Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అమెరికాలో అగంతక రాజకీయాలు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 08,2021

అమెరికాలో అగంతక రాజకీయాలు

ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారన్నది సామెత. అమెరికా పరిణామాలు చూస్తే అది నిజమేననిపిస్తోంది. బుధవారం ప్రపంచ ప్రజాస్వామ్య సౌధమని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్ష భవనాన్ని ఓ అగంతక గుంపు ఆక్రమించుకోవటానికి ప్రయత్నించింది. ప్రపంచంలోనే అతి పెద్ద చరిత్ర కలిగిన ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటున్న అమెరికాలో ఇటువంటి పరిణామం ఊహించరానిది. కనీసం సమీప చరిత్రలో అంటే గత వందేండ్లలో ఇటువంటి సంఘటన ఇదే మొదటిది అయి ఉంటుంది. ఈ అగంతక గుంపు రాజకీయంగా మితవాద భావాలు, కరుడుగట్టిన శ్వేతజాతి పురుషాధిక్య భావాలు కలిగిన గుంపు కావటం గుర్తించాల్సిన విషయం. ట్రంప్‌ 2016 అధ్యక్ష ఎన్నికల్లో సాగించిన ప్రచారం, తర్వాత నాలుగేండ్ల పాటు కొనసాగిస్తూ వచ్చిన ప్రచారంతో ఇటువంటి తిరోగామి భావాలకు సామాజిక హౌదా లభించింది. లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించినట్టు అధ్యక్ష భవనంలో అగంతకులు లేకపోతే వారికి మద్దతుగా అగంతకుల గుంపు పోగుకావటం సాధ్యం కాదు.
ఈ గుంపు లక్ష్యం ఏమిటి? నవంబరులో జరిగిన ఎన్నికల్లో బైడెన్‌, కమలా హారిస్‌ గెలుపును అపహాస్యం చేయటమే. ఓట్ల లెక్కింపు మొదలు గెలుపు ప్రకటన వరకూ ట్రంప్‌ ఈ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూనే ఉన్నాడు. చివరకు తాను ఈ ఎన్నికల ప్రక్రియనే అంగీకరించే ప్రసక్తిలేదని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎన్ని పరిమితులున్నా అమెరికా రాజ్యాంగం నిర్దేశించిన విధి విధానాలకు లోబడి ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు వస్తున్నాయి. పాలకులు మారుతున్నారు. ప్రపపంచ ప్రజాస్వామిక అగ్రరాజ్యం అన్న కిరీటాన్ని తగిలించుకుని దేశ దేశాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అమెరికా కాళ్లూ వేళ్లూ పెడుతోంది. బహుశా అమెరికాలోని మితవాద రాజకీయ భావాలు కలిగిన వారు విదేశాల్లో అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న అగంతక రాజకీయాల నుంచి ప్రోత్సాహం పొందినట్టు కనిపిస్తోంది. తాజాగా వెనెజులాలో, బొలీవియాలో, చీలిలో ఇతర అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియను దారితప్పించేందుకు అమెరికా ఇటువంటి అగంతక రాజకీయాలకు పాల్పడింది. గత ఏడెనిమిది దశాబ్దాలుగా అమెరికా చరిత్రే ఇది. ఇటువంటి పరిణామాల గురించి వినీ, చూసి, తెలుసుకుని మితవాద రాజకీయ శక్తులు ఇదే వ్యూహాన్ని దేశీయంగా అమలు చేయబూనుకోవటానికి ప్రయత్నించిన ఫలితమే బుధవారంనాడు అధ్యక్ష భవనంపై దాడి అని చెప్పవచ్చు.
ఈ పరిణామాలు గమనిస్తుంటే మోడీ నేతృత్వంలో భారతీయ ప్రజాస్వామ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికాలో జరుగుతున్న పరిణామాల మధ్య ఉన్న పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దేశానికి నాయకత్వం వహించే బృందాలు, ప్రజాభిప్రాయ వ్యక్తీకరణ పేరుతో అగంతక రాజకీయాలకు పాల్పడే బృందాల మధ్య ఉన్న పోలికను, సారూప్యతను, సామీప్యతను ఈ పరిణామాలు మరోసారి ప్రజల ముందుకు తెస్తున్నాయి. ఏలికగా ఉన్న ట్రంప్‌ అమెరికా రాజకీయ ఆర్థిక వ్యవస్థపై ఇతరుల ఆధిపత్యం పెరిగిపోతోందని, స్వదేశంలోనే శ్వేతజాతీయులు అల్పసంఖ్యాకులుగా మారిపోతున్నారన్న ప్రచార వ్యూహానికి తెరతీశాడు. గ్రీన్‌కార్డు, వీసాల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ కోణంలోనే చూడాలి. అంటే నాలుగువందల ఏండ్లకు పైగా అమెరికా అధ్యక్ష భవనాన్ని శాసించి, ప్రపంచ రాజకీయాలను శాసించిన అమెరికా శ్వేతజాతి పౌరులకు నేడు ప్రమాదం ముంచుకొచ్చిందన్నది ట్రంప్‌ తరహా రాజకీయ నాయకుల వాదన. భారతదేంలో ఆరెస్సెస్‌-బీజేపీ నాయకుల వాదనలకు దగ్గరగా ఉండటం ఈ సందర్భంగా గమనించాలి.
నవంబరులో జరిగిన ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు అంగీకరించి ఉన్నట్లైతే ఇటువంటి అగంతక రాజకీయాల అవసరం ఉండేదే కాదు. భారతదేశంలో సైతం వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అర్హత లేకపోయినా, రాజ్యాంగ ప్రమాణాలు అనుమతించకపోయినా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని స్వంతం చేసుకున్న తీరు గత ఏడేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాము. ట్రంప్‌ నాయకత్వంలోని అమెరికా పరిణామాలకు, మోడీ నాయకత్వంలోని భారతదేశ పరిణామాలకు తేడా ఒక్కటే. ఇక్కట పార్టీ ఫిరాయింపులు. స్వేఛ్చ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వాలు ఫిరాయింపుదార్లకు భారతదేశంలో అందుబాటులో ఉన్నంత ఎక్కువగా ప్రపంచంలో మర్కెకడా అందుబాటులో లేవు. అమెరికాలో అధికారం ఎవరిదైనా శిఖరాగ్రంలో ఉన్న ఒక్కశాతం అనుభవించే ఫలితాలు, ఫలాల విషయంలో తేడా ఏమీ ఉండదు కాబట్టి అక్కడ ఈ స్థాయిలో ఫిరాయింపులు మనకు కనిపించటం లేదు.
ఇటువంటి మూకదాడులు ఈ కాలంలో గణనీయంగా పెరిగాయి. యూరోపియన్‌ దేశాల్లో మొదలైన ఈ దాడులు గత కొంతకాలంగా భారతీయ ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా పరిణమించాయని నెత్తీ నోరు కొట్టుకుని మొత్తుకుంటుంటే సోకాల్డ్‌ మేధావులు పెడచెవిన పెట్టారు. చివరకు షాహీన్‌బాగ్‌పై తుపాకీ పేల్చిన అగంతకుడు నేడు పెద్దల సమక్షంలో బీజేపీలో చేరాడు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంపై దాడి చేసిన గుంపు, వాళ్లు ఉపయోగించిన వాట్సప్‌ నెంబర్లు, అందులో చెలరేగిపోయి సాగిన విద్వేష ప్రచారానికి పునాదులు వేసి వ్యూహ రచన చేసిన వాళ్లల్లో ఒక్కడూ అరెస్టు కాలేదు. తాజాగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల శిబిరంలో మద్యం సీసాలతో జొరబడి, రైతాంగాన్ని అప్రతిష్ట పాల్చేయాలని కూడా ప్రయత్నం జరిగింది. ఇటువంటి అగంతక రాజకీయాల లక్ష్యం ఒక్కటే. ప్రజల దృష్టిలో ప్రత్యర్థుల ప్రతిష్టను దెబ్బతీయటం. ఓసారి ఏ కారణంగానైనా ప్రతిష్ట దెబ్బతింటే ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయి. చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థలు, వ్యవస్థలపై అటువంటి అనుమానాలు సృష్టించటం ద్వారా ఏకంగా ఈ వ్యవస్థలకు పునాదులైన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజాభీష్టాలను తిరస్కరించటానికి, కుతర్కంతో నోరేసుకుని ఎగబడే వారిదో, భౌతిక దుశ్చర్యలకు పాల్పడేవారిదో ప్రజాభీష్టంగా మార్చటానికి పునాదులు పడతాయి. 1970 దశకం నుంచీ భారతదేశంలో సంఘపరివారం అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం ఇదే. ఇదే వ్యూహాన్ని పాశ్చాత్య దేశాల మితవాద శక్తులూ మొదటి నుంచీ అనుసరించ బూనుకుంటున్నాయి. ఈ పరిణామలు రానున్న కాలంలో ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తు చేస్తున్నాయి.

- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037




మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే
మోడీ గారడీ!
విలువల చెలికాడు
లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
జర చెప్పండి ప్లీజ్‌...
భూమి మనిషి సొంతమా?
భారత ప్రజాస్వామ్యం బతుకు పోరాటం చేయాలి
ప్రభుత్వ రంగాన్ని అమ్ముకుంటే రేపు పుట్టగతులుండవ్‌...
నిజమైన దేశభక్తుడు...
సంక్షోభాలు - సైన్స్‌ సమాధానాలు
జీవ రహస్యం
పైత్యం పీక్‌ స్టేజ్‌!
మాతృదేశం వీడారు.!
చివరకు బరిలోకి....
కార్పొరేట్‌ కబ్జాని అడ్డుకోవాలి
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
ఆవు.. అబద్ధాలు.. నిజాలు..
మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?
నయా ఉదారవాదానికి సవాలుగా నిలుస్తున్న రైతు ఉద్యమం
నమ్మండి.. ఇది నల్లదొరల పాలనే
లెటజ్‌ సెలబ్రేట్‌ గురూ..!
నగరాన్ని చుట్టుకోనున్న మరో కొండచిలువ
ఆదివాసీలకు బతికే హక్కులేదా?
ఉద్యోగుల పై దుష్ప్రచారం తగదు
దేశ సేవలో ఇండియన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ
భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
ప్రజా చరిత్రకారుడు ప్రొఫెసర్‌ డిఎన్‌ ఝా
హత్యలు.. న్యాయం.. రాజ్యం..

తాజా వార్తలు

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.