాద విధానాలను తిరస్కరించడానికి దేశవ్యాప్త రాజకీయ పరిణామా లకు దారితీస్తుంది.
ఈ నేపథ్యంలోనే ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీకి దేశవ్యాపితంగా ప్రాంతీయ పార్టీలు తమ విధేయత నుంచి దూరం అవుతున్నాయి. మూడు వ్యవసాయ బిల్లులకు, విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతాంగ ఉద్యమం ఉధతం అవుతున్న నేపథ్యంలో బీజేపీకి చిరకాల భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్‌ ఎన్డీఏని వదిలి అనివార్యంగా బయటకు రావలసి వచ్చింది. దీనికి కొనసాగింపుగానే, బీజేపీకి సానుకూలంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు తమ పంథాను మార్చుకుని రైతాంగ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. డిసెంబర్‌ 8న జరిగిన భారత్‌ బంద్‌ నాటకీయంగా బీజేపీని రాజకీయంగా ఏకాకిని చేసింది. 2019 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో వ్యవసాయ రంగంలో స్వేచ్ఛా మార్కెట్‌ విధానాన్ని ప్రకటించినప్పటికీ, తన పంథాను మార్చుకొని అనివార్యంగా రైతాంగ పోరాటాలకు మద్దతు పలక వలసి వచ్చింది. రైతాంగ ఉద్యమాల వల్ల దేశవ్యాప్తంగా నూతన రాజకీయ సమీకరణలకు ద్వారాలు తెరిచినట్లు స్పష్టంగా కనబడుతున్నది.
ఈ ఉద్యమం ప్రధాని నరేంద్ర మోడీ నోటి వెంట వెలువడిన కార్పొరేట్‌ శక్తుల నినాదం ''ఒకే దేశం -ఒకే మార్కెట్‌'' యొక్క ఆట కట్టించింది. రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల విధాన హక్కులను తిరస్కరిస్తూ అమలు చేస్తున్న జీఎస్టీ విధానం వల్ల భారతదేశ ఫెడరల్‌ స్వభావం దాడికి గురయింది. కార్పొరేట్‌ శక్తులు, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి భారతదేశ మొత్తం వనరులను బలవంతంగా దోచుకోవడానికి సిద్ధపడుతున్నవి. వ్యవసాయ భూములను, వ్యవసాయ ఉత్పత్తులను, వ్యవసాయ మార్కెట్లను, గ్రామీణ వ్యాపారాన్ని, రవాణా సదుపాయాలను స్వేచ్ఛగా ఆక్రమించుకోవడానికి సిద్ధ పడుతున్నది.
కార్పొరేట్‌ శక్తులు, వారి అంతర్జాతీయ భాగస్వాములు భారత ఆర్థిక వ్యవస్థపై తమ ఆధిపత్యం ఉండాలని కోరుకుంటున్నాయి. దీనిలో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయంలో, వేతన నిర్ణయంలో, అదేవిధంగా పని గంటల నిర్ణయంలో, తమకు స్వేచ్ఛ కావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. బహుళజాతి సంస్థలు నిరంతరం భారతదేశం యొక్క స్వదేశీ ఆహార మార్కెట్లపై దష్టి సారిస్తున్నాయి. అంతులేని దురాశతో కూడిన లాభాలను సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూడు వ్యవసాయ చట్టాలు, నాలుగు లేబర్‌ కోడ్స్‌తో తెస్తూ, వ్యవసాయ రంగాన్ని కార్పోరేటీకరణ చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దొడ్డిదారిన కార్పొరేట్ల ద్వారా బహుళజాతి కంపెనీలు ప్రవేశించి, రెండు విభాగాలుగా మిళితమై, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ అమలుకు అంగీకరించటం వల్ల రాష్ట్రాలు వనరుల కొరతను ఎదుర్కొంటూ, కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక సహకారం కోసం ఎదురు చూడవలసిన స్థితి ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కార్యనిర్వాహక వర్గం జీఎస్టీ సమస్య, మూడు వ్యవసాయ చట్టాలు మరియు విద్యుత్‌ సవరణ బిల్లుపై పోరాటానికి సిద్ధపడిన బీజేపీ యేతర ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాజకీయ ఏకీకరణ చేసే ప్రయత్నాలకు సహాయకారిగా ఉంటుంది. అన్ని తరగతుల ప్రజల సమాన అభివృద్ధికి ఉపకరిస్తుంది. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం సామ్యవాదం, ఫెడరలిజం లాంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడే ఈ ఐక్యత ఒక మైలురాయిగా నిలుస్తుంది.
రాజకీయరంగంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఉత్పత్తికి మూలమైన కార్మిక, కర్షకుల మధ్య ఐక్యత పెంపొందటం. సెప్టెంబర్‌ 2020 పార్లమెంట్‌ సమావేశాల్లో హడావిడిగా చర్చ లేకుండా మూడు వ్యవసాయ బిల్లులను, నాలుగు లేబర్‌ కోడ్స్‌ను చట్టం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం యొక్క కార్పొరేట్‌ అనుకూల నగ వైఖరి బయటపడింది . ఈ చట్టాలు కార్మికులు, రైతులను తమ హక్కులను రక్షించుకోవడం కోసం అనివార్యంగా ఐక్యం చేశాయి. ఈ విధమైన కార్మిక కర్షక మైత్రి నవంబర్‌ 26న అఖిల భారత రైతాంగ పోరాటం, డిసెంబర్‌ 8న జరిగిన అఖిల భారత బంద్‌ విజయవంతం కావడంతో రుజువయింది. రెండు వారాల వ్యవధిలో అలాంటి గొప్ప సమ్మెలు ప్రజా వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి ప్రజల సంసిద్ధతను తెలియజేశాయి.
కార్మికులు, రైతాంగంతో పాటు, భూమి కలిగిన రైతులు వారితో పాటు చిన్న వ్యాపారులు, చిన్న ఉత్పత్తిదారులు భారీగా ఉద్యమాల్లో పాల్గొనడం అపూర్వమైనదే కాక, గతంలో ఎన్నడూ జరగనిది. ప్రస్తుతం జరుగుతున్న పోరాటాన్ని ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభ నేపథ్యంలో భాగంగా అంచనా కట్టాలి. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు తమ సంక్షోభాలను అధిగమించడానికి, పునాది వర్గాలను మరింత దోపిడీ చేయడానికి, వారు హుందాగా జీవించడానికి అవసరమైన ధరలు, వేతనాన్ని ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారు. కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటం సరైన మార్గంలో ప్రజా ఉద్యమంగా మారి ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్‌ శక్తుల ఉత్పత్తులను సేవలను బహిష్కరిం చాలనే నినాదంతో సరైన నిర్ణయం తీసుకున్నది. ఈ నినాదం భారత దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా స్వీకరించ బడింది. గతంలో ఎన్నడూలేని విధంగా వ్యవసాయ వర్గాలలో విస్తృతమౌతున్న ఐక్యత, భారత దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ పోరాటం మరింత సంఘటితం అవడమే కాక, రైతాంగ ఉద్యమాలను చీల్చే ప్రయత్నం చేసిన మోడీ ప్రభుత్వ మొండి వైఖరిని దఢంగా తిప్పికొట్టాయి. అసంఘటితమైన రైతు సంఘాల పేరుతో (పేపరు సంఘాలతో) ఈ మూడు కార్పొరేట్‌ అనుకూల చట్టాలకు అను కూలంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, దేశవ్యాపితంగా లక్షలాది మంది రైతులు పాల్గొంటున్న నేపథ్యంలో వారి ప్రయత్నాలు వధా అవుతు న్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా దమనకాండ ప్రయోగించడమే కాక రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి దేశ సమైక్యతకే ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తున్నది. అన్ని రాష్ట్రాలలో పెరుగు తున్న మద్దతు, నిరంతర నిరసన పిలుపులు రైతాంగ ఉద్యమానికి మరింత విశ్వాసాన్ని ఇస్తున్నాయి.
ప్రధానమంత్రి ఈ సమస్యను సొంత వ్యవహారంగా భావిస్తూ రైతాంగ సమస్యలను పరిష్కరించడానికి గానీ, చట్టాలను వెనక్కి తీసుకోవడానికి గాని ప్రయత్నించడం లేదు. ఈ మూర్ఖపు పట్టుదల అనేక వర్గాలు ఈ పోరాటంలో భాగస్వాములు కావడానికి దోహదపడుతున్నది. మోడీ అనుసరిస్తున్న ఈ వైఖరి అతని నైజాన్ని బహిర్గతం చేయటమే కాక, ఒక బలహీనమైన, నిస్సహాయ పాలకునిగా రుజువు చేసింది. ఇప్పటికే ప్రమాదాల్లో, ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో జబ్బునపడి 33 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో బందీ అయిన ప్రధాని, రైతాంగం యొక్క మహౌన్నతమైన పోరాటాన్ని గుర్తించటానికి గాని, పరిష్కరించడానికి గానీ సిద్ధపడటం లేదు. పాలకుల ఈ క్రూరమైన ఆలోచనా విధానం శిలా సదృశ్య మైన రైతాంగ పోరాటం ముందు విధానం ఓడిపోతుంది.
- పి. కృష్ణప్రసాద్‌
(వ్యాసకర్త ఏఐకెఎస్‌ జాతీయ కోశాధికారి)

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేట్‌ - కాషాయ కూటమికి ప్రతిఘటన
మార్చి 8-మహిళల భద్రత - సవాళ్ళు
శ్రామిక మహిళా పోరాటం వర్థిల్లాలి
బీజేపీ టూల్‌కిట్టు - చమురు బాండ్ల లోగుట్టు
బీజేపీ టూల్‌ కిట్టు - చమురు బాండ్ల లోగుట్టు
వ్యవస్థ ఉన్నతం.. వ్యాఖ్యలు పాతాళం
మోడీ ఇమేజ్‌ మసక బారుతోంది
పురాణాలకు చారిత్రక ఆధారాలుండవు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మన కర్తవ్యం
ప్రశ్న గెలవాలి
వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే
మోడీ గారడీ!
విలువల చెలికాడు
లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
జర చెప్పండి ప్లీజ్‌...
భూమి మనిషి సొంతమా?
భారత ప్రజాస్వామ్యం బతుకు పోరాటం చేయాలి
ప్రభుత్వ రంగాన్ని అమ్ముకుంటే రేపు పుట్టగతులుండవ్‌...
నిజమైన దేశభక్తుడు...
సంక్షోభాలు - సైన్స్‌ సమాధానాలు
జీవ రహస్యం
పైత్యం పీక్‌ స్టేజ్‌!
మాతృదేశం వీడారు.!
చివరకు బరిలోకి....
కార్పొరేట్‌ కబ్జాని అడ్డుకోవాలి
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
ఆవు.. అబద్ధాలు.. నిజాలు..
మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?

తాజా వార్తలు

09:46 PM

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..

09:32 PM

జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి

09:23 PM

స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి

08:50 PM

వరంగల్ జిల్లాలో విషాదం..

08:31 PM

ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో

08:21 PM

నీటి మీద తేలియాడే తల్లి బొమ్మ వేసిన సూక్ష్మ కళాకారుడు చోలేశ్వర్ చారి

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.