Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రజాయుద్ధ పతాక | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 26,2020

ప్రజాయుద్ధ పతాక

ఒక దేశ ప్రజల ఆకాంక్షలు నింపుకున్న దేహం అతడు
సమ సమాజ నిర్మాణ ఆశయానికి నిలువెత్తు నిదర్శనం అతడు
మానవీయ ఆచరణను బోధించే అనుభవపాఠం అతడు
ఉక్కు సంకల్పానికి ఉద్యమ రూపానికి కొండంత ఉదాహరణ అతడు
అతడే ఫైడల్‌ కాస్ట్రో. తనను తాను సమూహంలోకి వొంపేసుకుని సమూహాన్ని తనలోకి నింపుకున్నవాడే నిజమైన నాయకుడై నిలుస్తాడు. చరిత్రలో సందేశమై ప్రేరణనిస్తాడు. మనకాలంలో నివసించి, ఆచరించి, సంభాషించి, శత్రువుల నెదిరించి, విజయాలు సాధించి ప్రపంచ ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచే వ్యక్తి కాస్ట్రో. అతనొక వ్యక్తి కాదు, ఒక సమూహం. ఒక ఉద్యమం. ఒక ఆశయం. సంకల్పం, నిబద్ధత, నిజాయితి, ఒక ఆచరణ... ఎన్ని విశేషణాలయినా ఆ వ్యక్తిత్వానికి తక్కువే. క్యూబా ఓ చిన్నదేశమే కావచ్చు... కానీ ఈ ప్రపంచానికి ఘనమైన సందేశాన్నిచ్చిన ఆదేశ ప్రజల చైతన్యానికి ప్రతీక ఆయన.
కాస్ట్రో వర్థంతి సందర్భంగా ఆయన గురించి గొప్పగా చెప్పుకోవటం మాత్రమే చేస్తే అది నిజమైన నివాళిగా నిలవదు. నేటి మన ఆచరణలో ఆయన జీవితపు పాఠాలు ఏవిధంగా ఉపయోగపడతాయో ఆలోచించి, వాటిని అన్వయించుకొని ముందుకు పోవటమే ఆయనకు అసలైన నివాళి అవుతుంది. కాస్ట్రో విప్లవకారుడు, ఉద్యమయోధుడు, పోరాటంలో ముందుండిన ధీరోదాత్తవీరుడు. అంతే కాదు.. ఒక అర్థశతాబ్దికాలం ఒక దేశాన్ని పాలించిన పరిపాలనాదక్షుడుకూడా. ప్రజల ఆశలను ఆకాంక్షలను పట్టుకోగలిగిన దిట్ట. ప్రజలందరిని ఆశయాలదారిలో నిలబెట్టగలగిన నాయకుడు. అందుకే ఆయనను చదువుకోవాలి మనం. అతను దాన్నెలా సాధించాడో అవగాహన చేసుకోవాలి. ఇది ఈనాటి సందర్భాంగా మన కర్తవ్యం. మార్క్స్‌ అందించిన ఆచరణయుత సిద్ధాంతాన్ని తన దేశానికి అన్వయించి, ఎన్ని ఆటుపోటులు ఎదురైనా, దాడులు జరిగినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని నిలబడి, దేశాన్ని నిలబెట్టిన అరుణకేతనధారి కాస్ట్రో.
ఉత్తర, దక్షిణ అమెరికాకు మధ్యన ఉన్న చిన్న ద్వీపదేశం క్యూబా. స్పానిష్‌ వలస దేశంగా చాలాకాలం ఉంది. తర్వాత అమెరికా ఆధీనంలోకి వచ్చింది. స్పెయిన్‌ నుంచి వలస వచ్చిన చెరకు రైతు ఏంజెల్‌కు క్యూబా వాసియైన లినాకు 1926 ఆగస్టు 13న జన్మించిన ఏడుగురు పిల్లల్లో ఒకడు కాస్ట్రో. పుట్టింది గ్రామీణ వాతావరణంలోనే. అత్యంత పేదలు, జబ్బులతో బాధపడేవాళ్ళు, తిండి, బట్టలు లేక ఇబ్బందులు పడేవారి మధ్యే కాస్ట్రో బాల్యం గడిచింది. స్థానిక పాఠశాలలోనే ప్రాథమిక విద్య చదువుకున్నాడు. నిత్యం ప్రార్థనలు, మత బోధనల మధ్య హైస్కూల్‌ విద్య కొనసాగినప్పటికీ ఆ ప్రభావాలకు ఆకర్షితుడు కాలేదు. 'యాంత్రిక పద్ధతుల ద్వారా నాకు ఎవరూ హేతువిరుద్ధమైన భావాలు, మత విశ్వాసాలు నేర్పించలేక పోయార'ని అతనే స్వయంగా వివరిస్తాడు. హవానాలో విశ్వవిద్యాలయంలో చేరి ఆర్థిక పాఠాలు వినడం, ఆ సందర్భంలోనే కమ్యూనిస్టు మ్యానిఫెస్టో పరిచయం కావడం, న్యాయశాస్త్ర పట్టా పొందటం ఇవన్నీ అతని ఆలోచనల్లో మౌలిక మార్పులు తీసుకువచ్చాయి. ఉన్నతమైన నిస్వార్థమైన అభిప్రాయాలు లేకపోతే రాజకీయ అభిప్రాయాలకు ఎలాంటి విలువా ఉండదనీ, ఉన్నతమైన, అభిప్రాయాలు కూడా న్యాయమైన భావనలపై ఆధారపడకపోతే దేనికీ ఉపయోగపడవనీ ఆయన స్వతంత్ర అనుభవం, విశ్లేషణ ద్వారా తెలుసుకోగలిగాడు.
అమెరికా కీలుబొమ్మ బాటిస్టా అధిపతిగా ఆనాటికి క్యూబా ప్రజలు అనేక బాధలకు గురవుతున్న సందర్భం. ఒకవైపు పల్లె ప్రజలపై అత్యాచారాలు, ఆకలి, నిరుద్యోగం, కూలీల, రైతుల దుర్భర స్థితులు, లంచాలమయమైన వ్యవస్థ... మరోవైపు అమెరికన్‌ యూనిఫారాలతో కత్తులు, రైఫిల్స్‌ పట్టుకుని గుర్రాలపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే రూరల్‌గార్డ్స్‌... ఇవన్నీ చూసిన కాస్ట్రో రాజకీయ రంగంలోకి దూకాడు. క్యూబన్‌ పీపుల్స్‌ పార్టీలో వామపక్ష భావాలతో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు.
తన ఇరవైఆరో యేటనే యువగెరిల్లా పోరాటయోధులను తయారుచేసుకుని మంకోడా దుర్గంపై దాడికి పూనుకున్నాడు. నిర్బంధాలకు గురయ్యాడు. 'నాపై ఎన్ని నేరారోపణలైనా చేయండి, నేను నిర్దోషినని చరిత్ర రుజువు చేస్తుంది' అని ప్రకటించి, తిరిగి బలం పెంచుకుని 1959లో సాయుధ గెరిల్లా పోరాటంతో నియంతను బాటిస్టా తరిమికొట్టి విప్లవాన్ని విజయవంతం చేశాడు. అప్పటికే క్యూబాలో కమ్యూనిస్టులు కార్మికవర్గంలో పనిచేస్తున్నప్పటికీ పెద్ద ప్రభావాన్ని కలిగించలేదు గానీ కాస్ట్రో విప్లవంలో పాలుపంచుకున్నారు. 1965లో క్యూబా కమ్యూనిస్టుపార్టీని స్థాపించి కేంద్రకమిటీ కార్యదర్శిగా కొనసాగాడు.
ఈ విప్లవ కార్యాచరణకు ముందుగానే అర్జెంటీనాకు చెందిన ఎర్నెస్ట్‌ చేగువేరా కాస్ట్రోను కలుసుకోవడం, వారి మధ్య జరిగిన సంభాషణలతో చేగువేరా క్యూబా విప్లవంలో పాల్గొనాలని నిర్ణయించుకోవడంతో వారిద్దరి మధ్య మైత్రి పెరిగింది. ఇది దేశ ప్రజలను విముక్తి చేసే మైత్రి. దక్షిణ అమెరికా దేశాలలో అనేక విప్లవ పోరాటాలలో చేగువేరాకు కొండంత స్ఫూర్తినీ, బలాన్నీ ఇచ్చిన మైత్రి. అందుకే ''ఒక అసాధారణ వ్యక్తిగా ఫైడెల్‌ నాకు నచ్చాడు. అసాధ్యమైన కార్యాలను చేపట్టి పూర్తి చేశాడు. ఒక్కసారి క్యూబాకు బయల్దేరితే అక్కడికి చేరుకుంటానని, ఒకసారి అక్కడికి చేరుకున్నాక పోరాడతానని, పోరాడితే గెలుస్తానని ఆయనలో అపారమైన నమ్మకం ఉండేది. ఆయన ఆశావాదంతోనే నేనూ ఏకీభవించాను'' అని చెగువేరా కాస్ట్రో గురించి వివరిస్తాడు. వీరిద్దరూ ఒకే తరానికి చెందినవారు. ఒకేరకమైన సైద్ధాంతిక, ఆచరణాత్మక అభిప్రా యాలు కలవారు. వ్యక్తిత్వ భావా వేశాలూ ఒకటే. అందుకనే వాళ్ళు ఆదర్శ స్నేహితులు.
విప్లవం విజయవంతం కాగానే ప్రజానుకూలమైన దాదాపు పదిహేను వందల నూతన డిక్రీలను తీసుకొచ్చాడు కాస్ట్రో. అమెరికా పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్న అన్ని పరిశ్రమలను జాతీయం చేశాడు. వీటన్నింటినీ వ్యతిరేకించిన అమెరికా సీఐఏకు ధనాన్ని సమకూర్చి క్యూబా ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు, దాడులు మొదలుపెట్టింది. ఆ దాడి ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్ని వందల సార్లు కాస్ట్రోను చంపాలని సీఐఏ ప్రయత్నాలు చేసి విఫలమైంది. విష ప్రయోగం కూడా చేయడానికి పూనుకున్నది. ఇక దుష్ప్రచారానికి అంతేలేదు. క్యూబా దేశ బాలలు ఆహారంగా తీసుకునే పాలడబ్బాలనూ అందించ నిరాకరించి తన అమానవీయతను చాటుకొంది. సామ్రాజ్యవాదపు వికృత ప్రవర్తన ఎలా ఉంటుందో అమెరికా ప్రభుత్వం తన చేష్టల ద్వారా నిరూపించింది.
ఈ రోజున మన దేశ ప్రభుత్వం అదే అమెరికాతో అంటకాగుతూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెరపుతోంది. మన దేశంలోని ప్రజారంగ సంస్థల్నీ వ్యవస్థల్నీ ప్రయివేటు కార్పొరేట్లకు కట్టబెడుతూ ధరల పెంపునకు కారణమవుతున్నది. వ్యవసాయరంగాన్ని ప్రయివేటు పరం చేస్తున్నది. ఇది మనదేశ ప్రజల ప్రయోజనానికి వ్యతిరేకమనే విషయం క్యూబా చరిత్రను పరిశీలిస్తే మనకర్థమవుతుంది.
నేడు ప్రపంచమంతా క్యూబా వైపు చూడటానికి కారణం సోషలిజాన్ని నిర్మించడం కోసం కాస్ట్రో చేసిన కృషి ఫలాలే. ప్రపంచంలోనే వైద్య, విద్యా రంగాల్లో గొప్ప విజయాలు సాధించారు క్యూబన్లు. నేటి కరోనా నివారణ కోసం క్యూబా అరవైకి పైగా దేశాలకు తమ వైద్య సిబ్బందినీ, ఔషధాలనూ సహాయంగా పంపిస్తోందీ అంటే అది సోషలిస్టు వ్యవస్థ యొక్క గొప్పదనంగానే చెప్పుకోవాలి. ''ప్రపంచంలో ఎక్కడైనా సైనిక జోక్యానికి సామ్రాజ్యవాదం సర్వసన్నద్ధంగా ఉంటుంది. అలాంటి దేశానికి క్యూబాతో పోటీ దేనికి? విమాన వాహక నౌకలన్నిటిని ఆస్పత్రులుగా మార్చినా సరే.. అవి లక్షలాది మందికి క్యూబా అందిస్తున్న వైద్య సేవలకు సరితూగలేవు. యేటా పదిలక్షల మందికి చూపునిచ్చే శస్త్రచికిత్సలు చేయాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నాం. అమెరికా మాతో పోటీ పడగలదా? జ్ఞానాన్ని తప్ప, మారణాయుధాలను అందజేయడం మా విధానం కాదు. సాటి మనుషుల పట్ల సానుభూతితో, మాకన్నా వనరులు అధికంగా ఉన్న దేశాలకూ ఉచితంగా సేవలు అందిస్తాం. అమెరికా మాకు పోటీయే కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. చీమ, ఏనుగుకన్నా శక్తిశాలి అని రుజువైంది'' అని తమ విధానాన్ని స్వయంగా కాస్ట్రో వివరిస్తాడు. పందొమ్మిది వందల తొంభైలలో సోషలిస్టు దేశాలు కూలిపోయిన సందర్భంలో కూడా నిబ్బరంగా, మార్క్సిజంపై అచంచల విశ్వాసంతో ప్రజా ప్రయోజకమైన సోషలిస్టు వ్యవస్థను దేశంలో నిలబెట్టుకుని ప్రపంచ ఉద్యమాలకు ఒక పాఠాన్ని అందించిన వాడు కాస్ట్రో. చాలా మంది క్యూబా కూలిపోతుందని భావించారు. కానీ నిలబెట్టి నిరూపించాడు.
కాస్ట్రో వ్యక్తిత్వంలోంచి మనందరం స్వీకరించాల్సిన మరో అంశం 'సంభాషణ'. ప్రజలతో, ప్రతివారితో సంభాషించడం అనేది ఆయన అలవాటు. సంభాషణ అనేది కాస్ట్రోకు ఒక వ్యసనం కూడా. ప్రపంచం పట్ల ఆయన అంకిత భావం అద్భుతమైనది. తాను విజయవంతంగా హవానా నగరంలోకి అడుగుపెట్టిన దాదాపు వారం రోజుల్లోనే ఆయన టెలివిజన్‌లో ఏడుగంటల పాటు ఏకధాటిగా మాట్లాడారు. ఇదొక ప్రపంచ రికార్డు. అయితే ప్రజలందరూ తమ పనులు చేసుకుంటూనే ఆయన మాటలు విన్నారు. ఒక్కో సందర్భంగా రాత్రంతా సంభాషిస్తూనే ఉంటాడు. కార్యకర్తలతో, ప్రజలతో మాట్లాడితేనే ఆలోచనలు తెలుస్తాయి. మనో భావాలు, ఆకాంక్షలు అర్థమవుతాయి. బాగున్నవి స్వీకరించవచ్చు. సరైనవి కాకుంటే మార్చవచ్చు. అందుకోసం నిత్యం సంభాషించాలి అంటాడు కాస్ట్రో. అందుకే కాస్ట్రో చివరికంటా సామ్రాజ్యవాద ప్రమాదాన్ని ప్రజలకు వివరిస్తూనే ఉన్నాడు.
''చరిత్రలో వచ్చిన గొప్ప విప్లవాల మహత్తర దృశ్యం నన్ను ఉత్తేజపరచింది. కొద్దిమంది స్వార్థపరశక్తుల ప్రయోజనాల కంటే అత్యధిక జన సంక్షేమం, సంతోషాలే ముఖ్యమన్న భావాల విజయాన్ని ఈ విప్లవాలు ఘంటాపథంగా చాటిచెప్పాయి. ప్రజలందరూ సుఖంగా ఉండగలిగితే వారి కోసం నేను ఎంత మంది ద్వేషాన్నయినా సహించడానికి సిద్ధంగా ఉంటాను'' అని ఉద్ఘాటించగల ఉదాత్త మహామనిషి కాస్ట్రో.

- కె. ఆనందాచారి
సెల్‌: 9948787660


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?
రైతుల ఐక్యతే ప్రభుత్వ మెడలు వంచుతుంది!
ధర్మం నడిచేది నాల్గు పాదాలమీద కానేకాదు!
అమెరికాలో అగంతక రాజకీయాలు
పదోన్నతులకు ప్రాతిపదిక ఏమిటి?
పదవీ విరమణ వయసు పెంపు
ఇది మరో జాతీయ పోరాటం
కేరళే ప్రత్యామ్నాయం
'మార్పు మనలోనూ రావాలి.!'
చైనాపై మాటలకుస్తీ.. మోడీ విదేశీ భక్తి..
మరో ప్రమాదకర ప్రతిపాదనలు
వద్దంటుంటే రుద్దుతారెందుకు?
యోగి.. రాజ్యాంగ వ్యతిరేకి..

తాజా వార్తలు

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

12:56 PM

భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

12:51 PM

హయత్ నగర్ లో కారు బీభత్సం..

12:41 PM

పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..

12:33 PM

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

12:19 PM

ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

09:53 AM

నిర్మల్ జిల్లాలో దారుణం..

09:42 AM

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం

09:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.