Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి మూల్యం చెల్లిస్తున్నదెవరు? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2020

ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి మూల్యం చెల్లిస్తున్నదెవరు?

ప్రధాని నరేంద్ర మోడీ నుంచి నిర్మలా సీతారామన్‌ దాకా కరోనా వల్ల ఏర్పడ్డ సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా కోలుకుంటోందో వివరిస్తున్నారు. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వద్ధి రేటు మైనస్‌ 8.6శాతం ఉంటుందని అంచనా వేసిన రిజర్వు బ్యాంకు సైతం అక్టోబరు వచ్చేసరికి కోలుకోవడం గురించే మాట్లాడుతోంది.
లాక్‌డౌన్‌ పుణ్యమా అని మన ఆర్థిక వ్యవస్థ లోతైన ఊబిలోకి దిగబడిపోయింది. ఎంతో కొంత మేరకు పరిస్థితులు తిరిగి సాధారణ స్థితి దిశగా మారుతున్నాయి గనుక ఏదో ఒక మేరకు ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకోవచ్చు. అయితే అదేమీ ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకోదగిన విషయం మాత్రం కాదు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీ మైనస్‌ 23.0శాతం వద్ధి రేటు (గతేడాది మొదటి త్రైమాసికంతో పోల్చినపుడు) నమోదు చేసింది. అటువంటప్పుడు రెండో త్రై మాసికంలో మైనస్‌ 8.6 వద్ధి రేటు (గతేడాది రెండో త్రైమాసికంతో పోల్చి చూసినపుడు) నమోదు కావడం కూడా ఎంతో కొంతమేరకు సాధారణ స్థితి వైపు అడుగులు పడటం కిందే భావించాలి.
ఇలా అట్టడుగు స్థాయి నుంచి పైకి మన ఆర్థిక వ్యవస్థ ఎగబాకుతున్నప్పుడు ఆ మెరుగుదల యొక్క స్వభావం ఏమిటన్నదానిని బట్టి ఈ మెరుగుదల ఎంతవరకూ కొనసాగుతుందన్నది ఆధారపడి ఉంటుంది. అనేక మంది కార్మికులను పనుల నుంచి తొలగించడం, పనిలో ఉన్నవారి జీతాల రేటు కుదించడం, తద్వారా యజమానుల వద్ద పోగుబడే అదనపు విలువ రేటు పెరగడం - ఈ విధంగా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనేది జరుగుతోంది. అందుచేత ఇది మధ్యలోనే నిలిచిపోవడం అనివార్యం.
2020-21 సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో నమోదైన జీడీపీని ఆ ముందటి ఏడాది అదే మూడు నెలల కాలంతో పోల్చినప్పుడు మైనస్‌ 8.6శాతం వద్ధి రేటు నమోదైనట్టు రిజర్వు బ్యాంకు చెప్పింది. అదే మూడు నెలల కాలానికి దక్షిణాసియా మొత్తంగా (ఇందులో భారత దేశానిదే పెద్ద భాగం) కార్మికుల పని గంటలు 18.2శాతం తగ్గిపోయాయి (అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం). అంటే జీడీపీ వద్ధి పడిపోయినదాని కంటే కార్మికుల పని గంటలు తగ్గిపోయిన శాతం ఎక్కువగా ఉంది. దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే గతంలో ఒక యూనిట్‌ జీడీపీకి అవసరమైన పని గంటల కన్నా ఇప్పుడు అవసరమైన పని గంటలు తగ్గిపోయాయి.
ఇలా పని గంటలు తగ్గిపోడానికి ఏదో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, తద్వారా తక్కువ మానవ శ్రమతో ఉత్పత్తి సాధించగలగడం కారణం కాదు. ఇంత స్వల్ప కాల వ్యవధిలో అటువంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం సాధ్యం కానే కాదు. మరి గతంతో పోల్చినప్పుడు ప్రస్తుత కాలంలో తక్కువ పని గంటలతో ఎక్కువ జీడీపీ ఎలా సాధ్యపడింది?
మొదటిది-గతంలో తొలగించడం సాధ్యం కాని కార్మికులను ఇప్పుడు ఖర్చు తగ్గించుకునే పేరుతో తొలగించడం, ఉత్పత్తి తగ్గించుకునే క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే గాక రెగ్యులర్‌ ఉద్యోగులను కూడా తొలగించడం జరిగింది. ఒక ఉద్యోగి కాంట్రాక్టు ఉద్యోగి అయినా, రెగ్యులర్‌ ఉద్యోగి అయినా వారి టర్నోవర్‌ (వారి ద్వారా జరిగే ఉత్పత్తి)లో తేడా పెద్దగా ఉండదు. కాని వారి జీత, భత్యాలలో తేడా ఉంటుంది. అందువలన ఒక యూనిట్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఇప్పుడు గతం కన్నా తగ్గుతుంది.
రెండవది-ఎక్కువ మంది కార్మికులు ఉత్పత్తిలో పాల్గొనే రంగాలలో కన్నా తక్కువ మంది కార్మికులతో ఉత్పత్తి జరిగే రంగాలలో కోలుకోవడం ఎక్కువగా జరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా బాగా దెబ్బ తిన్న అసంఘటిత రంగం ఇంకా కోలుకోనేలేదు. దానితో పోల్చితే తక్కువ మంది కార్మికులతో నడిచే సంఘటిత రంగంలో-అది ప్రభుత్వ రంగం కానీయండి, ప్రయివేటు రంగం కానీయండి- కోలుకున్నది ఎక్కువ.
ఇలా గతం కన్నా తక్కువ కార్మిక శ్రమతో ఎక్కువ జీడీపీని సాధించడంతో బాటు వేతనాల రేట్లలో కూడా తరుగుదల ఉంది. రిజర్వుబ్యాంకు లెక్కల ప్రకారమే కార్పొరేట్‌ రంగంలో ఖర్చులు తగ్గించుకుంటున్నారు. ఇలా తగ్గించుకునే ఖర్చులలో కార్మికులకిచ్చే వేతనాలు ముఖ్యమైన భాగం. తక్కువ మంది కార్మికులతో పని చేయించుకోవడం, తక్కువ జీతాలతో పని చేయించుకోవడం- ఈ రెండు ప్రక్రియల ద్వారా ఖర్చులు తగ్గించుకుంటున్నారు. కొన్ని కార్పొరేట్‌ రంగాలలో చాలా కాలం తర్వాత నికర లాభాలు కూడా వచ్చాయి. లాక్‌డౌన్‌ కాలంలో నిలిచిపోయిన అమ్మకాలు ఆ తర్వాత కాలంలో పెరగడం, అదే సమయంలో ఖర్చులు తగ్గడం వలన ఈ లాభాలు వచ్చాయి.
అయితే ఇలా అసంఘటిత రంగం కోలుకోకుండా ఉండిపోవడం వలన ఆ రంగంలో ఉపాధి చాలా మేరకు తగ్గిపోయింది. దానితోపాటు సంఘటిత రంగంలో కూడా రెగ్యులర్‌ కార్మికులు కొందరు పనులలో నుంచి తొలగించబడినందు వలన, తక్కినవారి జీతాలు కుదించబడినందు వలన కార్మికులకు సగటున ఒక గంటకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. అంటే ఒక వైపున జీడీపీ కోలుకుంటూ వుంటే మరో వైపున కార్మికులు మరింత పేదవాళ్ళవుతున్నారన్నమాట. అంటే జీడీపీ కోలుకునే క్రమంలో కార్మికుల నుండి యజమానులు రాబట్టుకునే అదనపు విలువ మరింత పెరుగుతున్నదని గమనించాలి.
ఈ నిర్ధారణను ధవపరిచే రెండు ఆధారాలున్నాయి. రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 887 లిస్టెడ్‌ కంపెనీల (ఆర్థికరంగం లోని కంపెనీలు మినహా) అమ్మకాలతో పోల్చితే వాటి ఖర్చులు బాగా తగ్గాయి అని, దాని ఫలితంగా గత రెండు త్రైమాసికాలలో ఎండిపోయిన ఈ కంపెనీల లాభాలు ఈ త్రైమాసికంలో బాగా పెరిగాయని తెలుస్తోంది.
ఈ కాలంలోనే ఉపాధి హామీ పథకం కింద దరఖాస్తులు చేసుకున్నవారి సంఖ్య బాగా పెరిగింది. అక్టోబరు నెలలోనైతే ఈ సంఖ్య ఏకంగా 91.3శాతం పెరిగింది! వేరే ఎక్కడా పనులు దొరకడం లేదని దీనిని బట్టి స్పష్టమౌతోంది. లాక్‌డౌన్‌ కాలంలో వలసలు రివర్సులో-అంటే పట్టణాల నుంచి పల్లెలకు-జరిగాయి. ఆర్థిక వ్యవస్థ కొంత కోలుకున్నా దానివలన గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు ఏమాత్రం మెరుగుపడలేదు. అంటే పట్టణాల్లో అసంఘటిత రంగం ఏమీ కోలుకోలేదని స్పష్టం అవుతోంది.
ఇంతగా కార్మికవర్గపు స్థితిగతులు దిగజారినా ఆర్థిక వ్యవస్థ కొంత కోలుకున్నది అంటే తమ అవసరాలను తీర్చుకోడానికి అప్పులు చేసి గాని, కొద్దో, గొప్పో కూడబెట్టుకున్న డబ్బును ఖర్చు చేసి గాని వారు సరుకులు కొనబట్టే సాధ్యపడింది. కాని ఇలా ఎంతో కాలం సాగదు కదా. ఉపాధి అవకాశాలు మెరుగు పడకుండా, ఆదాయాలు పెరగకుండా కార్మికులు వినిమయం ఎంతకాలం కొనసాగించగలుగుతారు? అందుచేత వారి వినిమయం పడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమమూ నిలిచిపోతుంది.
వామపక్షాలు, మరికొన్ని ఇతర రాజకీయ పార్టీలు, ఆర్థికవేత్తలు, కొన్ని పౌరసంఘాలు పదే పదే మొత్తుకుంటున్నా మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజల కొనుగోలుశక్తిని పెంచడానికి చేసిందేమీ లేదు. అలా చేయకపోతే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మరింత కష్టమవుతుందని చేసిన హెచ్చరికలు చెవిటివాని ముందు శంఖమూదినట్టే అయ్యాయి. తాజాగా ప్రకటించిన దానితో సహా అన్ని ఉద్దీపన పథకాలూ ప్రజలకు ఇచ్చినది చాలా స్వల్పం. కార్పొరేట్లకు మాత్రం మరింత సౌకర్యవంతంగా ఉన్నాయి. అయితే ఆ కార్పొరేట్లకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా, ''ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌'' సూచికలో భారత్‌ స్థానం ఎంత మెరుగుపడినా ఈ దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగనంతకాలం సరుకులకు డిమాండు పెరగదు. డిమాండు పెరగనంతకాలం కార్పొరేట్లు ఈ దేశంలో పెట్టుబడులు పెట్టరు.
ఈ దేశంలో డిమాండు పెరగకపోయినా ఎగుమతులను పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచవచ్చునని అనుకుందామా అంటే ఆ అవకాశాలూ కనిపించడం లేదు. గతంలో అదశ్యమైన దేశాల్లో సైతం కరోనా మళ్ళీ ప్రత్యక్షం అవుతోంది. అమెరికా వంటి దేశాల్లోనైతే అది ఇంతవరకూ తగ్గుముఖం పట్టిందే లేదు. ఈ పరిస్థితుల్లో ఎగుమతులపై ఆశలు అడియాసలే అవుతాయి.
అందుచేత మన దేశంలో వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచడమొక్కటే ముందున్న మార్గం. అటు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న ప్రజల సంక్షేమానికీ ఇదే మార్గం. అటు ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికీ ఇదే మార్గం. కాని ప్రభుత్వం మాత్రం ఈ దిశగా ఒక అడుగు కూడా వేయడం లేదు. పైగా కార్మికుల నుండి దోచుకునే అదనపు విలువను మరింత పెంచే దిశగానే దాని చర్యలు ఉన్నాయి. ఇది త్వరలోనే ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోవడానికి దారితీస్తుంది.

- ప్రభాత్‌ పట్నాయక్‌
 స్వేచ్ఛానుసరణ




మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?
రైతుల ఐక్యతే ప్రభుత్వ మెడలు వంచుతుంది!
ధర్మం నడిచేది నాల్గు పాదాలమీద కానేకాదు!
అమెరికాలో అగంతక రాజకీయాలు
పదోన్నతులకు ప్రాతిపదిక ఏమిటి?
పదవీ విరమణ వయసు పెంపు
ఇది మరో జాతీయ పోరాటం
కేరళే ప్రత్యామ్నాయం
'మార్పు మనలోనూ రావాలి.!'
చైనాపై మాటలకుస్తీ.. మోడీ విదేశీ భక్తి..
మరో ప్రమాదకర ప్రతిపాదనలు
వద్దంటుంటే రుద్దుతారెందుకు?
యోగి.. రాజ్యాంగ వ్యతిరేకి..

తాజా వార్తలు

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

12:56 PM

భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

12:51 PM

హయత్ నగర్ లో కారు బీభత్సం..

12:41 PM

పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..

12:33 PM

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

12:19 PM

ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.