Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రేమ-పెండ్లిపైన ప్రభుత్వ పెత్తనం? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2020

ప్రేమ-పెండ్లిపైన ప్రభుత్వ పెత్తనం?

''మధ్యప్రదేశ్‌ ధర్మ స్వతంత్ర విధేయక్‌ 2020'' పేరుతో శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక బిల్లును తయారు చేసినట్టు, దానిని అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించనున్నట్టు ఆ రాష్ట్ర హౌమ్‌ శాఖ మంత్రి నరోత్తం మిశ్రా యిటీవల మీడియాకు చెప్పారు. ఆ పార్టీకి అసెంబ్లీలో గల బలంతో బిల్లు ఆమోదం పొందడం, చట్టంగా మారడం లాంఛనమే. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి చట్టాలనే చేయడానికి పోటీ పడుతున్నాయి. అసెంబ్లీకి పోయే దాకా ఆగలేని ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం ఈ నెల 24న ఒక ఆర్డినెన్సును ఆమోదించింది. బీజేపీ ప్రభుత్వాలు తెచ్చిపెడుతున్న ఈ సామాజిక సమస్య మత సామరస్యతకు, దేశాభివృద్ధికి సరికొత్త సవాలుగా మారనున్నది.
యూపీ ఆర్డినెన్సులో, ఎంపీ బిల్లులో నిబంధనలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి తెలియకుండా చేసుకునే ముస్లిం-హిందూ వివాహాలను లవ్‌ జిహాద్‌ గానే పరిగణిస్తారు. నాన్‌ బెయిలబుల్‌ కేసు పెట్టి పదేండ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. పెండ్లి చేసుకోదలిచిన ముస్లిం-హిందూ జంట రెండు నెలలు ముందుగా సంబంధిత జిల్లా కలెక్టర్‌/మేజిస్ట్రేట్‌కి దరఖాస్తు చేసుకోవాలి. ''మత మార్పిడి లేకుండానే పెండ్లి చేసుకుంటాం'' అని హామీ యివ్వాలి. సదరు హామీ పత్రం పైన ఇరు మతాల పెద్దలు కూడా సంతకాలు చేయాలి. అలాంటి దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్‌వారు పబ్లిక్‌గా ప్రకటిస్తారు. ఇష్టపడిన వారు పెండ్లి చేసుకునే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలా? అది వ్యక్తుల స్వేచ్ఛా, స్వాతంత్య్రా లను హరించడం కాదా? అలా బహింగంగా ప్రకటించబడిన జంటలను లవ్‌ జిహాద్‌ను అరికట్టేందుకు సంఘపరివార్‌ నియమించిన ప్రయివేటు సైన్యం నిఘా వేసి వెంటాడుతుంది.
ప్రేమ అనేది సహజమైన విషయం. నచ్చిన వారిని ప్రేమించడం, పెండ్లి చేసుకోవడం మానవ నైజం. సహజమైన, ప్రకృతిపరమైన ఈ నియమాన్ని బీజేపీ సహించదు. ఆ పార్టీ పెద్దలు ప్రచారం చేసే పురాణాల్లో పునరుద్దరించాలని చెబుతున్న వేద కాలంలో ప్రేమ వివాహాలను కీర్తించడం జరిగింది. ఆ మాటకొస్తే శకుంతల దుష్యంతుల గాంధర్వ (ప్రేమ) వివాహం వల్లనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందనే ప్రచారం తెలిసిందే. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కూడా ప్రేమించి పెండ్లి చేసుకున్న వారు చాలామంది ఉండవచ్చు. కానీ వర్ణాశ్రమ ధర్మం పేరుతో సవర్ణ వివాహాలకే పరిమితం చేయడం హిందూత్వ శక్తులు చేస్తున్న పని. హిందూమతం రక్షణ పేరుతో మతాంతర వివాహాలను వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమించి పెండ్లి చేసుకుంటే దానిని ''లవ్‌ జిహాద్‌'' అనే ముద్రవేసి దాడి చేస్తున్నారు. ముస్లిం-హిందూ వివాహాలు మత మార్పిడి కోసమే జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అలాంటి వివాహాలను నిషేధించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ని తిరస్కరిస్తూ అలహాబాద్‌ హైకోర్టు మత మార్పిడుల కోసమే పెండ్లి చేసుకొంటున్నారనే ఆరోపణ సరైందికాదని, నిరాధారమైందని కొట్టేసింది. ముస్లింలు హిందువులను పెండ్లి చేసుకునే కేసుల్లో కుట్ర గానీ, విదేశీ నిధుల ప్రమేయంగానీ లేవని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన 'స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)' తేల్చింది. అయినా ఆ ప్రభుత్వం ''లవ్‌ జిహాద్‌'' ముద్ర వేసి ముస్లిం-హిందూ వివాహాల నిషేదానికి ఆర్డినెన్సు తెచ్చింది.
అభివృద్ధి చెందిన దేశాల్లో 'ఇంటర్‌ ఫెయిత్‌' (వివిధ మత విశ్వాసుల మధ్య) వివాహాల పట్ల అంతగా ఆంక్షలు లేవు. కొన్ని ఉన్నా చెప్పుకోదగినంతవి కావు. ప్రపంచీకరణ యుగంలో దేశాల మధ్య, ఖండాల మధ్య అంతరాలు తొలగిపోతూ అన్ని విషయాలు లిబరల్‌ (సరళీకరణ) అవుతున్న నేపథ్యంలో వివాహాల మధ్య విశ్వాసాల గోడలు నిర్మించడం తగని పని. సార్వత్రిక మానవ హక్కుల డిక్లరేషన్‌ ఆర్టికిల్‌ 16 ప్రకారం జాతి, మతం, తెగ పరిమితులతో నిమిత్తం లేకుండా మేజర్‌ అయిన పురుషులు, స్త్రీలు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం ఆర్టికిల్‌ 21 వ్యక్తిగత జీవితానికి, జీవన భద్రతకు భరోసా యిస్తుంది. మత ఆచరణ, మత ప్రచారం చేసుకునే హక్కును అనుమతించిన ఆర్టికిల్‌ 25 వివిధ మతస్థుల మధ్య వివాహాలను నిషేధించలేదు. అందువలన లవ్‌జిహాద్‌ పేరుతో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనవి. రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడడం బీజేపీ రాజకీయ విధానంగా మారిపోయింది. ఆ వైఖరినే దేశ భక్తిగా చెప్పుకుంటోంది.
మతాంతర వివాహాలను నిషేధించడం వలన వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, ఇష్టాయిష్టాలకు విఘాతం కలగడమే కాదు, మత సామరస్యానికి, దేశ అభివృద్ధికి కూడా నష్టమే. ప్రేమించి పెండ్లి చేసుకున్న వారి జీవితాలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. వారికి కలిగే సంతానం కూడా జన్యుపరమైన సమస్యలు లేకుండా శారీరకంగా, బౌద్ధికంగా ఎదిగే అవకాశాలు ఎక్కువ. ఇద్దరూ ఇష్టపడి పరస్పరం అర్థం చేసుకుని పెండ్లి చేసుకున్న వారికి ఒకరి మత విశ్వాసాలను ఒకరిపై రుద్దాలనే పట్టుదల పెద్దగా ఉండదు. తమ మతంలోకి మారితేనే పెండ్లి చేసుకుంటాననే వారు కూడా తమ పెద్దల వత్తిడి వలన ఆ విధంగా చేస్తుంటారు. కుటుంబ సభ్యులు, మత పెద్దల అదుపు ఆజ్ఞలు లేకపోతే యువతీ వయువకులు మరింత స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించే అవకాశం కలుగుతుంది. పెద్ద మతాల వారే పెద్ద మనసుతో చిన్న మతాల వారిని ఒప్పించే కృషి చేయాలి తప్ప అడ్డుగోడలు నిర్మించడం సరైందికాదు. ఇప్పటికే భారతదేశంలో మైనార్టీ మతాలకు రక్షణలేదనే అపవాదు ఉన్నది. ఇలాంటి చట్టాలు చేయడం ద్వారా అది మరింత బలపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఆ విషయం కొన్ని దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలనూ ప్రభావితం చేయవచ్చు. అంతర్జాతీయ సమాజానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా దాపురిస్తుంది.

- ఎన్‌. నారాయణ
సెల్‌:9490300577





మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?
రైతుల ఐక్యతే ప్రభుత్వ మెడలు వంచుతుంది!
ధర్మం నడిచేది నాల్గు పాదాలమీద కానేకాదు!
అమెరికాలో అగంతక రాజకీయాలు
పదోన్నతులకు ప్రాతిపదిక ఏమిటి?
పదవీ విరమణ వయసు పెంపు
ఇది మరో జాతీయ పోరాటం
కేరళే ప్రత్యామ్నాయం
'మార్పు మనలోనూ రావాలి.!'
చైనాపై మాటలకుస్తీ.. మోడీ విదేశీ భక్తి..
మరో ప్రమాదకర ప్రతిపాదనలు
వద్దంటుంటే రుద్దుతారెందుకు?
యోగి.. రాజ్యాంగ వ్యతిరేకి..

తాజా వార్తలు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

12:56 PM

భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

12:51 PM

హయత్ నగర్ లో కారు బీభత్సం..

12:41 PM

పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..

12:33 PM

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

12:19 PM

ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.